You Are Here: Home » ఇతర » శాంతి క్రిడలపై ఉగ్రవాదం పడగనీడక్ షణంక్షణం..భయం..భయం

శాంతి క్రిడలపై ఉగ్రవాదం పడగనీడక్ షణంక్షణం..భయం..భయం

ప్రపంచ దేశాల మధ్య, క్రీడాకారుల మధ్య స్నేహబంధాన్ని పెంచేందుకు రూపుదిద్దుకున్న ఒలింపిక్‌ క్రీడలపై నేడు ఉగ్రవాదం తన పంజా విసురుతోంది. నిజానికి ఈ విధంగా ఆటలపై ఉగ్రవాదం దాడి చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో మ్యూనిచ్‌ ఒలింపిక్స్‌ సందర్భంగా జరిగిన బీభత్సపు రక్తపు మరకల తడి ఇంకా ఆరలేదు. ఆ జ్ఞాపకాలు నేటికీ ప్రపంచాన్ని వెంటాడుతూనే ఉన్నారుు. అమెరికా, పాశ్చాత్యదేశాల్లో దాడుల్లో బాగా దెబ్బ తిన్న ఆల్‌ఖైదా తదితర ఉగ్రవాద సంస్థలు తాజాగా లండన్‌ ఒలింపిక్స్‌ పై కన్నేశారుు. ఒలింపిక్స్‌ ఆరంభ సమయం సమీపిస్తున్న కొద్దీ లండన్‌లో క్షణం క్షణం భయం భయంగా మారింది. నగరంలోనే కాదు…బ్రిటన్‌లో, ప్రపంంచంలో ఏ మూలన ఏం జరుగుతుం దోనన్న భయాందోళనలు నెలకొంటున్నారుు. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్‌ పై ఉగ్రవాదం పడగనీడపై కలర్స్‌ ప్రత్యేక కథనం…

ఉగ్రవాదం నేర్పిన పాఠాల నేపథ్యంలో ఏ చిన్న సం ఘటనకైనా అతిగా స్పందించడం పాశ్చాత్యదేశాల నిఘా, భద్రతా సంస్థలకు అలవాటైపోయింది. ఇదిగో తోక అని అవి అనగానే అదిగో పులి అని మీడియా ప్రచారం చేయడం ఎక్కువెైపోయింది. అదెలా ఉన్నా మితి మీరిన భద్రతా ఏర్పాట్లు తమకు ఇబ్బందిగా పరిణమించాయని స్థానికులు మండిిపడుతున్నారు.

ugravadamశాంతి సామరస్యాల మధ్య కొనసాగాల్సిన ఒలింపిక్‌ క్రీడలు నేడు ఉగ్రవాదం పడగనీ డన జరుగుతున్నాయి. లండన్‌లో ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఉగ్రవాదులు ఏ రూపంలో ఎక్కడ దాడి చేస్తారో తెలియదు. కనిపిం చని శత్రువులో ఒళ్ళంతా కళ్ళు చేసుకొని పోరాడా ల్సిన పరిస్థితి. ఆకాశం, నేల, నీరు…ఎక్కడి నుంచి ఉగ్రవాదులు దూసుకొస్తారో తెలియదు. ఎక్కడ బాం బు పేలుతుందో అర్థం కాదు. ఎక్కడ విషవాయువు వెలువడుతుందో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒలింపిక్స్‌ను ప్రశాంతంగా నిర్వహించేందుకు బ్రిటన్‌ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.

ఇదిగో తోక…అదిగో పులి
Terror-(3)ఉగ్రవాదం నేర్పిన పాఠాల నేపథ్యంలో ఏ చిన్న సం ఘటనకైనా అతిగా స్పందించడం పాశ్చాత్యదేశాల నిఘా, భద్రతా సంస్థలకు అలవాటైపోయింది. ఇదిగో తోక అని అవి అన గానే అదిగో పులి అని మీడియా ప్రచారం చేయడం ఎక్కువెైపోయింది. అదెలా ఉన్నా మితి మీరిన భద్రతా ఏర్పాట్లు తమకు ఇబ్బందిగా పరిణమించాయని స్థానికులు మండిిపడుతున్నారు. ఎక్కడ చూసినా పోలీసులు, భద్రతా సిబ్బంది, ఇళ్ళపెై క్షిపణులు …ఇలా లండన్‌ నగరం యావత్తు యుద్ధరంగాన్ని తలపించేదిగా మారిపోయింది.

స్వయం కృతాపరాధం
Terror-(4)వివిధ దేశాలపెై తమ ఒత్తిడి పెంచేందుకు వీలుగా ఆయా దేశాల అసమ్మతివాదులకు అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ తదితర దేశాలు ఆశ్రయం ఇవ్వడం ఆనవాయి తీగా మారిపోయింది. ఒకప్పుడు ఎల్టీటీఈ కూడా ఈ విధమైన మద్దతును పొందింది. పాకిస్తాన్‌ అసమ్మతి వాదులు కూడా లండన్‌ను తమ కార్యకలాపాలకు కేం ద్రంగా చేసుకున్నారు. కాశ్మీరీ ఉగ్రవాదులకు లండన్‌ సురక్షిత స్థావరమైపోయింది. ఇలా పలు రకాలుగా ఉగ్రవాదంతో సంబంధం ఉన్నవారికి లండన్‌ స్వర్గధా మంగా మారిపోయింది. ఇప్పుడు అదే బ్రిటన్‌కు ప్రా ణాల మీదకు తీసుకువచ్చింది. ఇలా ఆశ్రయం ఇవ్వ డంలో మంచి చెడులు ఎలా ఉన్నా కూడా, ఆయా సం స్థల మధ్య పెరిగిపోయిన నెట్‌వర్క్‌ భారీస్థాయిలో ఉగ్ర వాదదాడులకు ఆస్కారం కలిగించేదిలా మారి పోయింది.

