You Are Here: Home » చిన్నారి » సముద్రపు నీటిలో బంగారం ఉంటుందా?

సముద్రపు నీటిలో బంగారం ఉంటుందా?

బంగారం గనుల్లో మట్టిని తవ్వి బంగారం తీస్తారని మనకు తెలుసు. కాని సముద్రపు నీటిలో కూడా బంగారం ఉంటుందంటే ఆశ్చర్యం కలగక మానదు.

20వ శతాబ్దపు ప్రథమార్ధంలో రసాయన శాస్తవ్రేత్తలు సముద్రపు నీటి నుంచి బంగారాన్ని తీసే ప్రక్రియను కనుగొనే ప్రయత్నం చేశారు. జర్మన్ రసాయన శాస్తవ్రేత్త ప్రిట్జ్ హాబర్ మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ దేశం అప్పుల నుంచి బయటపడేందుకు ఉపయోగపడుతుందని సముద్రపు నీటి నుంచి బంగారం తీయటానికి తీవ్రంగా కృషి చేశాడు. ఎనిమిది సంవత్సరాల గట్ట్టి కృషి తరవాత ఒక లీటర్ సముద్రపు నీటిలో 0.0000000001 గ్రాము బంగారం ఉంటుందని తెలియజేశాడు. కాని ఆ తర్వాత చేసిన పరిశోధనల ఫలితంగా అంతకన్నా తక్కువ బంగారమే ఉంటుందనే అంచనాకు వచ్చారు. దానితో వారి ఉత్సాహం తగ్గిపోయింది.

ప్రదేశాన్ని బట్టి సముద్రపు నీటిలో టన్నుకు సుమారు 0.1 నుంచి 2 మిల్లీ గ్రాముల బంగారం ఉంటుంది. అసలు సమస్య ఏమిటంటే నీటి నుంచి బంగారాన్ని వేరుచేయటం. ఈ ప్రక్రియకి చాలా సంవత్సరాలు పడుతుంది. దీనికి అయ్యే ఖర్చు అలా వేరు చేయగా వచ్చే బంగారం
విలువతో పోల్చితే ఎక్కువే ఉంటుంది.అందుకే సముద్రపు నీటి నుంచి బంగారం తీయటానికి ఎవరూ సుముఖంగా లేరు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top