You Are Here: Home » చిన్నారి » వేప ప్రయోజనాలు

వేప ప్రయోజనాలు

ప్రకృతిలో అనేక ఔషధ మొక్కలు తీగలుగా, గుల్మాలుగా, పొదలుగా, వృక్షాలుగా మనదేశంలో పెరుగుతాయి. ఇటువంటి మొక్కలకు తూర్పు, పశ్చిమ హిమాల యాలు, నీలగిరి పర్వతాలు నెలవులు. మనదేశంలో వేపను దివ్యవృక్షంగా పేర్కొంటూ పూజిస్తారు. వేపపుష్పాలు చిన్నగా, తెల్లగా,తీయని పరిమళముతో కూడిఉంటాయి. వేరు, బెరడు, పత్రములు, పూవులు, విత్తనాలు అన్నికూడా ఔషధ బలాన్ని చూపుతున్నప్పటికీ , ఆకులు అధిక ఔషధ ప్రాముఖ్యతను కల్గి ఉంటాయి. చర్మవ్యాధుల నివారణకు ఇది పెట్టింది పేరు.

staaaవేప సాధారణంగా వేగంగా పెరిగే వృక్షము. వ ర్షాభావ పరిస్థితిని తట్టుకుంటుంది. బెరడు గర కుగా, నల్లగా ఉంటుంది. జిగురు పదార్థము ము ద్దలుగా దీనిపై ఏర్పడును. దీనిని ఈస్ట్‌ ఇండియా గమ్‌ అని ఆంటారు. నాణ్యమైన కలప లభించడం వల్ల దీనిని గృహనిర్మాణము, గృహో పకరణ సామాగ్రికి , సేద్య పనిముట్లకు వాడుతారు.ఈ కలపలో కీటక నాశన రసాయనాలు ఉన్ నందున చెదలు పట్టుటగాని, పుచ్చిపోవడం కాని జరుగదు. బెరడు ను టానిక్‌గా వాడుతారు. జిగురును బట్టలనేతకు సంబంధించిన పరిశ్రమలలో, రంగులు, అద్దకం పరిశ్రమలలో ఉపయోగి స్తారు. అలాగే కొన్ని రకాల మందులలోను వాడుతున్నారు. విత్తనాలనుంచి తైలాన్ని తీస్తారు. దోమలను పారదోలేందుకు దీన్ని వాడతారు. వేప చెక్కను, వేపపిండిని క్రిమిసంహారిగా చెట్లకు వాడుతారు. పచ్చి ఆకులను ఎరువుగా వాడతారు.

1942లో ఢిల్లీ విశ్వవిద్యాలయంలో సైంటిఫిక్‌, ఇండస్ట్రియల్‌ ప్రయోగశాల లో(ఇండియా) దీనినుంచి మూడు చేదు మిశ్రమాలను వెలికి తీశారు. అవి నింబి, నింబినిన్‌, నింబిడిన్‌లు. విత్తనాలలో అజాడిరక్టిన్‌ అనే పదార్థము అధికం. వేప శీలింధ్రాలను,బాక్టీరియాను, వైరస్‌ ను నశింపజేస్తుంది. ఆయుర్వేద మం దులలో వేప అతి ప్రధానమైనది. ఎక్కువ గా వేపనూనెను చర్మవ్యాధులకు వాడు తారు. అలంకార ద్రవ్యాలలోను, సబ్బు లు, షాంపూల తయారీలోనూ విరివిగా వాడతారు. దీనివల్ల చర్మ సౌందర్యాన్ని పెంపొందించు కోవచ్చును.

ప్రపంచవ్యాప్తంగా పంటలను నాశనం చేసే 500 రకాల కీటకములను, శక్తిహీనము చేయు స్వభావ మును కలిగిఉంది. వేపనుంచి ఉత్పత్తి అయ్యే కీట క నాశకములు చౌకగా లభిస్తాయి. అంతేకాక జంతువులకు, పంటకు ఉపయోగపడే కీటకాలు (సీతాకోకచిలుక) లకు హానిచేయవు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top