You Are Here: Home » ఇతర » సంప్రదాయ బీమా ఉత్పాదనలు ఎప్పుడు అనువైనవి?

సంప్రదాయ బీమా ఉత్పాదనలు ఎప్పుడు అనువైనవి?

సరైన జీవిత బీమా ఉత్పాదనను ఎంచుకోవడం అంత సులభం కాదు. ఎంతో జాగ్రత్తతో కూడిన ఆలోచన, పరిశీలన అవసరమవుతాయి. మీ ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలను, ఆర్థిక పరిస్థితులను ఈ సందర్భంగా పరిఠీగణనలోకి తీజూసుకోవాల్సి ఉంటుంది. జీవిత బీమా ఉత్పాదనలను స్థూలంగా సంప్రదాయ, యూనిట్‌ లింక్డ్‌ (సాధారణంగా వీటిని ఈక్విటీ లింక్డ్‌గా వ్యవహరిస్తారు) ఉత్పాదనలుగా విభజించవచ్చు.

Tax1సంప్రదాయ, ఈక్విటీ లింక్డ్‌ ఉత్పాదనల మధ్య తేడా ఏంటి ? ఇన్వెస్ట్‌ మెంట్‌ రిస్క్‌ను బీమా సంస్థ భరిస్తుందా లేదా కస్టమర్‌ భరిస్తారా ? సులభశైలిలో చెప్పాలంటే, సంప్రదాయ ఉత్పా దనల్లో ప్రీమియంలను నియంత్రణ సంస్థ మార్గదర్శకాలకు అనుగు ణంగా బీమా సంస్థ ఇన్వెస్ట్‌ చేస్తుంది. ప్రీమియంలు చెల్లిస్తున్నం దుకు గాను, కస్టమర్‌గా మీరు నిర్దిష్ట గ్యారంటీడ్‌, నాన్‌గ్యారంటీడ్‌ ప్రయోజనాలను పొందగలుగుతారు. యూనిట్‌ లింక్డ్‌ ఉత్పాదనల్లో అందుబాటులో ఉన్న ఫండ్స్‌ జాబితాలో నుంచి కస్టమర్‌ తన ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. యూనిట్‌ లింక్డ్‌ ఉత్పాదనల్లో, ఇన్వెస్ట్‌మెంట్‌ (ప్రధానంగా ఈక్విటీ షేర్లు)ను బట్టి ఆయా ఇన్వెస్ట్‌ చేసిన ఫండ్స్‌ విలువ వృద్ధి చెందడం లేదా తగ్గిపోవ డం జరుగుతుంది. ఈ రిస్క్‌ను బీమా సంస్థ గాకుండా పాలసీదారు మాత్రమే భరించాల్సి ఉంటుంది.మరి, మీకు ఎలాంటి ఉత్పాదన సరైనదో నిర్ణయించుకోవడం ఎలా? ఏదైనా బీమా ఉత్పాదనను కొనుగోలు చేసేందుకు ముందుగా మీరు మీ ఆర్థిక ప్రణాళికను సమీక్షించుకోవాలి. అది మీ ఆర్థిక అవసరాల గురించి ఓ స్పష్టతను అందిస్తుంది. మీ ప్రాథమ్యాలు, రిస్క్‌ తీసు కునే శక్తిసామర్థ్యాలను అవగతం చేసుకునేందుకు తోడ్పడుతుంది.

బీమా ఉత్పాదనను కొనుగోలు చేయడం వెనుక ప్రధాన లక్ష్యం అనుకోని సంఘటన ఏదైనా జరిగితే కుటుంబానికి రక్షణ కల్పించడం అనే విషయం మర్చిపోవద్దు. ఏ రకమైన ఉత్పాదనను మీరు ఎంచుకున్నప్పటికీ, మీ అవసరాలకు అనుగుణంగా మీరు కోరుకున్న రక్షణ ఉందన్న విషయాన్ని నిర్ధారించుకోవాలి. మీ ఆదాయం, మీపై ఆధారపడిన కుటుంబసభ్యుల సంఖ్య, వయస్సు లాటి అంశాలను ఈ సందర్భంగా పరిగణనలోకి తీసుకోవాలి. సంప్రదాయ, యూనిట్‌ లింక్డ్‌ ఉత్పాదన ఏదైనా కూడా మీరు ఈ సంరక్షణను దృష్టిలో ఉంచుకోవాలి. తగిన సమ్‌ అష్యూర్డ్‌ను, యాడ్‌ ఆన్‌ ప్రొటెక్షన్‌ రైడర్లను ఎంచుకోవాలి. మీ కుటుంబానికి సరిపడా సంరక్షణ అందించామని భావించిన తర్వాత, ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్స్‌కు సంబంధించి కొన్ని సాధారణ మార్గదర్శకాలను నిర్దేశించుకోవచ్చు. ఈ సందర్భంగా కొన్ని సందేహాలు, వాటికి సమాధానాలు చూద్దాం.

