You Are Here: Home » ఇతర » సంఘసేవా పరాయణురాలు తల్లాప్రగడ విశ్వసుందరమ్మ

సంఘసేవా పరాయణురాలు తల్లాప్రగడ విశ్వసుందరమ్మ

పశ్చిమగోదావరి జిల్లా మహిళలకు నాయకత్వం వహించి స్వాతంత్య్రోదమంలో పాల్గొన్న వనితా శిరోమణి తల్లాప్రగడ విశ్వసుందరమ్మ. వీరు 6 మార్చి 1899లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం తాలూకాలోని ‘‘ఉండి’’ గ్రామంలో మల్వవరపు శ్రీరాములు, సీతమ్మ దంపతులకు జన్మించారు . ఆమెకు ఇద్దరు తమ్ముళ్ళు, ఒక చెల్లెలు. సుందరమ్మకు తొమ్మిదేళ్ళ ప్రాయంలోనే ఉంగుటూరుకు చెందిన తల్లాప్రగడ నరసింహశర్మతో వివాహాం జరిగింది. పాఠశాలకు వెళ్ళకుండానే తండ్రి శ్రీరాములు వద్ద సుందరమ్మ పాండిత్యాన్ని సంపాదించారు. కందుకూరి వీరేశలింగం, చిలకమర్తి లక్ష్మీనరసింహం ఆంధ్ర ప్రచా రిణీ గ్రంథనిలయం ప్రచురణలన్నీ చదవగలిగారు. ఉభయ భాషాప్రవీణ, సాహిత్య శిరోమణి వంటి పరీక్షలలో ఉత్తీర్ణులైనారు. తన 16వ ఏట సుందరమ్మ గృహిణిగా కాకినాడ వెళ్ళారు. భర్త నరసిం హశర్మ పిఠాపురం రాజావారి ఆధ్వర్యంలో నడుస్తున్న అనాథశరణాల యానికి సూపరింటెండెంటుగా పనిచేస్తున్నారు.

Thalapagaaగాంధీజీ పూరించిన స్వాతంత్య్ర శంఖారావం విన్న ఆమె భర్తతోపాటు 1921లో విజయవాడలో జరిగిన రాజకీయ మహాసభలకు హాజరై నారు. ఆ తరువాత 1923 లో రాజమహేంద్రవరంలోని ఆర్యాపు రంలో గోదావరి గట్టున ఒకచోట స్థిరపడాలనే అభిప్రాయంతో ఆనం దనికే తనాశ్రమం స్థాపించారు. స్ర్తీజనాభ్యుదయం, అస్పృశ్యతా నివారణ, నూలు వడకడం, ఖాదీ వస్త్రాలను నేయ డం ఇత్యాది అనేక కార్య క్రమాలకు ఆ ఆశ్రమం నిలయమైంది. చాగల్లులో ఈ ఆశ్రమ భవన నిర్మాణానికై దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఎంత గానో సహాయ సహకారాలు అందించారు. అప్పటి నుండి ఈ దంపతు లు తమ నివాసాన్ని చాగల్లుకు మార్చారు. 1929లో ఒక పర్యాయం మహాత్మా గాంధీ ఈ ఆశ్రమానికి వచ్చి ఇక్కడ జరుగు తున్న ు చూసి సంతృప్తి వ్యక్త పరిచారు. అప్పటి వరకు గాంధీజీ అస్పృశ్యత నివారణపై అంతగా దృష్టిసారించలేదు.

అటువంటి సమ యంలోనే ఆనందనికేతన్‌ ఆశ్రమంలో ఆరేళ్ళుగా ఒక హరిజన బాలి కకు వసతి కల్పించి విద్యాబుద్ధులు నేర్పించడం పట్ల గాంధీజీ సం తోషించారు. పిల్లల ఆటపాటలు, వారి కార్యక్రమాలు చూసిన గాంధీజీ ముచ్చటపడి ఆరాత్రి అక్కడే విశ్రమించారు. ఇంతలో దేశమంతటా ఉప సత్యాగ్రహ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది. ఆనందనికేతనం ఆశ్రమం నుండి తల్లాప్రగడ సుందరమ్మ, ఆమె భర్త నరసింహశర్మ బంధుజనులు, మిత్రులతో శాసనాధికారం చేసి సత్యాగ్రహం చేయడా నికి భారీస్థాయిలో బయలుదేరారు. పశ్చిమ గోదావరి జిల్లా మహిళలకు నాయకత్వం వహించి ఉద్యమాలు నడిపారు. 1930 మేనెల మొద టివారంలో ఆమెను అరెస్టు చేసి ఆరునెలలు శిక్షవిధించి ‘బి’ క్లాసు ఇచ్చారు. అలా రాయవేలూరు జైలుకు వెళ్ళిన సాహస నారీమణి సుంద రమ్మ 7న నవంబర్‌ 1930 జైలునుండి విడుదలయ్యారు.జైలు నుండి విడుదలైన సుందరమ్మ తన కార్యకలాపాలను తిరిగి మొద లుపెట్టారు.

