You Are Here: Home » చిన్నారి » సముద్రపు నీటిలో బంగారం ఉందని కనుగొన్నదెవరు?

సముద్రపు నీటిలో బంగారం ఉందని కనుగొన్నదెవరు?

బంగారం గనుల్లో మట్టిని తవ్వి బంగారం తీస్తారని మనకు తెలుసు. కానీ సముద్రపు నీటిలో కూడా బంగారం ఉంటుందంటే ఆశ్చర్యం కలగక మానదు. 20వ శతాబ్దపు ప్రథమార్ధంలో రసాయన శాస్త్రవేత్తలు సముద్రపు నీటి నుంచి బంగారాన్ని తీసే ప్రక్రియను కనుగొనే ప్రయత్నం చేశారు. జర్మన్ రసాయన శాస్త్రవేత్త ప్రిట్జ్ హాబర్ మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ దేశం అప్పుల నుంచి బయట పడేందుకు ఉపయోగపడుతుందని సముద్రపు నీటి నుంచి బంగారం తీయటానికి తీవ్రంగా కృషి చేశాడు. 8 సంవత్సరాల కృషి ఫలితంగా ఒక లీటర్ సముద్రపు నీటిలో 0.0000000001 గ్రాము బంగారం ఉంటుందని కనుగొన్నాడు.

కానీ ఆ తర్వాత చేసిన పరిశోధనల ఫలితంగా అంతకన్నా తక్కువ బంగారమే ఉంటుందనే అంచనాకు వచ్చారు. దాంతో అతనిలో ఉత్సాహం తగ్గిపోయింది. ప్రదేశాన్ని బట్టి సముద్రపు నీటిలో సుమారు 0.1 నుంచి 2 మిల్లీగ్రాములు ఉంటుంది. అసలు సమస్య ఏమిటంటే నీటి నుంచి బంగారాన్ని వేరు చేయటం. ఈ ప్రక్రియ చాలా సంవత్సరాలు పడుతుంది. దీనికి అయ్యే ఖర్చు బంగారం విలువతో పోల్చితే ఎక్కువే ఉంటుంది. అందుకే సముద్రపు నీటి నుంచి బంగారం తీయటానికి ఎవరూ సుముఖంగా లేరు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top