సరదా ఆటలు ఆడ..
బ్రైట్ లెహంగాస్..కలర్‌ఫుల్ స్టిక్స్..ఉత్సాహపరిచే సంగీతం.. సంప్రదాయ దాండియాతో లకోటియా విద్యార్ధులు సందడి చేశారు. న్యూఏజ్ ఫ్యాషన్‌కు చిరునామా అయిన హైదరాబాద్ అబిడ్స్‌లోని లకోటియా ఫ్యాషన్ డిజెైనింగ్ ఇన్స్టిట్యూట్ విద్యార్ధులు రాస్, గర్బా, దాండియాలలో డిస్కో స్టైల్‌తో తమ ప్రతిభ చూపారు. కులమతాలకు అతీతంగా ఈ వేడుకల్లో విద్యార్ధులు ఉత్సాహంగా పాల్గొన్నారని ఇన్స్టిట్యూట్ డెైరెక్టర్లు అజర్, ఆయేషా తెలిపారు. ఫ్యాషన్ డిజెైనింగ్తోపాటుగా ఇంటీరియర్ డిజెైనిం గ్, మోడలింగ్ కోర్సుల విద్యార్ధులు 300మంది ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారని ఇన్స్టిట్యూట్ మేనేజర్ రూపేష్గుప్తా తెలిపారు.భాగ్యనగరంలో ఫ్యాషన్ షోలు యువతరానికి కిక్కెక్కిస్తున్నాయి. అందాల భామలు ర్యాంప్‌పెై క్యాట్‌వాక్‌తో తళుక్కుమంటున్నారు.