You Are Here: Home » దైవత్వం » వేద వేదాంగాలు

వేద వేదాంగాలు

సృష్టిలో అన్ని విషయాలకూ వేదాలే ప్రామాణికంగా నిలుస్తున్నాయి. ఋగ్వేద, అధర్వణ, సామ, యజుర్వేదాలు నాలుగూ భూమిమీద మానవ మనుగడని సూచించే దివ్య దీపికలు. వేదాల్లోనే నేడు మనం అనుకుంటున్న ఇంజనీరింగ్‌, వెైద్యం, నిర్మాణం, నిర్వాణం అన్నీ దాగివున్నాయి. నవీన శాస్త్ర పరిజ్ఞానం అంతా ఇమిడివుంది. అసలు నాలుగు వేదాలూ ఆమూలంగా చదివినవారికి సర్వ విషయాలూ కరతలామలకాలు అనడంలో అతిశయోక్తి లేదు. వేదాధ్యయనం వలన మంచి మేథస్సు పెరుగుతుంది.

vedamస్వరయుక్తంగా నేర్చుకునే వేదపఠనం వలన శతాయువు సిద్ధిస్తుంది. వేదాలు సకల కళా సారాలు. అందుకే ఎంతోమంది వేదపాఠశాలలు స్థాపించి వటువుల చేత వేద పఠనాన్ని అభ్యసింపచేస్తున్నారు. హిందూ సంప్రదాయంలో వేదానికి చాలా ప్రాముఖ్యత ఉందన్న విషయం అందరికీ తెలిసినదే. భగవంతుని పూజించే విధానం నుంచి మనం నిర్వహించే ప్రతి శుభకార్యానికీ జరపవలసిన తంతు వేదాల్లోనే ప్రతిపాదించబడింది. అర్చకులు వేదాలు నేర్చుకోకపోతే సత్కర్మలు, సత్కార్యాలు జరిపించలేరు. సకల మంత్ర బాఢాగారం వేదమే. దాని నుంచే మానవుని చర్యలు, జీవనం ఆధారపడి నేటికీ వేద ప్రామాణికంగానే నడుస్తున్నాం అన్నది వాస్తవం. అపరకరె్మైనా, శుభకార్యమైనా, మంత్రమైనా, తంత్రమైనా, రాజకీయమైనా, కళాపోషణైనా, పరిపాలనెైనా, జన్మరాహిత్యమైనా అన్నీ వేదాల్లో మనకి లభించే పరిజ్ఞానమే.

అన్ని వేదాలు అపోసన పట్టినవాడికి ఎందులోనూ ఎదురుండదు. వేదం వల్ల మనకి లభించేదే అసలెైన జ్ఞానం. అదే జీవినానికైనా, జీవరాహిత్యానికైనా మార్గదర్శకం. కొన్ని నియమ నిబంధనలు పాఠిస్తే వేదాన్ని అందరూ అభ్యసించవచ్చు. వేదసారాన్ని అందరూ తెలుసుకోవచ్చు. నేటి పరిస్థితుల్లో ఇది చాలా అవసరం కూడా. ఏ వేదం దేనిని ఎందుకు ప్రతిపాదిస్తోందో తెలుసుకోవడం నేటి మానవునికి కనీస ధర్మం. ఎన్నో చోట్ల వేదపాఠశాలలు ఉన్నాయి. కానీ అందులో వేదం నేర్చుకునే విద్యార్ధుల సంఖ్యం చాలా స్వల్పంగా ఉంటోంది. అందరూ ఇంగ్లీషు చదువులకే ప్రాధాన్యతనివ్వడం, విదేశీ ఉద్యోగాలకోసం వెంపర్లాడటం, వేద విద్యార్ధులంటే ఒక రకమైన చులకన భావంతో చూడటం నేటి తరానికి పరిపాటి అయిపోయింది. వేద బ్రాహ్మణుల్ని కించపరచడం కూడా ఒక జాఢ్యంగా పరిణమించింది.

వేదం నిర్వేదంగా మారుతోంది. వేదమూర్తుల్ని అవమానిస్తున్నారా? వేదాన్ని అవమానిస్తున్నారా? వేదం అభ్యసిస్తున్న వారిని అవమానిస్తున్నారా? ఈ విషయం అవమానించేవారికే తెలియదు. వేద మంత్రాలు అందరికీ కావాలి కానీ వేదం మాత్రం పాఠ్యాంశంగా ఎవరికీ అక్కర్లేదు. ఎన్నో భాషల పాఠ్యాశాలు నేర్చుకునే విద్యార్ధులకు వేదపాఠాలు, వాటి విలువల గురించి కూడా తెలిపే పాఠ్యాంశాలు ప్రవేశపెడితే సమాజం తప్పకుండా కొంతెైనా బాగుపడటం ఖాయం. ఎందరో విదేశీయులు వేదాల మీద ఇప్పటికీ రీసెర్చ్‌లు నిర్వహిస్తుంటే, మనం ఇంకా కళ్ళు తెరవకపోవడం సమజసం కాదు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top