You Are Here: Home » ఇతర » సంస్కృతికి ప్రతీక ఆ ప్రతిమ

సంస్కృతికి ప్రతీక ఆ ప్రతిమ

Neptaనెప్ట్యూన్‌ అనేది జర్మనీ రాజధాని బెర్లిన్‌లో ఉండే చరిత్రాత్మక, అత్యంత ప్రసిద్ధి చెందిన ఫౌంటైన్‌ పేరు. జర్మన్ల సంస్కృతికి ప్రతీకగా ఏర్పాటు చేసిన శిల్పమిది. ఇది గ్రీకుల ఆరాధ్య దైవమైన నెప్ట్యూన్‌ కూడా. ఈ విగ్రహానికి నాలుగు వైపులా అక్కడి ప్రము ఖ నదులకు ప్రాతినిధ్యం వహించే విధంగా నాలుగు స్త్రీ మూర్తులను ఏర్పాటు చేశారు. చుట్టూ మొసలి, చేప, తాబేలు లాంటి జలచరాల బొమ్మలు ఏర్పాటు చేసి వాటి నోటినుంచి నీళ్ళు వస్తున్నట్లుగా ఉండే విధంగా మనస్సుకు హత్తుకునే శిల్పాన్ని చెక్కారు. ఈ విగ్రహాన్ని మొదటి సారిగా రూపొందించినది ప్రపంచ ప్రఖ్యాత వాస్తుశిల్పి కార్ల్‌ ఫ్రెడ్రిక్‌ సింకల్‌. విగ్రహం నిర్మాణం పూర్తి అయింది కానీ, అక్కడ ఏర్పాటు చేయాలనుకున్న ఫౌంటైన్‌ నిర్మాణం వివిధ కారణాల తో పూర్తి కాలేదు.

ఆ తరువాత ఆయన రూపొందిం చిన డిజైన్‌ను పూర్తి చేసే బాధ్యతను మరో ప్రఖ్యాత శిల్పి రైన్‌ హోల్డ్‌ బేగస్‌ తనపై వేసుకున్నాడు. నలభై మూడు సంవత్సరాలు సంవత్సరాల తర్వాత… సుదీర్ఘ శ్రమతో ఎట్టకేలకు క్రీస్తు శకం 1891లో బెర్లిన్‌ నగరంలోని కోట అవరణలో దీని నిర్మాణం పూర్తి చేశారు. ఆ తరువాత రెండో ప్రపంచ యుద్ధం సమ యంలో బెర్లిన్‌లో ఏర్పాటు చేసిన వాస్తు శిల్పాలు పూర్తిగా పాడై పోయాయి. యుద్ధ సమయం ముగిసిన తర్వాత పాడైపోయిన ఆ ఫౌంటైన్‌ను ఫ్రాన్స్‌ ప్రభుత్వం పూర్తిగా తొలిగించింది. ఆలాంటిదే మరో ఫౌంటైన్‌ను నగరంలోని సెయింట్‌ మేరిస్‌ చర్చి సమీపంలో 1951 లో తిరిగి ఏర్పాటు చేశారు. ఈ విగ్రహమై ఇప్పుడు హై విజిటర్స్‌ లిస్టులో చేరింది.

ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే లక్షలాది సందర్శకులకు ప్రముఖ ఆకర్ష ణగా మారింది. ఈ మధ్య కాలంలో ఆ విగ్రహం వద్ద ప్రయోగాత్మంగా కొన్ని అంశాలను ఏర్పాటు చేశారు. మనం వంటింట్లో గిన్నెలు కడగడానికి ఉపయోగించే రసాయనాన్ని కొద్ది మోతాదులో అక్కడి నీళ్లకు చేర్చారు. దీంతో ఫౌంటైన్‌ నుంచి వచ్చే నీటి ధారల వేగం, ఒత్తిడికి నీటిలో నురగలు పెరిగిపోయాయి. అక్కడొక హిమాలయ పర్వతమే ఏర్పడిందా అన్నట్లుగా మారింది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top