You Are Here: Home » ఇతర » సామాజిక సేవ చేయాలనుకుంటున్నా – యువ రచయిత్రి భవ్యశ్రీ కొడాలి

సామాజిక సేవ చేయాలనుకుంటున్నా – యువ రచయిత్రి భవ్యశ్రీ కొడాలి

ప్రొఫైల్
DSC0a

పూర్తి పేరు  	: భవ్య శ్రీ కొడాలి
పుట్టిన తేది : ఆగస్టు 25
జన్మస్థలం : విజయవాడ
తల్లిదండ్రులు : విజయలక్ష్మి,
శ్రీనివాస్‌ రావు
చదువు : ప్రీ మెడికల్‌ డిగ్రీ
కోర్సు, ఆమెరికా
వృత్తి : రచయిత్రి
కెరీర్‌ ప్రారంభం : 2012
తొలి రచన : విండిక్టివ్‌ (2012)

ధీర : రచనపై ఆసక్తి ఎలా కలిగింది ?
భవ్య శ్రీ : చిన్న నాటి నుంచే ఏదైనా వైవిధ్యంగా చేసి నా ప్రతిభా పాటవాలను నిరూపించుకోవాలనే తపన ఉండేది. కేవలం సరదాకోసమే రాయడం మొదలుపెట్టాను. పాత్రలు సృష్టించడం..వాటిని కథలోకి నడిపించడం ఇవేవీ ముందుగా అనుకోకుండానే అలా రాసుకుంటూ వెళ్లిపోయాను. కథలో తరువాత ఏం జరుగుతుందో నాక్కూడా తెలియదు. కానీ కథ అలా అలా వెళ్లిపోయింది. మొత్తం మీద 3 నెలల్లో నవలను పూర్తిచేయగా …మొదట ఆరు నెలల్లోనే 25వేలకు పైగా అమ్ముడుపోయాయి.

ధీర : కుటుంబ సభ్యుల సహాకారం ఎలా ఉండేది?
భవ్య శ్రీ : నాన్న కొడాలి వెంకటేశ్వర రావు, అమ్మ విజయలక్ష్మీ. ఇద్దరూ ఐటి రంగంలో నిపుణులు. ళాభిలాష ఉన్న వ్యక్తులు కావడంతో నాలో సాహిత్యాభిలాషను గుర్తించి నిత్యం ప్రోత్సాహించేవారు.

ధీర : రోల్‌ మోడల్‌ ?
భవ్య శ్రీ : మా తాతగారు మేడసాని వెంకటేశ్వర రావు. సామాజిక స్పృహతో ఆయన చేసిన సత్కార్యాలు నన్ను ప్రేరేపించాయి.

ధీర : వీలుదొరికితే ?
భవ్య శ్రీ : నాకు పుస్తకాలంటే చాలా ఇష్టం. అందుకే మంచి పుస్తకం కనబడగానే వదలకుండా చదివేస్తాను. దాంతో పాటు మంచి సంగీతం వింటాను. టీవీలో అన్ని రకాల కార్యక్రమాలు చూస్తుంటాను.

ధీర : మీకు నచ్చిన నవల?
భవ్య శ్రీ : జెఫ్రీ ఆర్చర్‌ రచనలంటే కోట్లాది మందిలాగే నాకూ ఇష్టం. ప్రత్యేకంగా ఆయన రాసిన ఫాల్స్‌ ఇంప్రెషన్‌ ఇంకా ఇష్టం.

ధీర : లక్ష్యం?
భవ్య శ్రీ : నా ఆశయం..లక్ష్యం ..రెండూ డాక్టర్‌ కావడమే. ఇటీవలే నాకు ప్రీమెడికల్‌ డిగ్రీ కోర్సులో సీటు వచ్చింది. సెప్టెంబర్‌లో నా ఉన్నత చదువును మొదలు పెట్టబోతున్నాను. వైద్యవృత్తిని పూర్తి చేశాక భారత దేశానికి వచ్చి..ఇక్కడి పేద ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాను.

