You Are Here: Home » సినిమా » పాటలు » వెలుగు నీడలు (1961)- చిట్టిపొట్టీ చిన్నారి పుట్టినరోజు

వెలుగు నీడలు (1961)- చిట్టిపొట్టీ చిన్నారి పుట్టినరోజు

పల్లవి :

చిట్టిపొట్టీ చిన్నారి పుట్టినరోజు
చేరి మనం ఆడేపాడే పండుగరోజు

వేడుకుగా ఈ పూట
ఆడుదమా దొంగాట (2)

చరణం : 1

కళ్లకు పట్టి చల్లగ కట్టి
వీపుతట్టి పోతాం
తాకినవారి పేరొకసారి
చెప్పవోయి చూదాం
చురుకుతనం బుద్ధిబలం
ఉంటేనే చాలు
చూడకనే తెలియు కదా నిజానిజాలు
వేడుకుగా ఈ పూట
ఆడుదమా దొంగాట (2)

చరణం : 2

కన్నులుండి చూడలేరు
కొంతమంది జనం
దారి తప్పి తిరగడమే
తెలివిలేనితనం

మెదడు పదును పెట్టాలి
అసలు దొంగను పట్టాలి (2)

చరణం : 3

అంబా అనే అరుపు విని
తల్లిని చేరులేగ
నేల మీద పిట్టను పోల్చు
నింగినెగురుడేగ
చీకటైన చిటారుకొమ్మ చేరును కోతి
గురి తెలిసి మసలుకొనే
నిదానమే నీతి
వేడుకుగా ఈ పూట
ఆడుదమా దొంగాట (2)

చిత్రం : వెలుగు నీడలు (1961)
రచన : శ్రీశ్రీ
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు
గానం : పి.సుశీల, స్వర్ణలత

– నిర్వహణ : నాగేష్

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top