You Are Here: Home » ఇతర » సమతకి మారుపేరు దరిశి అన్నపూర్ణమ్మ

సమతకి మారుపేరు దరిశి అన్నపూర్ణమ్మ

గాంధీ మహాత్ముని దైవంలా కొలిచి స్వాతంత్య్ర సమరంలో పాల్గొని భరతమాతకు తన అమూల్యమైనసేవ లందించిన మహిళా మణి. ఈమె 1907లో బళ్ళారిలో రొట్టగల్‌ నీలప్ప, గౌరమ్మ దంపతులకుజన్మించారు. చిన్నతనంలోనే తండ్రి మరణించారు. దీంతో బంధువులు గౌరమ్మను మైత్రేయి దివ్యజ్ఞాన మహిళా సమాజం లో చేర్చారు. ఆ సమాజ సభలు సమావేశాల కారణంగా ఆమె తరచూ చెన్నైలోని అడయారు వస్తుండే వారు. తల్లి ఇలా వస్తున్న కారణంగా అడయారు థియోసాఫికల్‌ సొసైటీలో చదువుకునే అవకాశం లభించింది. అన్నపూర్ణమ్మ జన్మించిన ఆర్యవైశ్యులలో స్త్రీ విద్యకు బొత్తిగా అవకాశం ఉండేది కాదు.ఒక పేద యువకునితో ఆమె వివాహం ఘనంగా జరుపుకున్నారు.

Dharisiఈ వివాహానంతరం వారికి ధైర్యం రెట్టింపు అయినది. ఒక బాల వితం తువుకు వివాహం చేయాలని ఆమె పూనుకున్నారు. అప్పటికే కందు కూరి వీరేశలింగం పంతు లు దంపతులు రాజమండ్రిలోను, ఉన్నవ దంప తులు గుంటూరులోను అనేక పునర్వివాహాలు చేశారు. అప్పటి కి ఆర్యవైశ్య కులాల్లో ఇటువంటి వివాహాలు జరుగలేదు. అన్నపూర్ణమ్మ తన భర్తతో కలసి తమ కులానికి చెందిన 12 ఏళ్ళ బొమ్మలాంటి వితంతు బాలికకు 1926లో గుంటూరులో వైభవంగా వివాహం జరిపించారు. అందరికీ ఇదో వింతగా తోచింది.కొందరు ఇది నచ్చక అల్లరి చేయడమే కాక రాళ్ళవాన కురిపిం చారు. 18 ఏళ్ళ అన్నపూర్ణమ్మ అందరికీ ధైర్యం చెప్పి ముందుకు సాగిపొమ్మ ని ప్రోత్సహించారు. దీంతో అందరికీ ధైర్యం వచ్చి ఆ కార్యక్రమం సజావుగా సాగింది.

పేద కుటుంబానికి చెందిన దరిశి చెంచయ్య వీరిని వివాహమా డారు. వీరు ప్రకాశం జిల్లా కనిగిరికి చెందినవారు. గద్దర్‌ పార్టీ స్థాపించారు. చెంచయ్య కూడా అందులో సభ్యులుగా చేరారు. ఆ పార్టీకి చెందిన పంజాబీ యువకులు దేశభక్తి అనేది తమ సొత్తే అనే భావాన్ని ప్రదర్శించేవారు. ఈ చర్య వీరికి నచ్చేది కాదు. దేశభక్తి అనేది ప్రతి ఒకరికీ ఉంటుందనేది వీరి అభిప్రాయం బ్రిటిషూ సేనలో మొదట పేరిచ్చి చేరిన పంజాబీ యువకులు విదేశాల్లో యుద్ధం చేస్తూ దేశభక్తి అని గర్వించవలసిన అవసరం లేదని వాదించారు. దీంతో గద్దర్‌ పార్టీలో గౌరవం పెరిగింది. చివరకు వీరు స్వదేశమునకు బయలుదేరారు. బ్రిటిషూ ప్రభుత్వం నడిదారిలో రాజద్రోహిగా పేర్కొని అరెస్టు చేసి నాలుగున్నర ఏళ్ళు భారతదేశపు జైల్లో ఉంచారు. జైలు అధికారులు వీరిని తిప్పలు పెట్టారు.

ఆమె నిత్యం ఖాదీ ధరించే వారు. గాంధీజీ పట్ల ఎనలేని భక్తి భావన ను కలిగివుండేవారు. వర్ణాంతర వివాహాలు, సహపంక్తి భోజనాలు కులం, అడ్డుగోడలు లేని విశాల హిందూ సంఘాన్ని ఆమె వాంఛిం చేవారు. పాపపంకిలంలో కూరుకుపోయి దయనీయ జీవితాలను గడిపే దేవదాసీలంటే గాంధీజీకి చెప్పలేనంత జాలి. వారి ఉద్ధరణకు ఆయన పాటుపడటం చూచిన అన్నపూర్ణమ్మ వారి సేవల్లో నిమగ్నమైనారు. ఎంతో సాహసోపేతంగా పాపకూపాలకు మా రుపేరుగా పిలవబడే వ్యభిచారిణుల గృహాలకు వెళ్ళి వివాహం చేసుకుని గౌరవ ప్రదమైన జీవితాన్ని గడపమని ప్రబోధించారు.

