You Are Here: Home » చిన్నారి » కథలు » శిశిరం విడిచిన వసంతం

శిశిరం విడిచిన వసంతం

SUNDAY-STOREఒక నిర్ణయానికి ఒక జీవితం బాగుపడాలి. కాని, జీవితం అడ్డం తిరగకూడదు. ఏళ్ళ తరబడి పెనవేసుకునివున్న బంధాలు తెగిపోకూడదు. పరిచయం అయిన కొత్తలో అనుమానాలు లేని జీవితాలు కాలగమనంలో వ్యక్తిత్వాలు బయటపడి మనఃస్పర్ధలతో స్నేహానికి మచ్చ ఏర్పడేట్లు ప్రవర్తించడం వారి వారి మధ్య అగాధాలు సృష్టింపబడ్తాయి. ఒక్కోసారి వాటికి వాళ్ళు కారణం కాకపోవచ్చు. అయి నా, విధి ఆడుతున్న ఒక్కో వింత నాటకంలో మనఃస్పర్థలు, మనుసుల్ని విరిగిపోయోలాచేస్తాయి. వారిద్దరిమధ్య ‘స్నేహం’ వెర్రిమొహం వేస్తుంది. అదే యిది.

సౌమ్య పై ప్రజలు నాలుకలు లేకుండా వేస్తు న్న ‘అక్రమ’ ప్రశ్నలు. మూర్తి చెవిలో పడ్డా యి. అవి మార్మోగుతున్నాయి. కారణాన్వేషణకు తను ఏం చేయగలడు? భార్య లత, ఆమె స్నేహితురాలు సౌమ్యల మధ్య ఏర్పడ్డ అగాధం మూర్తిని నిలువునా వేధిస్తోంది. ఒకరకంగా కారణం తనేనేమో? మూర్తి స్నేహానికి ప్రాణమీయగల త్యాగశీలుడు. సంస్కృతీ, సంప్రదాయాలపై వల్ల మాలిన ప్రేమ. లత, సౌమ్యల మధ్య సమస్య ముదురుతోంది. కా దు, కాదు ముదిరిపాకానపడింది. వాళ్ళిద్దర్నీ ఈ సమస్యలోంచి తనే బయటకు తీయాలి. కాని, అన్ని ధారులూ మూసుకుపోతున్నట్లు భయపడ్తున్నాడు మూర్తి.
సౌమ్య వ్యక్తిత్వం పై వస్తున్న అపోహలపై నిజ నిర్ధారణ కోసం తను సమిధవ్వాలని భార్య లతకు తెలియకుండానే సౌమ్యపై నిందారోపణలకోసం నేరుగా తనే పాజిటివ్‌గా యాక్ట్‌ అయ్యాడు. అంటే ఇక్కడ సౌమ్య, మూర్తికీ స్నేహితురాలే. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఒకటిరెండు ప్రయోగాల్లాంటివి సౌమ్యపై పురికొల్పాడు. తను ఒక స్థిరమైన మనస్తత్వం కలది కాబట్టి మూర్తిని మిత్రునిగానే చూసింది. మూర్తి ఇలా ఎన్ని చేస్తున్నా

గ్రహిస్తూనే తనూ మామూలుగానే ప్రతిస్పందించింది. సౌమ్యపై వస్తున్న అవాకులు శబ్ధాలు తగ్గాలంటే ఇంకా కఠినమైన నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు మూర్తి. దాని వెనుక ఆశయం ఒక్కటే… సౌమ్యని పాలలా చూపించాలి జనానికి. నిప్పులేనిదే పొగరాదు. కానీ, ఆ పొగకి కారణం మనం కాదని తెలిసాకా మన మనస్సు ఎంత హాయి గా వుంటుందో వర్ణనాతీతం. సౌమ్యకోసం మూర్తి చేస్తున్న నిజనిర్ధారణా ప్రయోగాల్లో భార్య ముందు దోషి అవుతానని తనెప్పుడూ భావించలేదు. ఈ పరిణామ క్రమాల్లో సౌమ్యని, మూర్తిని లత అపార్థం చేసుకున్నందుకే వారిద్దరి మధ్య ఈ అగాధం. అసలు నిజంగా మూర్తికి సౌమ్యపై స్నేహ భావము తప్ప, ఏ విధమైన అనాగరిక ఆలోచనాలేదు. సౌమ్య గురించి లోకం కాకులు కూతల్లా కూస్తుంటే… తన మనసు ఆకాశంలో ఉరుముల్లా… దద్దరిల్లుతోంది. తట్టుకోలేక జీవితానికి సరిపడా, నిందైనా తనమీద వేసుకుని భార్యలత, సౌమ్యల మధ్య ఏర్పడ్డ అగాధాన్ని పూడ్చాలని వందశాతం నిమగ్నమైన క్షణంలో తన ప్రయోగానికి వాడిన లేఖ లత కంటపడింది.

