You Are Here: Home » సినిమా » పాటలు » షాపింగ్‌మాల్ (2010)- నా ప్రాణం నువ్వైపోతే

షాపింగ్‌మాల్ (2010)- నా ప్రాణం నువ్వైపోతే

పల్లవి :
నా ప్రాణం నువ్వైపోతే
గుండెల్లో కోలాటం
నీతోటి బతకడానికే చేస్తున్న పోరాటం
నా పాటకు మాటై పలికావే… ఓ…
ఎద చప్పుడు చేసే శ్రుతి నీవే
ఎండల్లో వెన్నెల తెచ్చావే… ఓ…
నిప్పుల్లో వానై వచ్చావే
॥ప్రాణం॥

చరణం : 1
నీ పరువాన పూజల్లే కురిపించావే
నా మనసును దోచి
మాయలు చేసి మురిపించావే
నా మదిలోని భావనల అర్థం నువ్వే
బుగ్గల్లోన విరిసేటి సిగ్గైనావే
నా లోకం చీకటి కోన
నువ్వొస్తే వెన్నెల వాన
ప్రతిరేయి పున్నమి అనుకోనా
చెలియా చెలియా
ఓ…
॥ప్రాణం॥

చరణం : 2
నీతోడంటూ ఉండని నాడే
జగమే శూన్యం
నీ సింధూరం అవుతుంటే
నా జన్మే ధన్యం
నీ మురిపించే రాగం రేపే
మల్లెల మోహం
నా మదిలోన చిందెలు వేసే
అల్లరి దాహం
నీ జాడగ ఉంటే తప్ప
నా నీడకు అర్థం లేదే
అంతకంటే వర మే ఏలా
ప్రియా ప్రియా
॥ప్రాణం॥

చిత్రం : షాపింగ్‌మాల్ (2010)
రచన : వెన్నెలకంటి
సంగీతం : జి.వి.ప్రకాష్, విజయ్ ఆంథోని
గానం : హరిచరణ్, చిన్మయి

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top