1. ఇన్వెస్ట్‌మెంట్‌ రిస్క్‌ను మీరు భరించగలరా ? ఉదహరణకు ఇన్వెస్ట్‌మెంట్‌ వాల్యూ మార్కెట్‌ పరిస్థితులకు తగ్గట్టుగా పెరగవచ్చు లేదా పడిపోవచ్చు.
జ: ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రతిఫలాలకు సంబంధించి గత అనుభవాలు సూచించేదేమంటే, దీర్ఘ కాలంలో ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ అధిక ప్రతిఫలాలను అందించగలవని, ఈ మధ్య కాలంలో, మీ పెట్టుబడి విలువ (ఇన్వెస్ట్‌మెంట్‌ వాల్యూ) మాత్రం ఎగుడు దిగుడులకు లోన య్యే అవకాశం ఉంటుంది. ఇన్వెస్ట్‌మెంట్‌ రిస్క్‌ ఎంత ఎక్కువగా ఉంటే, ప్రతిఫలాలు కూడా అంత ఎక్కువగా ఉండే అవకాశం ఉం టుంది. అందువల్ల మీరు దీర్ఘకాలిక లాభాల కోసం చూస్తున్నట్ల యితే, రోజువారీ ప్రాతిపదికన మీ ఇన్వెస్ట్‌మెంట్‌ వాల్యూ హెచ్చు తగ్గులకు లోనయ్యే ఇన్వెస్ట్‌మెంట్‌ రిస్‌కను తట్టుకోగలిగితే, ఈక్విటీ లింక్డ్‌ ఉత్పాదనలను ఎంచుకోవచ్చు. సంప్రదాయక ఉత్పాదనల్లో ఈక్విటీలో పెట్టుబడి నిర్దిష్ట శాతానికి లోబడి ఉండడం వల్ల ప్రడతి ఫలాలు తక్కువగానే ఉంటాయి.

2. మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్‌ కనీస ప్రతిఫలం హామీని ఇవ్వాలని భావిస్తున్నారా ?
జ మీ వ్యక్తిగత ఆర్థిక స్థితిగతు లను, మీ ఇన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యాలను పరిశీలించుకోండి. మీ అసలు మొత్తాన్ని మీరు నష్ట పోవద్దు అనేది మీకు ముఖ్యమైతే, నిర్దిష్ట సమయానికి హామీపూ ర్వక మొత్తాన్ని పొందదలిస్తే, సంప్రదాయక ఉత్పాదనలను ఎం చుకోండి, ఈ సంప్రదాయక ఉత్పాద నలు మెచ్యూరిటీపై లేదా అనుకోని సంఘటన ఏదైనా జరిగితే, అష్యూర్డ్‌ సమ్‌ (సమ్‌ అష్యూర్డ్‌)కు హామీ ఇస్తాయి. బీమా సంస్థ పనితీరును బట్టి లేదా అవి లింక్‌ అయి ఉన్న ప్రభుత్వ సెక్యూరిటీల రేట్లను బట్టి హామీ లేనటువంటి అద నపు మొత్తాలు లేదా బోనస్‌లు కూడా లభించే అవకాశం ఉంటుంది. ఈక్విటీ ఉత్పాదనల్లో, ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఎంచు కునే ఎంపిక అవకాశం ఉంటుంది. అదే సమయంలో ప్రతిఫలాల కు లేదా ఇన్వెస్ట్‌ చేసిన మొత్తానికి ఎలాంటి గ్యారంటి ఉండదు.

3. ఇన్వెస్ట్‌మెంట్‌ సమయంలో, మీరు మీ అసెట్‌ అలోకేషన్‌ మార్చుకోవాలని లేదా నియంత్రించుకోవాలని భావిస్తున్నారా ?
జ : యూనిట్‌ లింక్డ్‌ ఉత్పాదనలు ఈక్విటీ లేదా డెట్‌ లేదా మనీ మార్కెట్‌ ఫండ్స్‌ లాంటి వివిధధ రకాల ఆస్తులపై మీ ఫండ్స్‌ అలోకేషన్‌ మార్చుకునే సరళత్వాన్ని అందిస్తాయి. ఏదేమైనా మీరు మీ అసెట్‌ అలొకషన్‌ను చురుగ్గా నిర్వహించుకున్నప్పుడు, అందులో దాగి ఉండే ప్రతిఫలాలు, రిస్క్‌ స్థితిని అలొకేషన్‌ను చురుగ్గా నిర్వహించుకున్నప్పుడు, అందులో దాగి ఉండే ప్రతిఫలాలు, రిస్క్‌ స్థితిని అవగతం చేసుకున్నప్పుడు మాత్రమే పనికొస్తుంది. యూనిట్‌ లింక్డ్‌ ఉత్పాదనల్లో మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్‌ను రోజువారీ ప్రాతిపధికగా, బీమా సంస్థ తమ వెబ్‌సైట్‌లో అందించే ఎనఏవీ ద్వారా తెలుసుకోవచ్చు. మీరు గనుక మీ అసెట్‌ అలొకేషన్‌ను చురుగ్గా నిర్వహించాలని అనుకోకపోతే, బీమా సంస్థ పేర్కొన్న హామీపూర్వక ప్రతిఫలంతో సంతృప్తి చెందాలని భావిస్తే సంప్రదాయక ఉత్పాదనలే మేలు.

