You Are Here: Home » ఇతర » వెరైటీ రుచులకి పసందైన పన్నీర్‌

వెరైటీ రుచులకి పసందైన పన్నీర్‌

పన్నీర్‌తో చేసే వంటకాలు ఇప్పుడు లేటెస్ట్‌ ట్రెండ్గగా మారింది. వివిధ రెస్టారెంట్లలోను, స్టార్‌ ెటల్స్‌లోను పన్నీర్‌తో చేసిన అనేక రకాల వంటకాలు అందర్నీ నోరూరిస్తున్నారుు. మెరుున్‌ డిష్‌గానే కాకుండా, సైడ్గ డిష్‌లో కూడా పన్నీర్‌ వాడకం ఎక్కువగా ఉంటోంది. పన్నీర్‌ను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. పన్నీర్‌తో చేసే వంటకాలు చాలా రుచికరంగా ఉండటమే కాకుండా పిల్లల్నీ, పెద్దల్నీ కూడా అలరిస్తున్నారుు. పన్నీర్‌తో ఇంటిపట్టున చేసుకునే కొన్ని వంటకాలు ఈవారం మీకోసం.

పన్నీర్‌ మసాలా కర్రీ
కావలసినవి:

masala

పన్నీర్‌ ముక్కలు: 1 కప్పు ,
పచ్చిబఠానీ : 1 కప్పు,
ఉల్లిపాయ : 2,
టమోటో : 1 (ముక్కలుగా తరగినది),
పాలు : 1/2 కప్పు,
అల్లం : 1 చిన్న ముక్క,
వెల్లుల్లి రెబ్బలు : 5-6, పసుపు: చిటికెడు,
కారం : 1 చెంచాడు,
గరం : 1/2 చెంచా,
ధనియాల పొడి : 1 చెంచాడు,
జీలకర్ర : 1/2 చెంచా
బిర్యాని ఆకు : 1,
ఉప్పు : తగినంత,
నీళ్ళు : 1/2 కప్పు,
నూనె : 1/2 కప్పు

తయారీ విధానం:
1. ముందుగా ఒక పాన్‌లో మూడు చెంచాల నూనె వేసి, వేడఇయ్యాక అందులో బిర్యాని ఆకు వేసి, (కావాలనుకుంటే ఉల్లిపాయముక్కలు తగినన్ని వేసుకోవచ్చు). అల్లం, వెల్లుల్లి వేసి సన్నని మంట మీద దోరగా వేయించాలి. 2. తర్వాత పచ్చి బఠానీలు కూడా చేర్చి మరో ఐదు -పది నిముషాలు వేయించాలి. 3. పచ్చి బఠానీలు ఎప్పుడైతే వేగినట్టు అనిపిస్తాయో, ఆ సమయంలో తరిగి పెట్టుకొన్న టమోటో ముక్కలు, పసుపు పొడి, పన్నీర్‌ ముక్కలు, ఉప్పు వేసి బాగా కలుపుతూ వేయించాలి. పన్నీర్‌ ముక్కలు మంచి బంగారు రంగులో బ్రౌన్‌ కలర్‌ వచ్చేంత వరకూ వేగనివ్వాలి. కావాలంటే అయితే కొద్దిగా నూనె వేసుకోవచ్చు. 4. తర్వాత పన్నీర్‌ ముక్కలు వేగిన తర్వాత వాటి మీద కారం, జీలకర్ర పొడి చల్లి, కొద్దిగా పాలు, నీళ్ళు కూడా వేసి, బాగా కలిపి మరో ఐదు నిముషాల పాటు దగ్గర పడేవరకూ ఉడకనివ్వాలి. 5. చివరగా గరం మసాలా కూడా వేసిన తర్వాత గ్రేవీ చిక్కబడిన తర్వాత వేడి వేడిగా వడ్డిస్తే మంచి రుచిగా ఉంటుంది. ఇది సైడ్‌ డిష్‌గా అన్నిటిలోకీ ఎంతో బాగుంటుంది.

పన్నీర్‌ బదామీ
కావలసినవి:

badami

పన్నీర్‌         : 250 గ్రాములు, 
ఉల్లిపాయలు : 2,
అల్లం : 1 చిన్న ముక్క,
వెల్లుల్లి : 4 - 5 రెబ్బలు,
బాదాం : 10 - 12 (30 నిముషాలు నానబెట్టాలి),
పసుపు : 1 చెంచాడు,
కారం : 1 చెంచాడు,
ధనియాల పొడి : 1 చెంచాడు,
ఎండు మిర్చి : 3,
టమోటో గుజ్జు : 1/2 కప్పు,
జీలకర్ర పొడి : 1 చెంచాడు,
పాలు : 1 చెంచాడు,
గరం మసాలా : 1 చెంచాడు,
లవంగం : 1,
పంచదార : 1/2 చెంచా,
బిర్యానీ ఆకు : 1, ఉప్పు:
తగినంత, నూనె : 1 కప్పు.

