You Are Here: Home » దైవత్వం » వ్రత నియమం

వ్రత నియమం

”చిరుతొండనంబి వీరశైవాచార సంపన్నుడు. అతడి సహధర్మచారిణి ”తిరువెంగనాంబి, పుత్రుడు ”సిరియాళుడు. వీరు కాంచీపురంలో నివసిస్తూ జంగములు ఏది అడిగినా సమకూర్చాలనే నియమాన్ని పాటిస్తూ ఉండేవారు. ఒకసారి పార్వతీదేవి ఆ భక్తుడిని పరీక్షించమని శివ్ఞడిని కోరిందట. శివ్ఞడు అలాగే కానీ అంటూ ఇంద్రుడిని పిలిచి, కాంచీపురంలో ఇరవై ఒక్కరోజుల పాటు వర్షాలు కురిపించమని ఆదేశించగా అతడు ఆవిధంగానే చేశాడట. జంగములకు భోజనం పెట్టిగాని భుజించడు చిరుతొండనంబి.  ఆ నిమయాన్ని అనుసరిస్తూ, జంగములకోసం వెతుకుతూ వెళ్తుంటాడు. ఇంతలో శివపార్వతులు వృద్ధ దంపతులుగా కనిపించి, వారం రోజులుగా నిరాహారదీక్ష వ్రతం చేస్తున్నామని దాని ఉద్యాపనగా ”నరమాంసంతో భోజనం పెడితే వస్తామని అంటారు. ఆ నరుడు, ‘బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులలో ఎవరో ఒకరై అందగాడై, ఆరోగ్యవంతుడై ఉండాలని పైగా అతడి తల్లిదండ్రులే వండి వడ్డించాలని అంటారు. ఇంకా విశేషం ఏమిటంటే, ఆ తల్లితండ్రులు కూడా తమతో పాటుగా ఆ భోజనాన్ని తినాలని అంటారు. మేం ఇక్కడే ఉంటాం. నీ భార్య యిష్టాన్ని కూడా కనుక్కొని రా. అప్పుడు వస్తాం అంటారు. ఇంటికి వెళ్లి అడుగగా మన శరీరాలు ఆ పరమేశ్వర ప్రసాదాలే కదా? వారివి వారికి సమర్పించడానికి అనుమానం ఎందుకు? జంగములు సాక్షాత్తూ ఆ పరమేశ్వర స్వరూపాలే కదా? అంది. వెంటనే వెళ్లి ఆ వృద్ధ దంపతులను తీసుకొని వస్తాడు చిరుతొండనంబి.
”సిరియాళుడు గురువ్ఞ గారింట చదువ్ఞకుంటూ ఉండగా శివ్ఞడు వెళ్లి, నువ్ఞ్వ ఇక్కడి నుండి తప్పించు కొని వెళ్లు అన్నాడు. ఏం ఎందుకని? అని అడిగాడు సిరియాళుడు. నీ తండ్రి నిన్ను జంగములకు ఆహారంగా సమర్పిద్దామనుకుంటున్నాడు. కాబట్టి ఎక్కడి కైనా పారిపో. చిన్నపిల్లాడివని జాలితో చెప్తున్నా విను అన్నాడు. శివశివా! ఒకరికి ఉపయోగపడేందుకు అవకాశం వచ్చినందుకు సంతోషించాలి గాని, తప్పించుకోమంటావా? అని ప్రశ్నించిన బాలుడిని విడిచి వెళ్లిపోయాడు శివ్ఞడు. మేనమామలు, మేనత్తలు కూడా చెప్పి చూసారు కాని అతడి మనసును మార్చలేకపోయారు. చివరికి పార్వతీదేవి కూడా బాలింతరాలి వేషంలో వెళ్లి పాలకోసం వచ్చినట్లు నటిస్తూ, ఎవరూ లేకుండా చూసి, మనసు మార్చడానికి ప్రయత్నించగా, శివ్ఞనికి శివయోగికి భేదం లేదని తేల్చి చెప్పేశారు.
గురువ్ఞ గారింటి నుండి సిరియాళుడిని తీసుకొని వచ్చారు. అతడికి నలుగుపెట్టి, స్నానం చేయించి కస్తూరి, చందనం వగైరాలు రాసి, కాటుక పెట్టి నొసట విభూదితో త్రిపుండాలను పెట్టి నిన్ను పాశుపతవ్రత దీక్షా విధానంలో ఒక శివయోగికి వండి వడ్డించబోతున్నాం అన్నారు. నాకు ఏమాత్రం సంసారం పై వ్యామోహం లేదు. సంతోషంగా ఆహారమవ్ఞతాను అన్నాడు. మీరు విచారించవద్దు. సంకోచించవద్దు అని ప్రార్థించాడు సిరియాళుడు. సిరియాళుని తల ఒక్క కత్తివేటుతో తెగిపడింది. ఆశ్చర్యంగా ఆ తలమాత్రం పంచాక్షరిని జపిస్తూనే ఉంది. సరే వండి వడ్డించారు. శివయోగి ఆ ఆహారాన్ని పరీక్షించి చూసి శరీరంలో శిరస్సే ముఖ్యమైనది కదా? దాన్ని వడ్డించకపోతే మేం ఎలా భోంచేస్తాం? మాకు వ్రతభంగం కాదా? అని లేచి వెళ్లబోయేరు. క్షమించమని ప్రార్థించి, వారిని కూర్చుండ బెట్టి తలను కూడా వండి వడ్డించారు దంపతులు. మీకు ముందే చెప్పాం కదా? మాతో పాటూ మీరు భోంచేయాలని? మీ కుమారుడిని కూడా పిలిచి మాతో పాటు భోజనం చెయ్యండి అన్నారు ఆ జంగములు. ఎక్కడికి వెళ్లాడో మీరు భుజించండి అంటూ నాలుగువైపులా తిరుగుతూ మీ పిల్లవాడిని గొంతెత్తి పిలవండి వస్తాడు అన్నారు. ఇంక విధిలేక వారి మాట తీసెయ్యలేక అలాగే చేశారు దంపతులు. వడ్డించిన విస్తళ్లలో నుండి లేచి వచ్చేశాడు సిరియాళుడు. పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై గత జన్మలో నీవ్ఞ తుంబురుడివి, సిరియాళుడు కుమారస్వామి, నీ భార్య తిరువేంగనాంబి గంధర్వ కన్య. కారాణాంతరాల వల్ల మీరు మానవజన్మలు ఎత్తవలసి వచ్చింది. మీ భక్తికి, వ్రత నియమాలకు ఎంతో సంతోషించాం. మీరు మళ్లీ మీ పూర్వస్థానాల్లో ఉంటూ మమ్మల్ని సేవిస్తూ ఉండండి అని వరాన్ని అనుగ్రహించాడు శివ్ఞడు. భక్తితో సాధ్యం కానిది ఏదీలేదు అని నిరూపించాడు పిల్లవాడైన సిరియాళుడు.

– ఎస్‌. చంద్రామణి

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top