You Are Here: Home » చిన్నారి » వెలుగుతున్న బల్బ్‌లో ఫిలమెంట్ ఎందుకు మండదు?

వెలుగుతున్న బల్బ్‌లో ఫిలమెంట్ ఎందుకు మండదు?

మనం రోజూ వెలుగుతున్న విద్యుత్ ల్యాంప్‌లని గమనిస్తూనే ఉంటాం. వాటిలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నాగానీ ఎందుకు మండవనే సందేహం పిల్లలకి వస్తూ ఉంటుంది. అలా ఎందుకు జరుగుతుందో చూద్దాం. ఏదైనా మండాలంటే గాలి తప్పనిసరిగా ఉండాలి. ఆక్సిజన్ ఉన్నపుడే దహనం జరుగుతుంది. విద్యుత్ బల్బ్‌లో అసలు ఆక్సిజన్ ఉండదు. ఫిలమెంట్‌కూ బల్బుకు మధ్య ఖాళీలో శూన్యం మాత్రమే ఉంటుంది.

ఉష్ణోగ్రత ఎంత ఉన్నప్పటికీ ఆక్సిజన్ లేకపోతే మండటం సాధ్యం కాదు. వెలుగుతున్న కొవ్వొత్తిని ఆక్సిజన్‌లేని చోట పెడితే ఆరిపోతుందనే ప్రయోగం చాలా మంది విద్యార్ధులు స్కూళ్లలో చేసే ఉంటారు. విద్యుత్ బల్బ్‌లో ఆక్సిజన్ లేకుండా శూన్యం మాత్రమే ఉండడం వల్ల అది వెలుగుతున్నపుడు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నా మండదని అర్ధమయింది కదా!

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top