You Are Here: Home » ఇతర » సంస్కారవంతులు

సంస్కారవంతులు

సంస్కారవంతులని నిర్వచించబడతారు.
aaaaకుటుంబంలో గానీ, విద్యాలయాలలో గానీ, సమాజంలోగానీ, సంఘంలోగాని సంఘ జీవిగా జీవించే ఒక వ్యక్తి యొక్క ఆచరణీయమైన, ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా, హాయిగా మసలే నైజం సంస్కారమనుకుంటే… అటువంటి సంస్కారంను వివరించేవారు, సంస్కారంను అలవరచుకునే వారు జన్మగతమైన సంస్కారానికి కుటుం బ సభ్యులు అంకురార్పణ చేస్తే, గురువలు దానికి మెరుగులు దిద్దుతా డు. అటువంటి సంస్కారవంతులకు అద్భుతమైన ఉదాహరణలుగా అనేక ఐతిహాసిక పాత్రలు శాశ్వత ఉదాహరణ లుగా రూపుదిద్దుకున్నాయి. రామాయ ణంలో, భాగవతంలో ఆచరణీయమైన, అనుసరణీయమైన అనేక వ్యక్తిత్వాలు, సంస్కారవంతమయిన పాత్రలు నేటికీ మన కళ్ళ ముందు కదలాడుతున్నట్లని పిస్తాయి.

సర్వకాల సర్వావస్థలలో చక్కని సమా జాన్ని, దాంపత్య ధర్మాన్ని, తల్లీకొడు కుల అనుబంధాన్ని, సోదర సంబం ధాన్ని, స్నేహబంధాన్ని అద్భుతంగా విశ్లేషించే రామాయణ మహాకావ్యంలో అయోధ్యకాండలో శ్రీరామచంద్రుని వ్యక్తిత్వాన్ని వాల్మీకి మహర్షి ఇలా ఆవిష్కరిస్తాడు.శ్రీ రామచంద్రుడు నిత్యం సత్యం మాత్ర మే పలికేవాడు. ప్రశాంతమైన అంతరం గం గలవాడు. తొణికేవాడు కాడు. బెణి కేవాడు కాడు. మృదు మధురమైన సం భాషణ చేసేవాడు. ఎవరైనా కఠినంగా మాట్లాడితే, తిరిగి జవాబిచ్చేవాడు కాదు. విని ఊపేక్షించేవాడు. శ్రీరాముడు చక్కని బుద్ధి గలవాడు. మధురమైన వాక్కులు గలవాడు. ఎవరి నైనా తానే ముందుగా పలకరించే వాడు. తాను ఎంత బలవంతుడైనా, ఏమాత్రం బల గర్వం లేని వినయశీలి అని వాల్మీకి ప్రస్తుతిస్తాడు.పట్టాభిషిక్తుడు కావలసిన తాను, వనవాసం వెళ్ళవలసి వచ్చినందుకు రాముడు చింతించలేదు. కైకేయిని నిందించలేదు.

‘అమ్మా! ఎవ్వరూ అడగకుండానే నేను సీతనుగాని, రాజ్యాన్నిగాని, ప్రాణాలనుగాని ధనాన్నిగాని సంతోషంగా తమ్ముడు భరతునకు ఇచ్చి వస్తాను. అమ్మా! నాకు ధనాశ లేదు, లోకులను నా వైపు తిప్పుకో వాలని కోరుకోవడం లేదు. నేను కేవలం ధర్మపరుడైన ఋషివంటి వాడనని’ శ్రీరాముడు చెబుతాడు. ‘సీతను రావణుడు అపహరించినాడయ్యా’ అని రెక్కలు తెగి పోయిన జటాయువు వివరిస్తుంటే, జటాయువును కౌగి లించుకుని విలపించే రాముడు ఇలా అంటాడు ‘లక్ష్మ ణా! పశుపక్ష్యాదులలో కూడా శరణవిచ్చే ధర్మాత్ములు, సాధువులు అన్నిచోట్లా కనబడుతుంటారు. ఆత్మీయుడైన జటాయువు దెబ్బతిన్నాడు.

నా దురదృష్టం ఎంత గొప్ప ది? పక్షిరాజా! నాచే సంస్కారము పొందిన నువ్వు యజ్ఞం చేసినవారు, పునర్జన్మ లేనివారూ, భూదానం చేసినవారూ ఏ ఉత్తమలోకాలు పొందుతారో… ఆ లోకాలకే నువ్వు వెళ్ళగల’వని దహన సంస్కారాలు చేస్తా డు.ఆత్మగత, జన్మగత సంస్కారానికి, తల్లిదండ్రుల పెంపకం లో, గురువుల విద్యాభ్యాస క్రమశిక్షణలో పరిణతి చెందిన వ్యక్తిత్వాన్నే ఏ సమాజమయినా కోరుకుంటుం ది. అటువంటి వ్యక్తిత్వానికి శ్రీరామచంద్ర మూర్తి ప్రథమ ఉదాహరణగా మనకు గోచరిస్తున్నాడు. ఆయన వ్యక్తిత్వ లక్షణాలలో ఒక శాతాన్ని అయినా నేటి ప్రజ పాటించగలిగితే, ఓ ఉత్తమసమాజం మన కళ్ళ ముందుంటుంది.

– సూర్యప్రసాదరావు

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top