You Are Here: Home » యువ » ఫ్యాషన్ » ‘శుభం’డిజైనర్‌ వేర్‌

‘శుభం’డిజైనర్‌ వేర్‌

DSC_02280225సంప్రదాయ చీరలంటే ఇష్టపడే నగర మహిళల కోసం సరికొత్త కలెక్షన్స్‌ అందుబాటులోకి వస్తున్నాయి. చీరలో కనిపించడం అంటే నగర మగువలు ఎంతో మోజుపడతారు. ఇందుకోసం భాగ్యనగరంలోని డిజైనర్‌ షోరూమ్‌లలో ప్రత్యేకంగా డిజైనర్‌ చీరలు లభిస్తున్నాయి. ఈ తరుణంలో హైదరాబాద్‌ సోమాజిగుడలో ఉన్న శుభం స్టోర్‌ వనితల కోసం వెరైటీ కలెక్షన్స్‌ను అందిస్తోంది. స్టోర్‌ ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా హైదరాబాద్‌లో ప్రథమ వార్షికోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో సశేషం మూవీ ఫేమ్‌ నటీ నటులు వెంకట్‌, హర్ష, విశాల్‌ శేఖర్‌, సుప్రియలు సందడి చేశారు.

ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ ప్రణిత రెడ్డి, ఖలీల్‌ అహ్మద్‌లు మాట్లాడుతూ అందరికీ అందుబాటులో ఉండే ధరలతో తాము గత కొన్ని సంవత్సరాలుగా ఫ్యాషన్‌ కలెక్షన్స్‌ను అందిస్తున్నామని, మొదటి సంవత్సరం వేడుక సందర్భంగా ఫ్లాట్‌ 30 శాతం డిస్కౌంట్‌ ఇస్తున్నామని చెప్పారు. హీరోయిన్‌ సుప్రియ మాట్లాడుతూ పెళ్లిళ్లకు చీరలు ఎంతో అవసరమని, అందంలోనూ అన్ని రకాల చీరలు ఇక్కడ అందుబాటులో ఉండడం మగువలకు షాపింగ్‌ చేయడానికి ఎంతో సౌకర్యంగా ఉంటుదని అన్నారు. తనకు చీరలు అంటే ఇష్టమని, పండుగలకు, శుభ కార్యాలకు చీరలోనే కనిపిస్తానని చెప్పారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top