ధీర : మరి రచనా వ్యాపకం విడిచిపెడతారా?
భవ్య శ్రీ : నో, నా కలని, కలాన్ని విడిచిపెట్టే ఛాన్సే లేదు. ఇటీవలే విండిక్టీవ్‌ నవలకు సీక్వెల్‌గా రెండవ భాగాన్ని కూడా ప్రారంభించాను.

ధీర : ఇంతలా పాఠకుల ఆదరణ వస్తుందని ఊహించారా ?
భవ్య శ్రీ : విండిక్టీవ్‌ నవలకు ఇంతలా పాఠకాదరణ లభించడం వల్ల నా సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి.

ధీర : విండిక్టీవ్‌ విజయ రహస్యం ?
DSC029sభవ్య శ్రీ : నా నవల సరైన పరిధుల్లో ఉందని నేను భావిస్తున్నాను. కథనంలో ఎక్కడా అతి లేక పోవడం,పాత్రలన్నీ నిజజీవితానికి దగ్గరగా ఉండటం, కథనం కంటే సన్నీవేశాలు ఉత్కంఠంగా సాగిపోవడం వల్ల పాఠకుల్లో నా రచన ఆసక్తిని కలిగించింది. విండిక్టీవ్‌ను రాయడం మొదలెట్టే నాటికి నా వయసు పదహారేళ్లు మాత్రమే. నిజానికి ఈ నవలను నేను ప్రచురించాలనే లక్ష్యంతో ప్రారంభించలేదు. కానీ అనుకోకుండా ప్రచురించి విడుదల చేశాం. పాఠకుల నుంచి వచ్చిన పీడ్‌బ్యాక్‌ విన్న తరువాత సరైన నిర్ణయం తీసుకున్నామని సంతోషపడ్డాం.

విండిక్టీవ్‌ (కథాంశం )
మన్‌హట్టన్‌, న్యూయార్క్‌ నేపథ్యంలో సాగే విండిక్టీవ్‌ ఒక్క స్నేహితుడి మరణం వెనుక ఉన్న భయం కరమైన రహస్యాన్ని చేదించే ముగ్గురు మిత్రులు కథ. ఇద్దరు ఎఫ్‌బిఐ ఏజెంట్లు, ఒక వైద్య విద్యార్థి ముగ్గురు కలిసి తమ మిత్రుడు ఎలా చనిపోయాడో తెలుసుకోవాలని ఒక ప్రయా ణం ప్రారంభిస్తారు. మిస్టరీని చేదించే క్రమంలో ప్రయాదాల్లో చిక్కుకోవడంతో పాటు ఒక నేరం కూడా చేస్తారు. ఆ రహాస్యాన్ని చేదించి..ప్రమాదాల నుంచి ఎలా బయటపడగలిగారో అనేది మిగిలిన కథ.

షార్ట్‌ అండ్గ స్వీట్‌
స్పూర్తినిచ్చింది : మా తాతయ్య. మేడసాని వెంకటేశ్వరరావు.
మెచ్చిన ప్రదేశం : భారతదేశం
నచ్చిన ఆహారం : హైదరాబాదీ దమ్‌ కా బిర్యానీ
ఇష్టమైన డ్రెస్‌ : సంప్రదాయ దుస్తులు
ఫేవరిట్‌ సినిమా స్టార్స్‌ : ఒక్కరు ఇద్దరు అనక అందరి సినిమాలు చూస్తుంటా.

  • క్రైమ్‌, యాక్షన్‌ ఇతివృత్తాల్లో కథలు రాయాలనుకుంటున్నా
  • మొదట్లో పదిేహడేళ్ల యువతి రాసిన నవలను పాఠకులు ఆదరిస్తారా.. నన్ను ప్రొఫెషనల్‌ రచయిత్రిగా గుర్తిస్తారా ..అనే సందేహాలు వచ్చేవి. కానీ నా పుస్తకానికి ఇంత అమోఘమైన పాఠకాదరణ లభించడం నా సంశయాల్ని పటా పంచలు చేశాయి.

    ఇంటర్వ్యూ: షేక్‌ ఆజహర్‌,
    మేజర్‌ న్యూస్‌, బంజారాహిల్స్‌

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top