You Are Here: Home » దైవత్వం » సత్యాసత్య అన్వేషణకు గీత ముఖ్యం

సత్యాసత్య అన్వేషణకు గీత ముఖ్యం

నేటి యాంత్రిక జీవన విధానంలో ప్రతి ఇంటా చేయవలసిన భగవద్గీత పారా యణం చాలా మందికి సాధ్యపడని విషయం. అందుకే కనీసం రోజుకు రెండు గీతా శ్లోకాలు చదివితే జీవిత పరమార్ధం, గీతార్ధం అందరికీ అవగతమౌతాయి.

శ్రీమద్భగవద్గీత- ప్రధమోధ్యాయం-అర్జున విషాధయోం దృతరాష్ట్ర ఉవాచ.
krisaశ్లోకంః నిమిత్తాని చ పశ్యామి
విపరీతాని కేశవ
న చ శ్రేయోమ పశ్యామి
హత్వా స్వజన మాహవే

కేశి అనే రాక్షసుని సంహరించి స్వజనుల్ని కాపాడిన ఓ కేశవా! నాకిప్పుడు ఈ సమయంలో అన్నీ దుశ్శకునాలే గోచరిస్తున్నాయి. స్వజనుల్ని ఈ యుద్ధరంగంలో చంపటం వలన నేను పొందే శ్రేయస్సు ఏమిటో తెలియకున్నది.
శ్లోకంః న కాంక్షే విజయం కృష్ణా
న చ రాజ్యం సుఖాని చ
కిం నో రాజ్యేన గోవింద
కిం భోగెై ర్జీవితేన వా

శ్రీకృష్ణా! నాకు బంధువుల్ని చంపడం వలన పొందే విజయము అవసరం లేదు. బంధువధతో పొందే రాజ్యమూ వద్దు. ఆ రాజ్యం వల్ల కలిగే సుఖాలూ వద్దు. గోవుల్ని, గోపికల్ని, గోపకులాన్ని రక్షించి రాజ్యం పొంది గోపాలుడవెైతివి కదా! నా బంధువుల్ని చంపి పొందే రాజ్యంతో నాకేమి పని? సుఖములతో ఏమిపని? అసలు ఈ జీవితంతో మనేమున్నదీ?

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top