You Are Here: Home » చిన్నారి » వ్యాక్సిన్ ఎందుకు ఇస్తారు?

వ్యాక్సిన్ ఎందుకు ఇస్తారు?

అనేక రకాల అనారోగ్యాల నుంచి రక్షించడానికి చిన్నప్పుడే రకరకాల వ్యాక్సిన్లు ఇస్తారు. వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా జీవితంలో ఎప్పటికీ ఆ జబ్బు రాకుండా అడ్డుకట్ట వేసినట్లవుతుంది. వ్యాక్సిన్ ఎలా పని చేస్తుందంటే… ఒక వైరస్‌కు సంబంధించిన యాంటీబాడీలు శరీరంలో ఉత్పత్తి అయ్యేలా చూస్తారు. దాంతో మున్ముందు ఎప్పుడైనా ఆ వైరస్ సోకితే అప్పటికే తయారైన యాంటీ బాడీస్ శరీరానికి రక్షణగా నిలుస్తాయన్నమాట.

వ్యాక్సిన్ అంటే ఏ జబ్బు రాకుండా వ్యాక్సిన్ వేస్తున్నామో ఆ జబ్బుకు సంబంధించిన మృతకణం లేదా నీర్వీర్యం చేసిన కణం అన్నమాట. ఆ వ్యాధికారకాన్నే అతి స్వల్ప మోతాదులో ఇస్తారు. దాన్ని శరీరంలోకి ప్రవేశపెట్టడం వల్ల, శరీరం అవసరమైన స్థాయిలో రక్షణకు సిద్ధమవుతుంది. ఫలితంగా జబ్బును తరిమివేసే స్థాయికి రోగనిరోధక శక్తిని పెంచుకుంటుంది. ఇలా రోగనిరోధక శక్తిని కల్పించ డానికే వ్యాక్సిన్ వేస్తారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top