You Are Here: Home » సినిమా » పాటలు » శ్రీరామరాజ్యం (2012)-దేవుళ్లే మెచ్చింది మీ ముందే జరిగింది

శ్రీరామరాజ్యం (2012)-దేవుళ్లే మెచ్చింది మీ ముందే జరిగింది

పల్లవి :
దేవుళ్లే మెచ్చింది మీ ముందే జరిగింది
వేదంలా నిలిచింది సీతారామకథ
వినుడీ ఇక వినుడీ ఆ మహిమే ఇక కనుడీ
మీ కోసం రాసింది మీ మంచి కోరింది
మీ ముందుకొచ్చింది సీతారామకథ
వినుడీ ఇక వినుడీ ఆ మహిమే ఇక కనుడీ
ఇంటింటా సుఖశాంతి ఒసగే నిధి
మనసంతా వెలిగించి నిలిపే నిధి
సరిదారిని జనులందరి నడిపే కథ ఇదియే
‘దేవుళ్లే’
చరణం : 1
అయోధ్యనేలే దశరథరాజు
అతని కులసతులు గుణవతులు మువ్వురు
పుత్రకామ యాగం చేసెను రాజే
రాణులు కౌసల్య సుమిత్ర కైకలతో
కలిగిరి వారికి శ్రీవరపుత్రులు
రామ లక్ష్మణ భరత శత్రుఘు్నలు
నలుగురు
రఘువంశమే వెలిగే
ఇల ముదమందిరి జనులే
‘దేవుళ్లే’
చరణం : 2
దశరథ భూపతి పసిరాముని ప్రేమలో
కాలమే మరిచెను కౌశికుడేతెంచెను
తన యాగము కాపాడగ
రాముని పంపాలని
మహిమాన్విత అస్త్రాలను ఉపదేశము చేసే
రాముడే ధీరుడై తాటకినే చంపే
యాగమే సఫలమై కౌశికముని పొంగే
జయరాముని గొని
ఆ ముని మిథిలాపురికేగే
శివధనువదిగో నవవధువిదిగో
రఘురాముని తేజం అభయం అదిగదిగో
సుందర వదనం చూసిన మధురం
నగుమోమున వెలిగే విజయం అదిగదిగో
ధనువును లేపే మోహన రూపం
ఫెళఫెళ ధ్వనిలో ప్రేమకి రూపం
పూమాలై కదిలే ఆ స్వయంవర వధువే
నీ నీడగా సాగునింక జానకి అని
సీతనొసగే జనకుడు శ్రీరామమూర్తికే
ఆ స్పర్శకి ఆలపించే అమృతరాగమే
రామాంకితమై హృదయం కలిగె సీతకే
శ్రీకరం మనోహరం
ఇది వీడని ప్రియబంధమని
ఆజానుబాహుని జతకూడే అవనిజాత
ఆనందరాగమే తానాయే గృహిణి సీత
‘దేవుళ్లే’

చిత్రం : శ్రీరామరాజ్యం (2012)
రచన : జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు
సంగీతం : ఇళయరాజా
గానం : కె.ఎస్.చిత్ర, శ్రేయా ఘోషల్

– నిర్వహణ : నాగేష్

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top