You Are Here: Home » ఇతర » వ్యక్తిత్వం విభిన్నం

వ్యక్తిత్వం విభిన్నం

ఒకరు దౌత్యాధికారిగా స్నేహ హస్తం చాపితే…. మరొకరు దేశ రక్షణ కోసం తుపాకీ పట్టి సేవలందించారు. ఒకరి మనస్తత్వం ప్రశాతం అరుుతే… మరొకరిది చేతలోనో….రాతలోనో వివాదాస్పదం. ఈ విభిన్న వ్యక్తిత్వాలు పోటీకి దిగారుు. ఒకరికి అధికార యూపీఏ మద్దతునిస్తే. … మరొకరికి బిజెపి పంతం పట్టి పోటీకి నిలబెట్టింది. వారే…. ఉప రాష్ర్టపతి పదవికి పోటీలో ఉన్న హమీద్‌ అన్సారీ…., జశ్వంత్‌ సింగ్‌లు. యూపీఏ బలపరచిన అన్సారీేక ఉపరాష్ర్టపతి పట్టం దాదాపు ఖరారు అరుు్యంది. 780 మంది ఎంపీల ఎలకో్టరల్‌ కాలేజీలో అన్సారీేక ఎక్కువ మంది ఎంపీలు మెుగ్గుచూపుతున్నారు. ఆగష్టూ 7న జరిగే ఈ ఎన్నిక నామమాత్రమే.

13వ ఉపరాష్ర్టపతి ఎన్నిక దాదాపు ఖరారెైయ్యింది. యూపిఏ కూటమి మద్దతుతో హామీద్‌ అన్సారీ వెైస్‌ ప్రెసిడెంట్‌ స్థానానికి పోటీ పడుతుంటే… ప్రతిష్టాత్మకమైన లోక్‌పాల్‌ బిల్లు విషయంలో రాజ్యసభ చెైర్మన్‌గా అన్సారీ వ్యవహరించిన తీరు ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థనీయ కాదంటూ.. బిజేపి మిత్రపక్షాలు నిర్థారణకు వచ్చాయి. ఎలక్టోరల్‌ కాలేజీలో ఓటింగ్‌ బలం లేకపోయినా… కేవలం తమ అభ్యర్థిగా జస్వంత్‌ సింగ్‌ను పోటీలోకి దింపాయి. ఇక ఈ దిగువసభను ఏలే అధ్యక్షుల వివరాలు ఓసారి చూద్దాం.
ప్రొఫైల్

పూర్తిపేరు		: మొహమ్మద్‌ హమీద్‌ అజీజ్‌ అన్సారీ
పూట్టిన తేదీ : 01-04-1937
జన్మస్థలం : కోల్‌కతా
కుటుంబం : భార్య సల్మాఅన్సారీ
పిల్లలు : ఇద్దరు కుమారులు,
ఒక కమార్తె
ఇష్టమైన ఆటలు : గోల్ఫ్‌ , క్రికెట్‌.
విద్యార్హత : బీఏ (ఆనర్స్‌), ఎంఏ
(రాజనీతిశాస్త్రం)
అవార్డులు : పద్మశ్రీ (1984)

Untitlయూపీఏ ఉప రాష్ర్టపతి అభ్యర్థిగా ఎంపికైన హమీద్‌ అన్సారీకి ఓ రికార్డు ఉంది. గడిచిన 50 సంవత్స రాల్లో రెండోసారి ఉప రాష్ర్టపతి పదవిని రెం డవసారి అలరించ బోతున్న ఘనత అన్సారీదే. ఈ రికార్డు సృష్టించిన తొలి వ్యక్తి ప్రముఖ రాజనీతిజ్ఞుడు సర్వేపల్లి రాధా కృష్ణన్‌. ఆయన 1952-62 కాలంలో వరుసగా రెం డుసార్లు ఉపరాష్ర్టపతిగా ఉన్నారు. ఇక అన్సారీ 2007లో తొలిసారి ఉప రాష్ర్టపతి పదవిని చేపట్టారు. నిజానికి ఆయనకు ఈ పదవి చాలా అనూ హ్యంగా వచ్చిపడింది. నాడు యూపీఏ1 ప్రభుత్వానికి బయటి నుంచి మద్దదతు ఇస్తున్న వామపక్షాలు… అనూహ్యంగా ఆయన పేరును ప్రతిపాదించడం, కాంగ్రెస్‌ నేతృ త్వంలోని కూటమి అంగీకరించడం జరిగింది. ఆయనపెై బీజేపి తరపున పోటీ చేసిన నజ్మా హెప్తుల్లా పరా జయం చెందారు. 788 ఓట్లు కలిగిన ఎలక్టోరల్‌ కాలేజీలో అన్సారీకి 455 ఓట్లు వచ్చాయి. యూఎన్‌ పీఏ అభ్యర్థి రషీద్‌ మసూద్‌ మూడో స్థానంలో నిలిచారు.