4. ఎర్లీ ఎగ్జిట్‌ లేదా ప్రీమియం కట్టడం మధ్యలో మానివేయడం లాంటి అంశాలపై మీకు అవగాహన ఉందా ?
జ : ఊహించని ఖర్చుల కారణంగా మీరు ప్రీమియం చెల్లింపులు మధ్యలోనే నిలిపి వేయాల్సిన అవసరం ఏర్పడవచ్చు. అన్ని జీవిత బీమా ఉత్పాదనలు కూడా దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలకు సంబంధించినవి. వాటి నిర్దేశిత కాలం ముగియక ముంధే వాటిని సరెండర్‌ చేసినా, ప్రీమియం కట్టడం మానేసినా పాలసీదారు కొంత వ్యయం భరించకతప్పదు. యూనిట్‌ లింక్డ్‌ ఉత్పాదనల్లో 5 ఏళ్ల లాక్‌ ఇన్‌ సమయం ఉంటుంది. ఆ సమయంలో మీరు మీ ఫండ్స్‌ను యాక్సెస్‌ చేయలేరు. ప్రీమియంలు కట్టడం మానివేయలేరు. అలా చేస్తే మీ ఇన్వెస్ట్‌మెంట్‌ కనీస ఈల్డ్‌ ఫండ్‌లోకి మారిపోతుంది. స,ప్రదాయక ఉత్పాదనల్లో మీరు గనుక ప్రీమియంలు చెల్లించకపోతే, మీ ప్రయోజనాలు తగ్గపోతాయి. పాలసీ సరెండర్‌ చేస్తే, మీరు ప్రీమియంలుగా చెల్లించన మొత్తంలో గణనీయ భాగం నష్టపోయే అవకాశం ఉంది. అందుకే కనీసం రానున్న ఐదేళ్ల పాటు ప్రీమియంలు చెల్లించగలుగుతామని భావించినప్పుడు మాత్రమే, సులభంగా ఎగ్జిట్‌ అయ్యే అవకాశం ఉన్నప్పుడు మాత్రమే యూనిట్‌ లింక్డ్‌ ప్లాన్స్‌ తీసుకోవడం మంచిది.

యూనిట్‌ లింక్డ్‌ ఉత్పాదనలు సమ్‌ అష్యూర్డ్‌ మార్చుకునేందుకు, అసెట్స్‌ మిక్స్‌ మార్చుకునేందుకు, ఫండ్‌ నుంచి కొంత మొత్తం వెనక్కు తీసుకనేందుకు సరళమైన అవకాశాలు కల్పిస్తాయి. సంప్రదాయక ఉత్పాదనలు సాధారణంగా పాలసీపై కొంత మొత్తాన్ని రుణం రూపంలో తీసుకునేందుకు అనుమతిస్తాయి.

5. ఉత్పాదన గురించి, అది అందించే ప్రయోజనాలు, షరతుల గురించి అవగాహన కలిగి ఉన్నారా ?
జ : అన్నింటి కంటే ముఖ్యమైన ప్రశ్న, ఒక బీమా ఉత్పాదన అందించే ప్రయోజనాలు, ఆప్రయోజనాలతో ముడిపడి ఉన్న షరతులను అర్ధం చేసుకోవడం. సంప్రదాయ ఉత్పాదనలు సాధారణంగా అర్థఐ చేసుకునేందుకు సులభంగా ఉంటాయి. క్రమం తప్పకుండా ప్రీమియంలు చెల్లిస్తుంటే, మరణించినా, జీవించి ఉన్నా ముందుగా పేర్కొన్న ప్రయోజనాలను అందిస్తాయి. మీ ఈక్విటీ లింక్డ్‌ ఉత్పాదన ఎలాంటి పరిస్థితుల్లో ఎటాంటి ప్రయోజనాలను అందిస్తుందో అర్థంగాక సతమతమవుతుంటే, మీరు ఆయా ఉత్పాదనల వివరాలు ఉంటాయి) బహుశా మీకు సంప్రదాయక ఉత్పాదన మంచిది. ఈ సందర్భంలో మీరు విశ్వసించే అర్థిక సంస్థను కలవడం మంచిది. ఈ సందర్భంలో మీరు విశ్వసించే ఆర్థిక సంస్థను కలవడం మంచిది. వారు మీ సందేహాలను తీర్చగలరు. మీ ఆర్థిక స్థితిగతులు, అవసరాలు లాంటి వాటిని అర్థం చేసుకుని తగిన సూచనలు ఇవ్వగలరు.

– చిరాగ్‌ రాథోడ్‌, అపాయింటెడ్‌ ఆక్చురీ అండ్‌ డైరెక్టర్‌, ఆక్చురియల్‌ అండ్‌ పోడక్ట్‌‌స, కెనరా హెచ్‌ఎస్‌బీసీ ఓరియెంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ

Other News From

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top