You Are Here: Home » చిన్నారి » కవితలు » సమిధలు

సమిధలు

సహజీవన సంస్కృతీ సింధువులు
శ్రమైక జీవన వన సుమాలు
నిత్య సంచార జీవులు
క్రమశిక్షణలో చలిచీమలు
ఐకమత్యానికి అడవి కాకులు
నిండు సంస్కృతీ సంరక్షక జీవులు
పరిశోధకుల నుండి ప్రకృతి ప్రేమికులవరకూ
వర్తకుల నుండి కర్షకుల దాకా
మీ ఉనికి మీ శ్రమ జీవనం
రచయితల నుండి రంగుల బ్రహ్మలు
భూలోక త్రినేత్రులు ఒకరా ఇద్దరా?
అందరికీ మీ ప్రతి కదలిక
అద్భుత ‘బహుమతి’
నీకై సాగిన అక్షర పరిశోధనలు
నువ్వెప్పుడైనా చదివావా?
నీ అమాయకపు సొగసరి చిత్రాలు
నీ కళ్ళలో చూసుకున్నావా?
చెట్లెప్పుడూ తమ మూలాలు చూసుకోలేవు.. అడవి బిడ్డలూ అంతే!!
ఆఖరికి అడవి రాజుల
అమ్ముల పొదిలో అమరిపోతున్న
గురితప్పని అమాయక బాణం
అనునిత్యం అందరికి నీ అవసరం
అయినా ఎవరికీ పట్టదు నీ బ్రతుకు భారం!!
చుక్కల మందు
నేరానికి కోణాలు వేనవేలు
నేరం చేయించేది మాత్రం ఒక్కటే
నైతిక విలువలు నశించగా
సోకిన పోలియోవ్యాధి.
దానికి వైద్యం పూజ్యం
నివారణే మార్గం!
బాల్యంలో వేయాల్సిన నైతిక విలువల
‘చుక్కల మందు’ లోపంతో
బరితెగిస్తున్నారు నేటి జనాలు
కామం కళ్ళతో మాతృత్వానికి తెచ్చే మచ్చలు. కీచక గురువల అరాచకాలు ప్రేమోన్మాదపు మృగాళ్ళు ఆర్థిక అధికారాలే
అవసరంగా బతుకుతున్న జబ్బులు
వాళ్ళ చావులతోనే చస్తాయి!! కనీసం… రాబోయే తరమైనా
విలువల ఆరోగ్యాలతో తులతూగాలంటే
నేటిపిల్లలకైనా అందించాలి
నైతిక విలువల ‘చుక్కల మందు’

– అమ్మిన శ్రీనివాసరాజు
సెల్‌: 94413 17694

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top