ఇప్పటి వరకూ అలంకరించిన పదవులు

 • 1961లో భారత విదేశాంగ సర్వీసులో చేరి బాగ్దాద్‌, రాబత్‌, జెడ్డా, బ్రసెల్స్‌లోని భారత దౌత్య కార్యాల యాల్లో పని చేశారు.
 • తర్వాత 1976-79లో యునెైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో భారత రాయబారిగా…
 • 1980-85 భారత ప్రోటోకాల్‌ చీఫ్‌గా,
 • 1985-89 వరకు ఆస్ట్రేలియాలో భారత హైకమి షనర్‌గా..
 • 1989-90 ఆఫ్ఘానిస్థాన్‌, 199092లోఇరాన్‌లో రాయబారిగాను పనిచేశారు.
 • 1993-95లో న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో శాశ్వత ప్రతినిధిగా విధులు నిర్వర్తించారు.
 • 1995-99 మధ్య సౌదీ అరేబియా రాయబారిగా విధులు నిర్వర్తించారు.
 • అనంతరం పలు యూనివర్సిటీల్లో విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా ఉన్నారు.
 • 2004 నుంచి రెండేళ్లపాటు జాతీయ భద్రత సలహా బోర్డులో సభ్యుడిగా పనిచేశారు.
 • 2004-05 కాలంలో విదేశాంగ శాఖకు చెందిన చమురు దౌత్యానికి సంబంధించిన సలహా మండలికి చెైర్మన్‌గా ఉన్నారు.
 • 2006-07 మధ్య మైనారిటీల ఐదో జాతీయ కమిషన్‌కు చెైర్మన్‌గా పనిచేశారు.
 • 2007 ఆగస్టు 11 నుంచి భారత ఉప రాష్ర్టపతి, రాజ్యసభ ఎక్స్‌ఆఫీషియో చెైర్మన్‌ పదవులను అలంకరించారు.

  ప్రొఫైల్

  పూర్తి పేరు		: జశ్వంత్‌ సింగ్‌
  పూట్టిన తేది : 03-01-1938
  రాష్ర్టం : జోసల్‌, రాజస్థాన్‌
  భార్య : షీతల్‌కుమారి
  సంతానం : 2 కుమారులు

  Untiaసీనియర్‌ బీజెపీ నాయకుడు…. కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్‌ సింగ్‌ తాజా ఉప రాష్ర్టపతి అభ్యర్థిగా పోటీప డు తున్నారు. ముక్కుకు సూటిగా వ్యవహారం ఆయన్ను ఎప్పుడూ వార్తల్లోనే ఉంటారు. ఇక ఈయన్నే బిజెపీ పోటీకి పెట్టడానికి కారణం కూడా ఉంది. లోక్‌పాల్‌ బిల్లుపెై చర్చ కొలిక్కి రాకుండానే, రాజ్యసభను అర్థరాత్రి వాయిదా వేయించారని, అలాగే మహిళా బిల్లును ఎలాగెైనా ఆమో దింపజేసేందుకు భారీగా మార్షల్స్‌ను దించి, బిల్లుపెై అభ్యంతరాలు లేవనెత్తిన వారిని బయటకు పంపారని బిజెపి ఆరోపణ. దానికి సవాలుగానే జశ్వంత్‌ను రంగం లోకి దించినట్లు కనబడుతోంది. ఇక జశ్వంత్‌ సింగ్‌ ఫ్రొఫెై ల్‌ చూస్తే…. మాజీ సైనికాధికారి అయిన జశ్వంత్‌, ఎన్డీఏ హయాంలోని వాజ్‌పేయి మంత్రివర్గంలో ఆర్థిక, రక్షణ, విదేశాంగ శాఖలను నిర్వహించారు. రాజ్యసభలో విపక్ష నేతగా ఉన్నారు.

  అనేక పుస్తకాలు రాశారు. సైన్యంలో మేజర్‌ ఉద్యోగాన్ని వదులుకుని, 1960లో రాజకీయా ల్లోకి అడుగు పెట్టారు. 1999లో ఎయిరిండియా విమా నం హైజాక్‌కు గురెైనప్పుడు, ఆందులోని ప్రయాణీకులను విడిపించు కునేందుకు ఉగ్రవాదులతో కలసి కాందహార్‌ వెళ్లడంపెై జశ్వంత్‌ విమర్శలు ఎదుర్కొన్నారు. రాజ్యసభ లో విపక్షనేతగా 2009 వరకూ కొనసాగిన జశ్వంత్‌, గూర్ఖాలాండ్‌ కోసం పోరాడుతున్న స్థానిక పార్టీల కోరిక మేరకు డార్జిలింగ్‌ నుంచి పోటీచేసి గెలుపొందారు. జశ్వంత్‌ తన పుస్తుకంలో పాకిస్థాన్‌ వ్యవస్థాపకుడు మహ మ్మదాలీ జిన్నాపెై ప్రశంసలు కురిపించినందుకు, బీజేపీ అధిష్టానం 2009లో ఆయనను పార్టీ నుంచి బహిష్కరిం చింది.

  గడ్కారీ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిం చాక, జశ్వంత్‌ను పార్టీలోకి రప్పించుకున్నారు. పోఖ్రాన్‌ అణు పరీక్షల సమయంలో భారత్‌పెై ఆంక్షలు విధించిన అమెరికాతో పట్టుసడలకుండా వ్యవహరించారు.. ఆర్థిక మంత్రిగా పనిచేసిన కాలంలో మార్కెట్‌ శక్తులకు అనుకూ లుడిగా పేరు పొందారు. 1980లో రాజ్యసభలోకి అడు గుపెట్టిన జశ్వంత్‌, పలుసార్లు ఎగువసభలోనే కొనసా గారు. ప్రస్తుతం 4వ విడత లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

  ఉపరాష్ర్టపతి ఎన్నికలలో బలాబలాలు

  			   ఎంపీలు
  లోక్‌ సభ 545
  రాజ్యసభ 245
  మొత్తం ఎలక్టోరల్‌ కాలేజీ సభ్యులు 790
  యూపీఏ 453
  ఎన్‌డీఏ 218
  సిపిఐ, టీఎంసీ (తటస్థం) 35
  ఇతరులు 84
Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top