భర్త దరిశి చెంచయ్య ఉద్యోగరీత్యా విజయవాడలో ఉంటున్నపడు అక్కడి సంఘ సేవిక తుర్లపాటి రాజేశ్వరమ్మ తో అన్నపూర్ణమ్మ కలసి మాట్లాడారు. రాజేశ్వరమ్మ మహిళా సంఘాలను స్థాపించి మహిళా భ్యుదయానికి పాటు పడు తున్నారు. ఒకరోజు రైవసు కాలువ ఒడ్డున రాజేశ్వరమ్మ, వీరి బృందం వెళుతుంటే ముక్కు పచ్చలారని పసికందును గొంతు నులిమి చంపి పడవేసిన దృశ్యం తిలకిం చారు. ఆ పసిమృతదేహం చుట్టూ కాకులు, గ్రద్దలు, చేరడం చూచి అందరి గుండెలు చెదిరి పోయాయి. ఫలితంగా రాజేశ్వరమ్మ ఇంటి ఆవరణలో ఆనాథ శిశుశరణాలయం ఆ రాత్రికి రాత్రే వెలిసింది. పరిస్థితులకులోనై తమ తమ సంతానాన్ని పోషించలేనివారు సైతం ఈ శరణాలయాన్ని ఆశ్రయించేవారు. డాక్టర్‌ రంగనాయకమ్మ వీరి కి చాలా సహకరించి వైద్య సహాయం అందించేవారు. అలాంటి 60 మంది బిడ్డలను వీరు కాపాడి దత్తత ఇచ్చారు.

1929లో ముంబైలో జరిగిన అఖిల భారత మహిళా సమాఖ్యకు ఆంధ్రప్రదేశ్‌ ప్రతిని ధులుగా అన్నపూర్ణ మ్మతో పాటు బత్తుల కామాక్షమ్మ, ఇంకొకరిని పంపించారు. అక్కడి ప్రధాన చర్చాంశమైన శారదా చట్ట సమర్థన పైన ఆమె వ్యక్తపరచిన అమూల్య అభిప్రాయాలు లోకవిదితమే. మహిళలకు న్యాయం కలిగించే ఏ విషయం విన్నా ఆమె సంతోషిం చేవారు. మహిళాభ్యుదయాన్ని కోరుతూ పత్రికలో అనేక వ్యాసాలు రాశారు . ముంబైలోని మాంటిస్సోరి పబ్లిక్‌ స్కూలును చూచి అన్న పూర్ణమ్మ పరవశించారు. ధనవంతులు గుళ్ళూ ,గోపురాలు కట్టిం చేకంటే మాంటిస్సోరి పబ్లిక్‌ స్కూలు వంటి పాఠశాలలను స్థాపించి స్ర్తీలలో అక్షరాస్యతను పెంచేందుకు దోహదపడాలని ఆమె కోరుతుం డేవారు. సంఘంలోని దురాచారాలను ఎత్తి చూపుతూ ఆమె అనేక కథలు రాశారు. దేశసేవ చేయమని తన వ్యాసాలద్వారా ప్రబోధిం చేవారు.

భార్యను వ్యర్థజీవిగా భావించే భర్తలు తమ ఆధిక్యం ప్రదర్శించడానికి సాగించే ఏ ఉద్యమంకూడా సఫలం కాదని ఆమె వాదిం చేవారు. ఇన్ని రకాలుగా సంఘసేవ చేసిన అన్నపూర్ణమ్మ బందరులో దిగ్విజయంగా ఒక పునర్వివాహం జరిపించి చెన్నై వచ్చిన ఈమె మరి నాలుగు రోజులకు 28 నవంబర్‌ 1931 న గుం డెపోటుతో కన్నుమూశారు. అనేక పునర్వివాహాలు జరిపించడమే కాకుండా శిశు సంక్షేమం కోసం పాటు పడిన అన్నపూర్ణమ్మ తన ఐదేళ్ళ పెద్దమ్మాయి, ఎనిమిది నెలల చిన్నమ్మాయిల ముద్దూ, ముచ్చ ట చూడకుండానే కన్ను మూశారు. ఒక శతాబ్దానికి సరిపడా మహిళాసేవ చేసిన ఆమె ఆదర్శప్రాయురాలు.

– షేక్‌ అబ్దుల్‌ హకీం జాని

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top