You Are Here: Home » ఇతర » సకల కళా .. సిందుజా

సకల కళా .. సిందుజా

కళలను అభిమానించడానికి, అభ్యసించడానికి కళాకారుల కుటుంబ నేపధ్యం అవసరం లేదని నిరూపించింది సింధూజ. చిన్న వయసులోనే నృత్యం పట్ల ఇష్టం ఏర్పడి ఎనిమిదోయేటనే భరతనాట్యం నేర్చుకున్నారు. తన పదోసంవత్సరంలో మెుట్టమెుదటి నృత్యప్రదర్శనతో నాట్యాభిషేకానికి శ్రీకారం చుట్టిన సింధూజ ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 60 పైగా ప్రదర్శనలతో కళాభిమానులను సమ్మోహితులను చేశారు.

dancహైదరాబాద్‌లోని బాగ్‌అంబర్‌పేటలో నివాసముంటున్న సింధూజ తండ్రి ఇంజనీర్‌, తల్లి గెైనకాలజిస్ట్‌ తన చిన్నవయసులోనే సినిమాల్లో నృత్యాన్ని చూసి డాన్స్‌ పట్ల ఉన్న మక్కువను తల్లితో చెప్పారు.నాట్య గురువులు బూర్గుల మాదవి వద్ద భరతనాట్యం నేర్చుకుని పదోయేటన త్యాగరాయగానసభలో కళాభిమానుల సమక్షంలో ఆరంగేట్రం చేశారు. అనంతరం పొట్టిశ్రీరాములు తెలుగుయూనివర్సిటీలో కూచిపూడిలో డిప్లొమా పొందారు. అదేవిధంగా కర్ణాటక మ్యూజిక్‌లో డిప్లొమాను సాధించారు. శ్రీవేదాంతం రాఘవయ్య, శ్రీమతి పద్మకల్యాణి, యశోద ఠాకూర్‌ల వద్ద నృత్యాన్ని నేర్చుకు న్నారు. ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్‌ హైదరా బాద్‌లో కూచిపూడి-ఎంపిఏలో ఆఖరి సంవత్సరం అభ్యసిస్తున్నారు. సినీరంగంలో తమిళ నటి కమల, తెలుగు నటులు ఎల్‌.విజయలక్ష్మి, భానుప్రియలు డాన్స్‌ అంటే తనకెంతో ఇష్టమని సెల్యులాయిడ్‌పెై వారు చేసే నృత్యం అపూర్వంగా ఉంటుందని ఆమె తెలిపారు.

ప్రస్తుత నాట్యగురువెైన యశోద ఠాకూర్‌ తనకిష్టమైన నర్తకి అని చెబుతున్నారు. నాట్యగురువు వెంపటి చినసత్యం వర్క్‌షాప్‌లో వారంరోజులు శిక్షణపొందడం, 2011లో అప్పటి రాష్టప్రతి ప్రతిభాపాటిల్‌ ముందు ప్రదర్శన ఇవ్వడం మరిచిపోలేని అనుభూతలని ఆనందాన్ని వ్యక్తం చేశారు. శ్రీ అండాళ్‌, పరిపూర్ణ గంగ, గోపికాగీతం, గజాననీయమ్‌ అంశాలను ఎక్కువగా ప్రదర్శించి ప్రేక్షకాభిమానులను మెప్పించారు. సింధూజ తన ప్రదర్శనలతో పలు అకాడమీల నుంచి నృత్య భూషణ్‌, నృత్యకిన్నెర, బాలప్రతిభ, బాలమయూరి పురస్కారాలను పొందారు. విద్యారంగంలో అర్కిటెక్ట్‌లో మాస్టర్స్‌ ఇన్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌ పూర్తిచేశారు. లెైట్‌మ్యూజిక్‌లోనూ ప్రావీణ్యం ఉన్న సింధూజ పెయిం టింగ్స్‌లోనూ అందెవేసిన చెయ్యి. భరత నాట్యం, కూచిపూడి, చిత్రకళా రంగా లలోనూ అభిరుచి ఉండబట్టే ఆయా రంగాల్లో ప్రవేశించడం జరిగిందని తెలిపారు.

చిన్నప్పటి నుంచి తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు తన భర్త ప్రోత్సాహం కూడా తోడవడంతో రాణించగలుగుతున్నట్లు సింధూజ స్పష్టం చేశారు. చెైనె్నైలోని మ్యూజిక్‌ అకాడమీలోనూ, విదేశాల్లోనూ నృత్యప్రదర్శనలు ఇవ్వాలని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు. అదేవిధంగా విశ్వవ్యాప్తమవుతున్న కూచిపూడి నృ్యత్యానికి తనవంతు సేవలందించడమే ధ్యేయమని సింధూజ అభిలాషను వ్యక్తం చేశారు.

సింధూజ ప్రముఖ ప్రదర్శనలు…

 • వాల్మీకి జయంతి
  a58
 • వేడుకలు…..హైదరాబాద్‌….1995-96-97
 • నృత్యోత్సవ్‌…అనసూయ
 • అకాడమీ….హైదరాబాద్‌….1995-96-97
 • *శివరాత్రి ఉత్సవాలు….శ్రీశెైలం…..1998
 • నేషనల్‌ అనెస్తటిక్స్‌
 • సమావేశం….హైదరాబాద్‌….2000
 • ముఖ్యమంత్రి ఫండ్‌ ప్రోగ్రామ్‌…2004
 • నాట్యస్వర…హైదరాబాద్‌…2012
 • బాసంత్‌ పంచమి ఉత్సవ్‌…భువనేశ్వర్‌…2006
 • వజోత్రవ్‌…కమ్మ మహాజన్‌సంఘం ….ఖమ్మం…2006
 • బ్రహ్మోత్సవమ్‌…యాదగిరిగుట్ట…..2007
 • ప్రపంచ మిలట్రీ గేమ్స్‌…హైదరాబాద్‌….2007
 • కోణార్క్‌ ఫెస్టివల్‌…కోణార్క్‌….2008
 • శతరూప…ఏపి రాష్ట్ర కల్చరల్‌
 • అఫెైర్స్‌…విజయవాడ…2010
 • రాజరాజేశ్వరం….తంజాపూర్‌(భరతనాట్యం)
 • పల్లోత్సవ్‌..మైసూర్‌…2010
 • టిటిడి బ్రహ్మోత్సవమ్‌…తిరుపతి…2010
 • సత్యమయూరి….కూచిపూడి….2011
 • నవీన్‌ కళాకార..భువనేశ్వర్‌….2011
 • నందనీరాజనం…టిటిడి(తిరుమల)….2011
 • ఇండియన్‌ థియేటర్‌
 • ఒలంపియాడ్‌….కటక్‌…2011
 • ప్రతినిలయం….హైదరాబాద్‌…2011 ఏపి టూరిజం రోడ్‌షో…ముంబాయి

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top