You Are Here: Home » ఇతర » సంతానంపై విడాకుల ప్రభావం

సంతానంపై విడాకుల ప్రభావం

గత కొద్ది సంవత్సరాలుగా జరిగిన పరిశోధనలలో ’మెటా – వినాలిసిస్‌’ లనే, కీలకమైన విశ్లేషణలలో విడాకులు తీసుకున్న తల్లిదండ్రుల పిల్లల్లో అధిక శాతం, నిస్ఫృహకీ, నైరాశ్యానికీ, పాఠశాలల్లో విద్యావ్యాసంగాల్లో వైఫల్యాలకీ, చట్టపరమైన ప్రతిబంధనాలకీ, సామాజిక మానవతకీ లోనవుతున్నారు.

1fillerఅసలు, విడాకులు తీసుకునే ముందుగానే. దైనం దిక జీవితంలో, తమ తల్లిదండ్రులు పడే గొడవల తో మనసులు విరిగిపోయి, మమతలు చెదిరిపోయి, మానవత కరిగిపోయి, సంఘ విద్రోహ శక్తులుగా, ఉగ్ర వాదులుగా, తీవ్రవాదులుగా, చోరులుగా, జాదు లుగా మారిపోతున్నారట. అయితే, విడాకులు తీసుకున్న తల్లి దండ్రుల విషయంలో పిల్లలంతా ఒకే విధంగా ప్రతిస్పం దించడం లేదు. తల్లి ప్రేమ ఎక్కువగా చవిచూసినవాళ్లు. ’అమ్మ’తోనే వుండాలని కోరుకుంటున్నారు. పితృవాత్స ల్యం ఆస్వాదించినవాళ్లు తండ్రులవైపే మొగ్గు చూపుతు న్నారు. ఇంగితం తెలిసి, బాగా ఊహవచ్చిన పిల్లలు, తమ తల్లిదండ్రుల పొరపాట్లునీ, పొరపొచ్చాలనీ, అఘా యిత్యాలనీ, నిదానంగా, నిష్పక్షపాతంగా విశ్లేషించు కుని, తమ భవిష్యత్తులో, తమ తమ దాంపత్యాలలో, ప్రేమానురా గాలు వెల్లివెరిసేలా, పరస్పర సయోధ్యులతో ప్రవర్తించాలని, నిర్మాణత్మకమైన క్రియశీలకమైన నిర్ణ యాలు తీసుకుని, తమ ఆగామికి బంగారు బాటలు వేసుకుంటున్నారు. ఏదిఏమైనా తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లల మీద, వారి భవిష్యత్తు మీదా ఎంతో ప్రభావం చూపుతోందని, అది ఈ తరంలో ఎన్నో రెట్లు అధికమ య్యి సమాజానికి సవాలుగా నిలుస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top