లత మానసిక వేదనని ఎవరు అర్థం చేసుకోగలరు. నిజమే. మనమైనా అంతే, తేరుకోలేం. ఆ క్షణాలు బలంగా లత గుండెల్లో దిగబడి చిందరవందర చేస్తున్నది. ఇప్పడు తెలిసికూడా మూర్తి లతకు ఏం చెప్పగలడు? అడ కత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్నాడు మూర్తి. లతకు మాత్రం భర్తపై ఏదోమూల నమ్మకమున్నా… ఈ పరిణామ క్రమం గుం డెని మండిస్తోంది. ఈ స్థితిలో మూర్తి లతకు అసలు విషయం చెప్పాలన్నా ధైర్యం చాలడం లేదు. ఎందుకంటే ఆ లేఖ సౌమ్య వ్యక్తిత్వాన్ని జనానికి జవాబు దారిగా వదిలిన అస్త్రం. అందుకే మూర్తి ఎంతటి బాధనైనా భరిస్తున్నాడు. తన గుండె గదిలో లతకు తప్ప మరొకరికి స్థానం లేనప్పుడు. అదిబాధగా వున్నా తనకు తానే జవాబుదారుడవుతున్నాడు, అవ్వాలి కూడా తప్పదు. అతని మానసిక సంఘర్షణకు తానే బాధ్యుడు, బాధితుడూను. కాలం తనకు వేయి నిట్టూర్పులు, ఒక స్వేచ్చా వాయువుల నిష్పత్తితో గడుస్తోంది. ఆ ఒక్క స్వేచ్చా వాయువు తన వ్యక్తిత్వాన్ని నిగ్గుతేల్చుకోమని ధైర్యమిస్తోంది మూర్తికి.

సౌమ్య, లతల స్నేహ అగాధాన్ని పూడ్చడానికి, నిర్ణయం మరపురానిదిగా వుండాలని నిర్ణయించుకున్నాడు మూర్తి. ‘ఎందుకిలా’ చేసారని లత మూర్తిని ప్రశ్నించలేదు. తనే అంతస్సంఘర్షణకు, గురి అవుతూ సౌమ్యతో తన స్నేహన్ని ఎడబార్చుకుంది. భర్తపై లతకు పూర్తి అపనమ్మకం లేకపోయినా అడగలేక పోతోంది. మూర్తి ఇంతటి మానసిక ఆందోళనని భరించలేక ఒకసారి ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన వచ్చింది. కాని, ఏ పాపం చేయని భార్య లత, పిల్లలు, తల్లితండ్రుల్ని బాధపెట్టడం, పైగా అతని వ్యక్తిత్వానికి విరుద్ధమైన ఆలోచన. ఆ ఆలోచనకు తనకుతానే ఛీదరించుకున్నాడు. తెలివైన నిర్ణయం తీసుకోకపోతే చరిత్రలో తప్పు చేసిన వాడఅవుతాడు, నీతికి, నిజాయితీకి, మంచికీ, మానవత్వానికీ పేరైనమూర్తి జీవితంలో అలాంటి ఆలోచన మరెప్పుడూ రాకూడదని నిర్ణయించుకున్నాడు మూర్తి… విరమించుకోవాలి కూడా.

ఓ రోజు హన్మకొండ కూమార్‌పల్లిలో వున్న తన మిత్రుడు ప్రేమ్‌కుమార్‌ సహా తీసుకుని, వేయిస్థంభాల గుడిలో నంది ప్రక్కనకూర్చుని రేపు ఆ లేఖ సారాంశాన్ని లతకు చెప్పి తన మనసులో విషయం చెప్పాలని నిర్ణయించుకుని తేలిక పడుతున్న మనసుతో ‘గిర్నిబావి’ వరకూ బస్సులో వెళ్ళి ‘నల్లబెల్లి’ నడుచుకుంటూ ఇల్లు చేరాడు మూర్తి. గుమ్మంలో లత మూర్తి కోసం ఎదురు చూ స్తోంది. లతకి భర్తపై కోపం వుంది కానీ, ప్రే మ, మమకారం పోలేదు. గుమ్మంలో వున్న లతతో మూర్తి ‘రేపు భద్రకాళీ గుడికి వెళదాం’ అంటూ లోపలికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి ని ద్ర పట్టీపట్టనట్లుగానే వుంది లత, మూర్తిలకు.