6 జులై 1932లో తెనాలిలో ప్రభుత్వ నిషేధాజ్ఞాలు ధిక్కరి స్తూ మండల రాజకీయ సభజరిగింది. ఆసభకు విశ్వసుందరమ్మ అధ్య క్షత వహించారు. ఈ సందర్భంగా పోలీసులు లాఠీచార్జీ చేయడమే కాక విశ్వసుంద రమ్మతో పాటు 26 మందికి జైలు శిక్ష విధించారు. ‘‘గాంధీ నామం మరువాం! మరువాం! సిద్ధము జైలూకు వెళుదాం! వెళుదాం!’’ అంటూ ఆరు నెలలు రాయవేలూరు జైలుకు ‘బి’ క్లాసులో శిక్ష అనుభవించారు. 1942 క్విట్‌ ఇండియా ఉద్యమ కాలంలో ప్రభుత్వం ఆనందనికేతన ఆశ్రమాన్ని ఆక్రమించు కుంది. అపడు విశ్వసుందరమ్మ దంపతులు నిడదవోలు లోని కాలువ గట్టున పర్ణకుటీరం వేసుకుని తమ కార్యకలాపాలు కొనసాగించారు. ఒకవైపు స్వాతంత్య్రోద్యమంలో పాల్గొంటూ మరోవైపు అసంఖ్యాకంగా కవిత లను రాయడం విశ్వసుందరమ్మలో విశేషంగా చెప్పవచ్చు.

1920 నుండి 1949 మధ్య కాలం వరకు వివిధ విషయాలపై ఆమె రచించిన ‘125 గీతాలను కవితా కదంబం’ పేరుతో 235 పేజీల గ్రంథాన్ని ప్రచురించి ఆధునిక ఆంధ్ర కవయిత్రుల్లో ప్రథమస్థానం పొందారు. దేశంకోసం తన కవితా శక్తిని సైతం అర్పించారు. ఆమె కవితలో అధికభాగం స్వాతంత్య్రోద్యమ ప్రబోధానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఉగాది పండుగ గురించి రాస్తూ పరుల పాలనము నిరసించి మన దేశ ప్రజల పాల నము నాశించి ద్రోహుల ప్రచారముల ద్రుంచమని తెల్పుతూ వచ్చేనిదే ‘సంవత్స రాది’. అని రాశారు . మరో సందర్భంలో తాగుడును నిరసిస్తూ ‘‘కల్లు స్వదేశియే’! కనుక త్రాగవచ్చుననెడు దుర్వాద మును వినకుమయ్యా’’ అని ఉద్భోదించారు. రాట్నం తిప్పమంటారు. ఖద్దరు ధరించమంటారు. బాల వితంతువు గోడు వినమంటూ స్ర్తీ జనాభ్యుదయానికి పాటు పడమని ఆమె హెచ్చరిస్తారు. గాంధీజీ వీరేశలింగం చూపిన బాటలో నడవమని ఆమె ప్రబోధిస్తారు.

విశ్వసుందరమ్మ జైలుకు వెళ్ళినపడు ‘సి’ క్లాసు రాజకీయ ఖైదీల బాధ లు ఆమెను కదిలించేవి. ‘‘మామాటలకేమి ఏమిపాపం బోసీ క్లాసు నీస డించి గౌరవము జూపకిసుమంత క్రౌర్యమునను అడలు గొల్పెదరెంతో నిరాదరమున మోటు లాఠీల వార్డరుతో మూఢమతులు’’ అని ఆమె తన ఆవేదనను వ్యక్త పరిచారు. రాయవేలూరు జైలులోని శానిటేషన్‌ గురించి గృహలకీ పత్రికలో సుదీర్ఘవ్యాసం రాశారు. విశ్వ సుందరమ్మ కవిత చదవడానికి పాండిత్యం అవసరం లేదు. అతి సహజంగా, అప్రయత్నంగా హృదయాంత రాళాలనుండి వచ్చిన మాటలే ఆమె కవితలు. ఈ దేశభక్తురాలు 30 ఆగస్టు 1949లో కన్నుమూశారు.

– షేక్‌ అబ్దుల్‌ హకీం జాని

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top