You Are Here: Home » ఇతర » సానుకూల జీవితానికి ధ్యానమంత్రం

సానుకూల జీవితానికి ధ్యానమంత్రం

మహిళల్లో ఇలాంటి సమస్యలకు కారణం హార్మోన్స్‌ విడుదల చేసే రసాయనాల ఉత్పత్తి సక్రమంగా లేకపోవడమే. ఒత్తిడి మూలానే హార్మోన్స్‌ సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. మాన సిక పరమైన ఆరోగ్యం లోపించినప్పుడు హార్మోన్స్‌ దెబ్బతింటాయి. తద్వారా గర్భసంచిపై దానిప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీని వలన సక్రమంగా పిరియడ్స్‌ రావు. అండోత్పత్తి సరిగ్గా ఉండదు. ెఫెలోపియన్‌ ట్యూబ్స్‌ లోపల ముడుచుకుపోవడం వలన స్వేచ్ఛగా అండం విడుదల అనేది జరగదు. దీంతో గర్భదారణ కూడా కష్టం అవుతుంది.

గర్భస్థ సమయంలో…
గర్భం దాల్చినప్పటి నుంచి కూడా అరుగుదల లేకపోవడం, విపరీతమైన వాం తులు, ఎనీమియా, బిపి, షుగర్‌, ఇతరత్రా లేనిపోని భయాలు స్ర్తీలలో ఎక్కువగా చోటుచేసుకుంటాయి. ఇవన్నీ సహజమేనని కొట్టిపారేస్తుంటారు చాలామంది. కానీ ఇలాంటి సమస్యలతో సతమతమవుతున్నప్పుడు కడుపులోని బిడ్డపై ప్రభావం పడే ప్రమాదముంది.
పిండం ఎదుగుదలలో…
పుట్టబోయే బిడ్డ సరిగ్గా ఎదగాలంటే బిడ్డకు ఆక్సిజన్‌ సక్రమం గా అందాలి. తల్లి ఆరోగ్యం సక్రమంగా ఉంటేనే బిడ్డకు ఆక్సిజన్‌ అందుతుంది. లేదంటే బిడ్డ అనారోగ్యంగా పుట్టడమో, లేక ఆపరేషన్‌కు దారితియ్యడం లాంటి సమస్యలు వస్తాయి.
పొట్టపై ఒత్తిడి లేకపోవడం…
meditationaఎక్కువగా కూర్చుని, లేక పడుకోని ఉండటం వలన పొట్టకు రక్తప్రసరణ అనేది సక్రమంగా జరగదు. దీంతో లోపల అవయవాలు, సెల్స్‌ అన్నీ కూడా నిర్జీవమైపోతుం టాయి. వీటి ప్రభావం కూడా గర్భసంచిపై ఎక్కువగా ఉంటుంది. తద్వారా రుతుక్రమం సరిగ్గా ఉండదు. అండోత్పత్తిలో సమస్యలు ఏర్పడతాయి. పైగా తిన్న ఆహారం కూడా సక్రమంగా జీర్ణంకాక గర్భసంచి చుట్టూ కొవ్వు పేరుకుపోతుంటుంది.
యోగాసనాలతో…
పైన చెప్పిన సమస్యలన్నింటికీ యోగాసనాలు వేయ డం ద్వారా త్వరితగతిన పరిష్కారం ఉంటుంది. ముఖ్యంగా ప్రాణాయామం చాలా ఉపయోగకారిగా ఉంటుంది. నెలరోజుల పాటు క్రమం తప్పకుండా యోగా చేయడం వలన ఈ రుగ్మతలన్నీ పోతాయి. తర్వాత కూడా రోజువారీ కార్యక్రమాల్లో ఓ భాగంగా యోగాను చేర్చితే జీవితాంతం గర్భస్థ సమస్యలకు దూరంగా ఉండొచ్చు.
ప్రాణాయామం…
కఫాలభాతి, నాడీశుద్ధి, భస్ర్తిక, భ్రామరి…తదితర ప్రాణాయామాలను వేయడం ద్వారా గర్భస్థ సమస్యలను దూరం చేయొచ్చు. అయితే గర్భం దాల్చిన వాళ్లు ఆసనాలు వేయకూడదు. అలాగే రుతుస్రావం జరిగేటప్పుడు కూడా వీటిని ప్ర యోగం చేయకూడదు. ప్రాణాయామం వలన పొట్టలో అవయవాలన్నీ కూడా ఆరోగ్యంగా, చు రుగ్గా పనిచేస్తాయి. పొట్ట గట్టిపడుతుంది. ఆహా రం త్వరగా జీర్ణమవుతుంది.
గర్భం ధరించిన సమయంలో…
అర్ధ్ర చక్రాసనం, భద్రాసనం, ఉత్తానపాదానసనంతో కూడిన ఇతరత్రా ఆసనాలను గర్భస్థ సమయంలో వేయడం వలన శిశువు ఆరోగ్యంగా పుట్టడమేకాక ఫ్రీడెలివరీ అవుతుంది. కడుపులోని బిడ్డకు ఆక్సిజన్‌ సంపూర్ణంగా అందుతుంది. బిడ్డ ఆరోగ్యంగా పుడతుంది.
రుతుస్రావ సమస్యలకు…
మండూక ఆసనం, శశాంక ఆసనం, వృష్ట ఆసనం, సర్వాంగాసనం, హలాసనం, పవన ముక్తాసనం, ఉత్తానపాదాసనం, పాదహస్తాసనం..లాంటివి అధిక రుతుస్రావాన్ని కంట్రోల్‌చేయడమేకాక, రుతుక్రమం కూడా సక్రమంగా ఉండటానికి సహకరిస్తాయి. ఆ సమయంలో వచ్చే డుపునొప్పి, నడుం నొప్పి, తలనొప్పి, వాం తులు కూడా ఈ ఆసనాల ద్వారా తగ్గిపోతాయి. అయితే వీటిని రుతుస్రావం జరిగేటప్పుడు వేయకూడదు.
మితాహారం…
యోగాసనాలు వేయడం వలన సరైన ఆహారం వైపు మనస్సు మళ్లుతుంది. మనకు తెలియకుండానే మన అలవాట్లు, అభిరుచుల్లో మార్పులొస్తాయి. వేళకు తినాలనిపించడం, సరిపడినంతే తినడం, శాఖాహారం తీసుకోవాలనుకోవడం, పౌష్టికాహారం..ఇలా ఆహారపు అభిరుచులు మారిపోతాయి. ప్రాణశక్తి ఇనుమడిస్తుంది . మహిళలు అంతకు ముందుకన్నా ఎక్కువగా పనులుచేస్తారు. చురుకుదనం పెరుగుతుంది. అయితే ఎలాపడితే అలా ఆసనాలను స్వతహాగా ప్రాక్టీస్‌ చేయకుండా కొన్నినెలలపాటు యోగా టీచర్‌ ద్వారా సాధన చేస్తే మంచిది. గుండెకు సంబంధించిన సమస్యలున్నవాళ్లు ఆసనాలు వేసే విషయంలో తప్పనిసరిగా యోగనిపుణుల్ని సంప్రదించాలి.
ధ్యానం తప్పనిసరి……
యోగాసనాలతో పాటు ధ్యానం కూడా తప్పనిసరిగా చేయాలి. ప్రాణాయామం చేసిన తర్వాత ధ్యానం చేయడానికి శరీరం సహకరిస్తుంది. యోగా, ధ్యానం రెండూ ఒకదానికొకటి ముడిపడి ఉన్నా కూడా ముం దుగా యోగా చేస్తేనే ధ్యానం బాగా కుదురుతుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top