పాకిస్తాన్‌ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా అనుబంధ సంస్థగా పనిచేస్తున్న ఇండియన్‌ ముజాహిదీన్‌పెై నిషేధం విధిస్తున్నట్లు బ్రిటన్‌ ప్రభుత్వం ప్రకటిం చింది. భారత్‌లోని బ్రిటన్‌ జాతీయులకు ఇండియన్‌ ముజాహిదీన్‌ల నుండి ముప్పు వున్నట్లు నిఘా వర్గా లు సమాచార మందించడంతో ఈ నిర్ణయం తీసుకు న్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో భారత్‌లోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

నిఘా సంస్థల హెచ్చరిక
ugravada1ప్రతిష్టాత్మక లండన్‌ ఒలింపిక్స్‌ ఉగ్రవాద ముప్పు పొంచివున్నట్లు నిఘా సంస్థలు హెచ్చ రిస్తున్నాయి. ఒలింపిక్‌ క్రీడల నేపథ్యంలో లండన్‌ నగరంలో ఉగ్ర వాద గ్రూపుల సంచారం పెరిగిందని, క్రీడల నిర్వహ ణకు వీరితో ఎటువంటి ముప్పు లేదని, ఉగ్రవాద దాడులు జరిగే అవకాశాలు మాత్రం కన్పిస్తున్నాయని హెచ్చరించాయి. దీంతో బ్రిటన్‌ అప్రమత్తచర్యలను ప్రారంభించింది. ఉగ్రవాద హెచ్చరికల నేపథ్యంలోనే గురువారం వెస్ట్‌ మిడ్లాండ్‌లోని ఎం6 జాతీయ రహ దారిపెై వీఫోర్డ్‌ టోల్‌ ప్లాజా వద్ద ఓ బస్సులో మంటలు ఎగసిపడ్డాయి. దీనిని ఉగ్రవాద చర్యగా భావించిన భద్రతా దళాలు ఆ రహదారిపెై రాకపోకలను పూర్తిగా నిషేధించి బస్సును స్వాధీనంలోకి తీసుకున్నాయి.

బ్రిటన్‌ సాయుధ పోలీసులు గురువారం ఉదయం లండన్‌ ఒలింపిక్‌ పార్క్‌ సమీపంలోని ఇళ్లపెై దాడులు చేశారు. ఆరుగురు అనుమానితులను అరెస్టు చేశారు. వీరిలో ముగ్గురిని స్ట్రాట్‌ఫోర్డ్‌ వద్ద, మరో ముగ్గురిని ఒలింపిక్‌ పార్క్‌ సమీపంలోని నెైబర్‌హుడ్‌ వద్ద అరెస్ట్‌ చేశారు. వారిని లండన్‌లోని ఓ పోలీస్‌ స్టేషన్‌కు తరలించించారు. అరెస్టయిన వారికి ఒలిం పిక్‌ క్రీడలతో ఎటువంటి సంబంధమూ స్కాట్లండ్‌ యార్డ్‌ పోలీసులు చెప్పారు. 18-30 ఏళ్ల మధ్య వయసున్న వీరిని ఇంకా గుర్తించలేదని తెలిపారు.

అరెస్టయిన వారంతా బ్రిటిష్‌ ముస్లింలేనని మిజానుర్‌ రెహ్మాన్‌ అనే ముస్లిం కార్యకర్త తెలిపారు. ఒలింపిక్‌ పార్క్‌కు సమీపంలోని అబ్బేరోడ్‌లో వున్న ఒక నివా సంపెై భద్రతా దళాలు దాడులు నిర్వహించినట్లు స్థాని కులు తెలిపారు. దీంతో పాటు వేర్వేరు ప్రాంతాల్లో పలు నివాసాలపెై పోలీసులు ఒకేసారి గాలింపుచర్యల ను కొనసాగిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఇండియన్‌ ముజాహిదీన్‌పెై నిషేధం
పాకిస్తాన్‌ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా అనుబంధ సంస్థగా పనిచేస్తున్న ఇండియన్‌ ముజాహిదీన్‌పెై నిషేధం విధిస్తున్నట్లు బ్రిటన్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత్‌లోని తమ పౌరులు అప్రమత్తం గా ఉండాలని హెచ్చరించింది. ఇండియన్‌ ముజాహి దీన్‌ సంస్థపెై నిషేధం విధించే తీర్మానాన్ని బ్రిటన్‌ ఎంపీ లు ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో బ్రిటన్‌లో నిషేధిత ఉగ్రవాద సంస్థల సంఖ్య 47కు చేరింది.

వివిధ దేశాలపెై తమ ఒత్తిడి పెంచేందుకు వీలుగా ఆయా దేశాల అసమ్మతివాదులకు అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ తదితర దేశాలు ఆశ్రయం ఇవ్వడం ఆనవాయితీగా మారిపోయింది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top