You Are Here: Home » ఇతర » సంగమించిన నదుల చైతన్య దీప్తులు

సంగమించిన నదుల చైతన్య దీప్తులు

mahaగత కొన్ని రోజులుగా సాగుతున్న మహాకుంభమేళా ఉత్సవాలు నిత్య నూతనంగా ప్రకాశిస్తున్నాయి. దేశవిదేశ ప్రజలతో పాటు దేశ ప్రముఖులు కూడా హాజరయ్యి వారి భక్తిప్రపత్తులు చాటుకుంటున్నారు. ‘జన్మనికో శివరాత్రి’ అన్నట్టు. పరమేశ్వరుడు మనకిచ్చిన గంగాభవానీ పుణ్య నదీ తోయగాలలో అరుదుగా వచ్చే మహాకుంభమేళా పర్వదినాన పవిత్ర స్నానాలు ఆచరించి పునీతులవుతున్నారు. ‘సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్ఛతి’ అన్న చందంగా ఎవరు ఏ పద్దతిలో, ఏ సంప్రదాయంలో పూజలు చేసినా అవన్నీ ఆ పరమేశ్వరునికే చెందుతాయి. అనేక మతాలు, అనేక భాషలు, వివిధ సంస్కృతులు ఉన్న కోట్లాది మంది ఈ గంగా తీరంలో ఒక్కటిగానే భాసిస్తున్నారు.

Other News From

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top