You Are Here: Home » ఇతర » వేసవిలో రక్షణ

వేసవిలో రక్షణ

వేసవి తాపానికి ఎంతటి బలవంతులైనా సరే అబ్బా! అనక మానరు. ఇక పసిపిల్లల సంగతైతే చెప్పనక్కర్లేదు. నోరు విప్పిచెప్పుకోలేని పరిస్థితి. వేసవి తీవ్రత నుంచి పిల్లలను కంటికి రెప్పలా కాపాడకపోతే అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముంది. మరి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకుందామా?

  • వేసవికాలం పిల్లలు విపరీతంగా ఏడుస్తున్నారంటే వారి శరీర ఉష్ణోగ్రత పెరగడం వలన వచ్చే అలసట, విసుగు అయి ఉండొచ్చని అర్థం చేసుకోవాలి. వారి చుట్టూ చల్లని వాతావరణం ఉండేలా జాగ్రత్తపడాలి. చల్లగాలి తగిలేలా చూడాలి. లేదంటే శరీరం వేడెక్కి విపరీతంగా ఏడ్చేస్తారు. వట్టివేళ్ల తడికలు తడిపి కిటికీలకు కడితే చల్లని గాలి తగుతుంది. ఇవి పిల్లల ఆరోగ్యానికి కూడా చాలా సహకరిస్తుంది.
  • సాధ్యమైనంత వరకు పిల్లల్ని పరుపుల మీద కాకుండా మెత్తటి బట్టల మీదే పడుకోబెట్టుకోవాలి. డైపర్స్‌ను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. డైపర్స్‌ వాడటం ఇష్టపడని వారు వాటికి బదులుగా కాటన్‌ దుస్తులను ఉప యోగించడం చాలా మంచిది. బట్టలను ఎప్పటికప్పుడు మారుస్తుండాలి.
  • పిల్లల దుస్తులను ఉతికేటప్పుడు కొద్దిగా డెటాల్‌ వేయాలి. చెమట వలన చేరిన చెడు బాక్టీరియా నాశనమవుతుంది.
  • పిల్లలకు గోరు వెచ్చని కన్నా ఇంకాస్త చల్లగా ఉన్న నీటిని స్నానానికి ఉపయోగించాలి. శరీరంలోని వేడి తగ్గి జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుంది.
  • ఏసి, కూలర్‌ల నుంచి వచ్చే చల్లని గాలి తీవ్రత ఎక్కువగా లేకుండా నార్మల్‌గా ఉండేలా చూడాలి. కిటికీలకు మెత్తని క్లాత్‌ తడిపి కడితే మంచిది. ఫ్యాన్‌ వేయాలనుకుంటే తక్కువ స్థాయిలో వేగం ఉండాలి.
  • వేసవికాలం పిల్లల్ని బాధపెట్టే సమస్య చెమట పొక్కులు. చెమట పొక్కులు వచ్చిన ప్రదేశంలో అలోవిర అప్లయ్‌ చేస్తే అది మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. పిల్లల చర్మం నునుపుగా, మెత్తగా, కాంతివంతంగా కూడా తయారవుతుంది.
  • చెమట పొక్కుల నుంచి కాపాడే పౌడర్‌ను వాడేటప్పుడు పిల్లల చర్మానికి సరిపోతుందో లేదో డాక్టర్‌ సలహా తీసుకోవాలి.
  • పిల్లలకు ఒంటిపై తడి ఆరక ముందే పౌడర్‌ను ఉపయోగించకూడదు. స్వేద రంధ్రాలు మూసుకుపోయి శరీర ఉష్ణోగ్రత పెరిగే అవకాశముంది. సాధ్యమైనంత వరకూ పౌడర్‌ రాయకుండా ఉండటానికే ప్రయత్నిం చండి. చెమటపొక్కులు వచ్చినప్పుడు మాత్రం చెమట కాయలకు సంబం ధించిన పౌడర్‌ను ఉపయోగించాల్సి వస్తే డాక్టర్‌ సలహాతో వారి చర్మానికి సరిపడే పౌడర్‌ను తీసుకోండి.
  • ఎండ తీవ్రత ఎక్కువవుతున్న సమయంలో పిల్లలకు స్నానం చేయించకూడదు. ఉదయాన్నే స్నానం చేయించడటం మంచిది. సాయంత్రం స్నానం చేయించినా కూడా పడుకునే సమయానికి మళ్లీ చెమట పడుతుంది. పడుకునే ముందు తప్పకుండా స్నానం చేయించాలి. కలత లేని నిద్రపోవడానికి సహకరిస్తుంది.

    సాధ్యమైనంత వేసవిలో ప్రతి రోజూ తలస్నానం చేయించాలి. లేదంటే తలలో కూడా చెమటపొక్కులు వచ్చే అవకాశముంది. కనీసం వారానికి మూడు సార్లయినా పిల్లలకు తలస్నానం చేయించాలి. లేదంటే చెమట వలన చేరుకునే మురికి తలలో చెమటపొక్కులు వచ్చేలా చేస్తుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top