You Are Here: Home » ఇతర » సకల యోగాల సుమబంతి గీతాజయంతి

సకల యోగాల సుమబంతి గీతాజయంతి

గీతా ఒక శాస్త్రం. ఒక గ్రంధం, ఒక ఐతిహ్యం, ఒక పరమ పథసోపానం, సాక్షాత్‌ భగవంతుడు మనకు అందించిన జీవన్ముక్తికి మార్గదర్శి. మానవ మనుగడకు దిక్సూచి. అందుేక ఇది పవిత్ర గ్రంధం అరుు్యంది. ద్వాపర యుగం నాడు మనకి సంప్రాప్తించి ఆచంద్రతారార్కం మనల్ని నడిపే జీవిత నౌక. భగవద్గీత కూడా ఆ పరమాత్మునిలా ఏ రూపంలో చూసినా, ఆ రూపంలో గోచరమవుతుంది. సమస్త జీవన మీమాంసలకీ నిత్య నూతన సమాధానం అందించే మహత్తర గ్రంధం శ్రీమద్భగవద్గీత.
Untitl6కార్తీక బహుళ అమావాస్యను భగవద్గీత పుట్టిన రోజుగా జరుపుతారు. గీతా జయంతిని ఈమాసములోనే జరపవలసి వుంటుంది. ఉత్తరాదిన కొన్ని ప్రాంతాల్లో మార్గశిరశుద్ధ ఏకాదశిని గీతాజయంతి జరుపుతున్నట్లు కనిపిస్తుంది. మార్గశిర శుద్ధ త్రయోదశి నుండి పుష్యశుద్ధ పాడ్యమి వరకు గల పద్ధెనిమిది రోజులు భారత యుద్ధం జరిగిందనీ, శుద్ధ త్రయోదశికి రెండు రోజుల ముందుగా, మార్గశిర శుద్ధ ఏకాదశినాడు భగవద్గీత చెప్పబడిందనీ అందుచేత ఆ రోజు గీతాజయంతి జరపడం సమంజసమని అంటున్నారు. భారతాన్ని బట్టి మాఘ శుద్ధాష్టమి భీష్ముని నిర్వాణ రోజు. భీష్ముడు అంపశయ్య మీద యాభై ఎనిమిది రోజులు ఉన్నట్లు భారతంలో స్పష్టంగా చెప్పబడింది. భీష్ముడు యుద్ధం చేసింది పదిరోజులు. భీష్ముడు మరణించిన మాఘ శుద్ధాష్టమి నుండి మొత్తం అరవై ఎనిమిది రోజులు రెండు మాసాల ఎనిమిది రోజులు.

వెనక్కు లెక్కిస్తే భారతయుద్ధం ప్రారంభ దినం తేలుతుంది. ఈ గణనం ప్రకారం భారత యుద్ధం ప్రారంభ దినం కార్తీక బహుళ అమావాస్య అవుతుంది. కార్తీకమాసంలో రేవతీ నక్షత్రంనాడు శ్రీకృష్ణుడు కౌరవుల వద్దకు రాయబారానికి పయనమై వెళ్లినట్లు భారతంలో ఉంది. కార్తీక పూర్ణిమ నాడు కృత్తికా నక్షత్రం అవుతుంది. కృత్తికా నక్షత్రానికి మూడో పూర్వ నక్షత్రం రేవతి. రేవతీ నక్షత్రం నాడు అంటే, శుద్ధ త్రయోదశి నాడు అవుతుంది. రాయబారిగా వెళ్లిన శ్రీకృష్ణుడు హస్తినాపురంలో కొద్ది రోజులు ఉన్నాడు. వస్తూ కర్ణుడితో మాట్లాడాడు. ఆ సంభాషణలో శ్రీకృష్ణుడు కర్ణుడితో జ్యేష్ఠా నక్షత్రంతో కూడిన అమావాస్యనాడు యుద్ధం ఆరంభమవుతుందని చెప్పాడు. కాగా కార్తీక బహుళ అమావాస్యే భారత యుద్ధం ప్రారంభ దినమని నిర్ధారించి చెప్పవచ్చు.

భారత యుద్ధ సమయంలో అర్జునుడు బంధువర్గాన్ని సంహరించడానికి సంశయించాడు. ఆ సందర్భంలో శ్రీకృష్ణుడు అతనికి తత్తో్వపదేశం చేశాడు. ఆ ఉపదేశమే భగవద్గీత. ఈ ఉపదేశం, యుద్ధ ప్రారంభ దినం నాటి ఉదయం జరిగింది.జగద్గురువు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత ద్వారా మానవజాతికి అర్జున స్థితిలో వున్న వారికి ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని అందించాడు.

