You Are Here: Home » దైవత్వం » సంతృప్తితో కూడిన జీవితం

సంతృప్తితో కూడిన జీవితం

10Feaజ్ఞానం, ఆనందం, ప్రేమ, శాంతి వంటివే ఆత్మతృప్తికి మూలం. బయటి వ్యక్తులు మరియు వస్తువులు మన ఈ అవస్థను పాడుచేసేందుకు ప్రయత్నిస్తాయి.ఈ వస్తువుల యొక్క బయటి రూపం మనం కామ, క్రోధ, లోభ, మరియు అహం వంటి వికారాల వైపుకు లాగుతుం ది. మనం సహజంగా ఉండకపోవడం వంటి కారణం వల్లే మనం ఆత్మ విస్మృతిలోకి వచ్చి, నిజస్వ రూపాన్ని మరిచి ఈ వికారాలనే మన స్వభావాలుగా తయారు చేసుకుంటాం లేదా పుణ్య ఆత్మల నుండి పాప ఆత్మలుగా మారిపోతారు. విషయ వాసనలు, విషయ లాలసం, ఇంద్రియాల భోగాలలో లుప్తమయిపోతారు. దీని ద్వారా ఒక క్షణికమయిన సుఖం సంతోషం కోసం యత్నిస్తారు. తద్వారా ఆ క్షణం మాత్రమే సుఖాన్ని సంతోషాన్ని పొందిన తరువాత దుఃఖితులమై అశాంతగా కనిపిస్తారు.
కళ్ళ ముందు వివిధ రకాల చిత్రవిచిత్రమైన ఆటలు ఆడుతూను ఉంటారు. మనకు కనిపిస్తు ఉంటుంది.

ఈ విషయం ప్రపంచంలోని అన్నీ రకాల సంబంధాల విషయంలో వర్తిస్తుంది.
ఎప్పటి వరకు అయితే మనం మన ఆత్మికస్థితిలో ఉంటూ మారుతున్న స్వరూపం, సంబంధాలకు సాక్షిగా దృష్టి కోణంలో చూడనట్లైతే అప్పటి వరకు ఒక స్థాయిఓ సంతృప్తి ప్రాప్తించదు.
మన సంతృప్తి కోసం మనం బయటి వస్తువులపై ఆధారపడి ఉండకూడదు. బయటి వస్తువులు, వ్యక్తులలో వస్తున్న మార్పులకు మనం దాసోహం కారాదు. వీటి సంరక్షకులుగా పరిపాలకులుగా భావించాలి. లేదంటే చలన చిత్రాలకు సమానంగా పెల్లుబుకు వస్తున్న… రంగు రంగుల చిత్రాలను మారుతున్న దృశ్యాల ప్రస్తుతం నడుస్తున్న వర్తమానపు తోలు బొమ్మలను చూస్తూ కూడా మన వాస్తవాన్ని మరిచిపోయారు. మారుతున్న విలువలు, మన స్థాయి స్వరూపాలలో తేడా, దృష్టి నుండి మళ్లించకుండా మనం ప్రతి పరిస్థితిలోనూ సంతృప్తిగా ఉండగలం. స్థాయి, స్వరూపాన్ని దృష్టిలో ఉంచుకుంటే పరివర్తనతో కూడిన దృష్యాలు మనలను ఇబ్బందిపెట్టవు. రాత్రి, పగలు, ఋతువులు మారుతూ ఉంటాయి. అయితే వీటని మనం ప్రాకృతిక నియమాలుగా అర్థం చేసుకుని స్వీకరించాలి. వాటిని చూసి అదే విధంగా వస్తువులను, వ్యక్తులలో వస్తున్న స్వరూపం, వారి వ్యవహారం, వారి ప్రాప్తి అప్రాప్తి వంటి అంశాల విషయంలో మనలను చలించనీయదు.

బ్రహ్మకుమారీస్‌, 9010161616

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top