You Are Here: Home » చిన్నారి » కవితలు » శరదాగమన వేళ

శరదాగమన వేళ

శరత్కాలం
ఈ చెట్లన్నింటిని ఆక్రమించేసింది
వాటి వలువలన్నింటినీ ఊడ్చి చండ్ర నలుపు చర్మాన్ని
రట్టు చేసి రవ్వ చేసింది

చెట్ల గుండెల్ని ఊపేసి పసుపు పచ్చకు తిప్పి
ఆకులన్నింటినీ దులిపి పారేసింది

నేల రాలిన వాటిని, పాపం
ఎవరు తొక్కినా పొడి పొడే.
ఏ ఒక్క కన్నీటి చుక్కా రాలదు
ఏ కలకబారిన గుండే గొంతెత్తదు

ఎన్నో కలలు కన్న పులుగు తతులు
వాటి పాటనుండి బహిష్కృతమైనయ్‌
ప్రతి స్వరం గొంతు మధ్యనే
చిరిగి పేలికలైంది, చితికింది
వేటగాడు అమ్ము ఎక్కు పెట్టక ముందే
అవి ధూళి పాలైనయ్‌.

ఓ ప్రభూ దయచూపు
నీ పునః సృజన శక్తిని ప్రదర్శించు
శిథిలమైన రక్త నాళాలలో
తిరిగి నెత్తురు ప్రవహింపజేయి
ఎండిన ఈ మోడుల కోసం
వృక్షాలనే ఆకు పచ్చ వరాల్ని మళ్ళీ ఇవ్వు
తిరిగి ఈ పులుగులన్నీ
ఒక పాట పాడనీ….
(ఫైజ్‌ అహమ్మద్‌ ఫైజ్‌ కవిత
ఠీజ్చి ్చఠ్టఠఝ ఛ్చిఝ్ఛ కు అను సృజనం)

Other News From

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top