You Are Here: Home » చిన్నారి » సముద్రం అడుగున ఎంత పీడనం ఉంటుంది?

సముద్రం అడుగున ఎంత పీడనం ఉంటుంది?

సముద్రపు లోతును తెలుసుకోవడమంటేనే చాలా కష్టం. ఇక సముద్రపు అడుగున పీడనాన్ని కనుక్కోవడం మరింత కష్టం. కానీ శాస్త్రవేత్తలకు అది సాధ్యమే. సముద్రంలో లోతుకు వెళ్లే కొద్దీ పీడనం పెరుగుతూంటుంది. పైన ఉండే నీటిబరువు కారణంగా నీటి అడుగు భాగంలో పీడనం ఎక్కువగా ఉంటుంది.

ఈ పీడనం విలువ ఆ నీటి సాంద్రత మీద, ఎత్తు మీద ఆధారపడి ఉంటుంది. సముద్రంలో 30 వేల అడుగుల లోతులో అంటే 9 వేల మీటర్ల కంటే ఎక్కువ లోతులో పీడనం ఎంత ఉంటుందో తెలుసా! ఒక మామూలు పోస్టల్ స్టాంప్ మీద ఒక టన్ను బరువును ఉంచితే ఎంత పీడనం ఉంటుందో అంత. అంటే చాలా ఎక్కువే కదా!

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top