You Are Here: Home » ఇతర » శాలువా దొంగలు

శాలువా దొంగలు

ఇద్దరు వ్యక్తులు శాలువాలు కొందామని ఒక వర్తకుడి దుకాణానికి వెళ్ళారు. వర్తకుడు కొంచెం యేమరిచి పక్కకి చూశాడు. మళ్ళీ తిరిగి వస్తువులకేసి చూసేటప్పటికి ఒక శాలువా లేదు. అతను ఆ ఇద్దర్నీ అపాడు.
మీలో ఎవరో ఒక శాలువాని కొట్టేశారు అన్నాడు.
ఒకడు నేనేం తీయలేదు అని ఒట్టు పెట్టుకుని మరీ చెప్పాడు. నా దగ్గర లేదని రెండోవాడు చెప్పాడు.
అయితే మీ ఇద్దరు దొంగలే అన్నాడు వర్తకుడు.
ఒడు శాలువా కాజేసి రెండోవాడికి ఇచ్చాడని అతను ఊహించాడు. తను శాలువా తీయలేదు అన్నవాడి వద్ద వెతికాడు. అతని దగ్గర శాలువా ఉంది. వర్తకుడు ఇద్దర్నీ న్యాయాధికారి దగ్గరికి తీసుకువెళ్ళాడు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top