ఈ రోజు కొత్తగాలి పీలుస్తానన్న ఆలోచనతో మంచం దిగి తయారయ్యాడు మూర్తి. లత పిల్లల్ని రెడీ చేసింది. ఆటోలో భద్రకాళి గుడికి చేరుకుని అమ్మవారి నిదర్శనం చేసుకుని. గుడికి ఎదురుగావున్న చెరువుగట్టు చేపచెట్టు క్రింద కూర్చున్నారు. లత, ముభావంగానేవుంది పిల్లలకి ప్రసాదం పెట్టింది. వాళ్ళు తింటున్నారు. ఇద్దరి మనస్సుల్లోనూ అసలు విషయం తేల్చుకోవాలని. దానికి ఇదేసరి అయిన వేదికని నిర్ణయించుకున్నారు. లతే ఒకడుగు ముందుకేసి లేఖని తీసి ‘‘ఏంటిది?’’ అంది మూర్తికి కావల్సింది కూడా అదే. ‘లత ప్రశ్నించాలి, తను సమాధానం చెప్పాలి’ కాదు కాదు నిజం చెప్పాలి’ అని ఎదురుచూస్తున్నాడు. ‘‘ఎందుకు రాశారీ ప్రేమలేఖ’’ కాస్తబాధతో నిండిన కోపంతో ప్రశ్నించింది లత మూర్తిని. ‘‘లత దేవుడిని నమ్ముతావుగా?!’’ మూర్తి అంటూంటే ‘‘అవును’’ అంది లత. ‘‘మరి నన్ను’’ మూర్తి ప్రశ్నకు లత మౌనంగానే వుంది.

‘‘అంటే నమ్మవా?’’ మూర్తి లతవైపు చూశాడు. ‘‘నా వ్యక్తిత్వానికి విలువ నివ్వవా’’ ఎండిన గొంతుతో మూర్తి ప్రశ్న. లత నిట్టూర్చింది. ‘‘దైవం మీద ప్రమాణం చేస్తారా?!’’ చాందసురాలు కాబట్టి అడిగింది లత. నిజంగా తను సిద్ధంగా వున్నాడు కాబట్టి చెప్పాడు. లత మనసు తేలికపడింది. భర్తపై నమ్మకం రెట్టింపైంది లతకు తనెప్పటికీ తప్పుచేయడని తెలుసు. విధిరాతని దేవుడే లిఖిస్తాడు కాబట్టి భర్తదేవుడి పై చేసిన ప్రమాణం తనని మామూలు మనిషిని చేసింది. ‘‘మరెందుకలా?’’ అడిగింది లత ‘‘లోకం పోకడలో మీ స్నేహంపై దుష్ట కన్నుపడింది. అందుకే సౌమ్యపై అవాక్కులు నిజం కాదని, గిట్టని వా ళ్ళు వేస్తున్న నింద నిజ నిర్థారణలో తను గెలిచింది. ఇప్పుడు సమాజం సౌమ్య వ్యక్తిత్వంపై వేసిన అపవాదులు నిజంకాదని నిరూపించేం దుకు మనం సౌమ్యకి సపోర్ట్‌ అవ్వాలి’’.

చెప్పుకుపోతున్న మూర్తి భుజంపై చేయివేసింది లత. ‘‘ఇక నువ్వు నీ స్నేహాన్ని గెలిపించాలి’’ మూర్తి అనునయించాడు లతని. పరస్పర సంభాషణలు అనంతరం తేలిక పడిన మనస్సులతో తిరిగి ప్రయాణమవుతూ భధ్రకాళి గుడి వైపు చూస్తూ… ఆ అమ్మ వారిని స్పరిం చుకుంటూ… లత చేతిలో ఫోను సౌమ్య నంబరుకి డైల్‌ చేసింది. సౌమ్యకి మూర్తి ముందుగానే ఈ విషయం చెప్పాడు కాబట్టి లత ఫోన్‌ కాల్‌ని ఆనందంగా గుండెలకు హద్దుకుని రిసీవ్‌ చేసుకుంది సౌమ్య. మూర్తి తప్పు చేయలేదు కాబట్టి గడిచింది భారమైనా… తన అడుగులు ఆనందంగా తేలికగా ముందుకెళుతున్నాయి. వాళ్ళిద్దరి స్నేహం ‘శిశిరం విడిచిన వసంతం’లా మారినందుకు ఆనందిస్తూ బస్సెక్కాడు లతా పిల్లలతో మూర్తి.

– కొత్తపల్లి మణీత్రినాథరాజు,
మోగల్లు, ప గో జిల్లా.
సెల్‌: 9494708475

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top