You Are Here: Home » సినిమా » పాటలు » శ్రీకృష్ణార్జునయుద్ధం (1963)- మనసు పరిమళించెనే తనువు పరవశించెనే

శ్రీకృష్ణార్జునయుద్ధం (1963)- మనసు పరిమళించెనే తనువు పరవశించెనే

పల్లవి :
మనసు పరిమళించెనే తనువు పరవశించెనే
నవ వసంత గానముతో నీవు నటన సేయగనే
మనసు పరిమళించెనే తనువు పరవశించెనే
నవ వసంత రాగముతో నీవు చెంత నిలువగనే

చరణం : 1
నీకు నాకు స్వాగతమనగా
కోయిలమ్మ కూయగా (2)
గలగలగల సెలయేరులలో
కలకలములు రేగగా

చరణం : 2
క్రొత్త పూల నెత్తావులతో మత్తుగాలి వీచగా (2)
భ్రమరమ్ములు గుములు గుములుగా
ఝుం ఝుమ్మని పాడగా

చరణం : 3
తెలి మబ్బులు కొండ కొనలపై
హంసల వలె ఆడగా (2)
రంగరంగ వైభవములతో
ప్రకృతి విందు సేయగా

చిత్రం : శ్రీకృష్ణార్జునయుద్ధం (1963)
రచన : పింగళి నాగేంద్రరావు
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు
గానం : ఘంటసాల, పి.సుశీల

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top