You Are Here: Home » సినిమా » పాటలు » సంకీర్తన (1987)- ఆ ఆ ఆ… ఆ ఆ ఆ…

సంకీర్తన (1987)- ఆ ఆ ఆ… ఆ ఆ ఆ…

పల్లవి :
ఆ ఆ ఆ… ఆ ఆ ఆ…
వేవేల వర్ణాల ఈ నేల కావ్యాన
అలలు శిలలు తెలిపే కథలు
పలికే నాలో గీతాలై
వేవేల వర్ణాల ఈ నేల కావ్యాన
ఓ గంగమ్మో పొద్దెక్కిపోతోంది తొరగా రాయే
ఓ తల్లీ గోదారి తుళ్లి తుళ్లి పారేటి
పల్లె పల్లె పచ్చని పందిరి
పల్లె పల్లె పచ్చని పందిరి
నిండు నూరేళ్లు పండు ముత్తైవల్లె ఉండు
పంటలకేమి సందడీ
పంట పంటాలకేమి సందడి
తందైన తందతైన తందైన తందతైన
తందైన తందతైయ్యనా
తయ్య తందైన తందతైయ్యనా

చరణం :
వానవేలితోటి నేల వీణ మీటే
నీలినింగి పాటే వీచెనట
కాళిదాసులాంటి తోచరాసుకున్న
కమ్మనైన కవితలే ఈ పూలట
ప్రతికదలికలో నాట్యమే కాదా
ప్రతి ఋతువు ఒక చిత్రమే కాదా
ఎదకే కనులుంటే…
॥॥

చిత్రం : సంకీర్తన (1987)
రచన : సిరివెన్నెల
సంగీతం : ఇళయరాజా
గానం : ఎస్.పి.బాలు, బృందం

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top