ఇమం వివస్వతే యోగం ప్రోక్తవా నహ మన్యయమ్‌
వివస్వాన్‌ మనవే ప్రాహ మను రిక్ష్వాక వేబ్రవీత్‌

శ్రీభగవానుడు వినాశనం లేని ఈ యోగాన్ని పూర్వం సూర్యుడికి ఉపదేశించాడు. సూర్యుడు మనువుకూ, మనువు ఇక్ష్వాకుడికి బోధించారు.
ఏవం పరమ్పరాప్రాప్త మిమం రాజర్షయో విదు:
సకాలేనేహ మహ తాయోగో నష్ట: పరన్తప భ.గీ.4-2

Untit9అర్జునా! ఇలా సాంప్రదాయపరంగా వచ్చిన కర్మయోగాన్ని రాజర్షులు తెలుసుకున్నారు. అయితే అది ఈ లోకంలో క్రమేపీ కాల గర్భంలో కలిసి పోయింది. శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో రెండు రకాలైన గానాలను చేశాడు. మొదటిది వేణుగానం. శ్రీకృష్ణుని వేణుగాన్ని పశువులు పక్షులు, గోప, గోపికా జనాలు విని ఆనందించి, ఆ మధురామృతంలో వారి జీవితాలను తరింపజేసుకున్నారు. రెండో గానం గీతాగానం, ఇది యుగ యుగాలకి, దేశ కాలాతీతమైన, శాశ్వతమైన, సనాతనమైన, నిత్యనూతన మైన, సమస్త వేదాంత సారం. ఇది యావత్‌ ప్రపంచానికి ప్రామాణిక గ్రంథంగా విరాజిల్లుతుంది. భగవద్గీతలో దైవ ప్రకౄఎతి నిర్మా ణం. తద్వారా అస్తవ్రిద్యను స్పష్టంగా నిర్దేశించి నప్ప టికీ సూచనా ప్రాయంగా వదలి దీని కొరకు కర్మ, జ్ఞాన, భక్తి యోగాల సమన్వయమే మార్గమని చెప్పాడు.

శ్రీకృష్ణుడు గీతలోని తొమ్మిదవ అధ్యాయంలో రాజ విద్యను బోధించాడు. ఈ విద్య బోధనకై వ్యవస్థ బాధ్యతను మైత్రే యుడు, ఉద్ధవుడికి అప్పగించాడు. హిమాలయాలలో ఇప్పటికీ సత్రయాగం జరుగుతుంది. వాక్‌ శక్తిని మర్చిపోకుండా మహ నీయుల సాధన ద్వారా లోక కల్యాణం కోసం కృష్ణుడు దీనిని అందించాడు. ఎందరో మహనీయులు భగవద్గీతను వారి సాధనల్లో ఉప యోగించుకుని పరమాత్మ స్వరూపులుగా లోకంలో ఆరాధింపబడుతున్నారు.

శ్రీ రామకృష్ణపరమహంస
సమలోష్టాశ్చ కాంచన: (గీత 14-24) మట్టిని, బంగారాన్ని ఒకేలా చూడగల్గారు. కామినీ, కాంచనాలను జయించి పరమ హంస స్థాయిని చేరుకున్న మహనీయుడు. ఈ సాధనే అజపా లేక పరమహంస సాధన అని అంటారు.
మహర్షి అరవింద :
జైలులో వుండగా దొరికిన చిన్న కాగితం ముక్కతో గీతా వాక్యం ’’వాసుదేవ: సర్వమితిన మహాత్మాసు దుర్లభ:’’ (భ.గీ. 7-9) శ్లోకపాదాన్ని సాధన చేసి శ్రీకృష్ణుని దివ్య చేతనత్వాన్ని దర్శించి మహర్షి స్థానాన్ని చేరుకున్నారు.
షిర్డీసాయి, సత్యసాయి :
శరణాగతి శ్లోకం, పురుషోత్తముని కోరుట ’’సర్వధర్మాన్‌ పరిత్యజ్య మా మేకం శరణం వ్రజ అహంత్వా సర్వ పాపేభ్యోమోక్ష యిష్యామి మాశుచ:’’ (గీత 18-66) ధర్మా ధర్మ విమర్శలనన్నింటినీ వదిలి నన్నే శరణాగతి వేడినవారిని, నేను సర్వపాప విముక్తుని చేయుదును అనే అభయాన్ని షిర్డిసాయి, సత్యసాయిలు ఇచ్చారు.

లాహిరీ మహశయులు (క్రియాయోగం)
అనన్యాశ్చింతయంతో మాంః (గీ.9.22) ఏ పని చేస్తున్నా, శ్వాసను పీలుస్తున్నాం అనే ధ్యాస నిరంతరం వుంచుకోవడం, దీనిని సమానంగా ఉంచుకోగల్గటమే యోగం. సమత్వం యోగ ఉచ్యతే (గీత-2-48) ఈ శ్లోకం యొక్క సాధనా విధానం.
పండిత శ్రీరామశర్మ :
భారతీయ సంస్కృతికి గాయత్రీమాత అయితే యజ్ఞంపిత. భగవద్గీతలో. గాయత్రీం ఛందసామం (గీత 10-35), నహయజా: ప్రజా సృష్ట్యా (గీత 3-10) నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితమ్‌ (3-15) శ్లోక పాదముల నాధారంగా చేసుకొని సమస్త విశ్వాసానికి కుల, మత, జాతి విచక్షణ లేకుండా అందరికి గాయత్రీ మంత్రాన్ని, యజ్ఞాన్నిసార్వజనీనం చేశారు.
ఈ విధంగా గీతాసారాన్ని మనసారా గ్రోలడం వలననే అది మానవుల్ని సక్రమ మార్గంలో నిలబెట్టి మహనీయులుగా తీర్చి దిద్దగల శక్తివంతమైన గ్రంధంగా అలరారుతోంది. ఇంతటి మహత్తర గ్రంధరాజాన్ని ఈ ‘గీతా జయంతి’ సందర్భంగా మనస్ఫూర్తిగా పూజించి, పఠించి, నిత్యపారాయణ గావించి అందరూ తరించే ఈ మార్గంలో ప్రయాణించడానికి ఈరోజే చాలా అనువైన రోజు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top