తయారీ విధానం:
1. ముందుగా బాదాం, ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, రెండు ఎండు మిర్చి వీటన్నింటినీ మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్‌ చేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు వేసి చిక్కగా మెత్తగా ఉండేటట్టు చూసుకోవాలి. 2. తర్వాత స్టౌ మీద పాన్‌ పెట్టి, కావలసిన సైజులో పన్నీర్‌ కట్‌ చేసి ఆముక్కలను అందులో వేసి బ్రౌన్‌ కలర్‌ వచ్చేంత వరకూ వేయించాలి. వేగిన తరువాత ఒక ప్లేట్‌ లోనికి తీసుకొని చల్లారనివ్వాలి. 3. తర్వాత ఒక గిన్నెలో కారం, ధనియాలపొడి, పసుపు, ఉప్పు, కొద్దిగా నీళ్ళు పోసి చిక్కగా కలుపుకోవాలి. 4. ఇప్పుడు పన్నీర్‌ వేయించుకొన్న అదే సాన్‌ స్టౌ మీద పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి, కాగిన తర్వాత అందులో బిర్యానీ ఆకు, లవంగాలు, ఎండు మిచ్చి, వేసి వేయించి కలిపి పెట్టుకొన్న కారం, ధనియాలపొడి లిక్విడ్‌ ను మసాలా దినుసులు వేగుతున్న పాన్‌లో పోసి బాగా కలియ బెట్టాలి. 5. ఇప్పుడు అందులోనే ముందుగా మిక్సీలో పేస్ట్‌ చేసుకొన్న మసాలా మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలిపి ఎక్కువ మంటమీదా ఐదు నిముషాల పాటు ఉడికించాలి. 5-10 నిముషాల తర్వాత టమోటో గుజ్జును కూడా ఈ మిశ్రమంలో పోయాలి. 6. 2-3 నిముషాల తర్వాత గరం మసాలా, జీలకర్ర పొడి చిలకరించి, అరకప్పు నీటిని పోసి బాగా ఉడికించాలి. ఈ మిశ్రమం గరిట జారుగా చిక్కబడేటప్పుడు అందులో వేయించి పెట్టుకొన్న పన్నీర్‌ ముక్కలు, కొద్దిగా పాలు, పంచదార వేసి బాగా కలిపి ఇంకొంచెం సేపు ఉడకనివ్వాలి. దీనితో వంటకం పూర్తయినట్టే. దీనిని ఒక గాజు బౌల్‌లోకి తీసుకుని దానిమీద కొత్తిమీర తరుగు, ఉల్లిపాయ తరుగుతో అందంగా అలంకరించుకుంటే, ఎంతో రుచిగా ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు.

పన్నీర్‌ కర్రీ
కావలసినవి:

kareeపనీర్‌ – 1 కప్పు చాల చిన్న ముక్కలుగా చేసుకున్నవి, ఉల్లిపాయ – 1 సన్నని ముక్కలు, టమోటాలు – 3 చిన్న ముక్కలు చేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్టు – 1 చెంచా, పసుపు – చిటికెడు, కారం – సరిపడా, ధనియాల పొడి – 1/2 చెంచా, గరం మసాల – తగినంత, ఉప్పు – తగినంత, నూనె – తగినంత.

తయారీ విధానం:
ఒక పాన్‌లో తగినంత నూనె పోసి వేడి చేసుకోవాలి. కాగాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. అందులో తరిగిన టమోటా ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించుకోవాలి. అందులో కొంచం పసుపు తగినంత కారం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు పనీర్‌ ముక్కలు కూడా వేసి కలిపి చిన్న మంట మీద పనీర్‌ మెత్త బడే దాక ఉడికించాలి. తరువాత తగినంత కారం, ధనియాల పొడి వేసి ఇంకో ఐదు నిముషాల పాటు ఉడికించాలి. ఆఖరున గరం మసాల పొడి చల్లి కలిపి దించేయాలి. అంతే పనీర్‌ కర్రీ తయార్‌.

పన్నీర్‌ వెజిటబుల్‌ సలాడ్‌
కావలసినవి:

salad

పన్నీర్‌     : 1 కప్పు (చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి) , 
ఉల్లిపాయ : 1 (చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి),
టమోటో : 1 (చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి),
కీరదోసకాయ : 1 (చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి),
పచ్చిమిర్చి : 1 (చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి),
ఆవాలు : 1/2 చెంచా,
నిమ్మరసం : 1 చెంచాడు,
ఉప్పు : రుచికి తగినంత,
కొత్తిమీర
తరుగు : 1 చెంచాడు (తురిమి ఉంచుకోవాలి).

తయారీ విధానం:
1. ముందుగా పాన్‌ వేడి చేసి, అందులో పన్నీర్‌ ముక్కలు వేసి, సన్నని మంట మీద లైట్‌ బ్రౌన్‌ కలర్‌ వచ్చేంత వరకూ వేయించుకోవాలి. 2. పన్నీర్‌ ముక్కలు బ్రౌన్‌ కలర్‌లో మారగానే పాన్‌ దించేయాలి. 3. ఇప్పుడు ఒక బౌల్‌లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కీరదోసకాయ, టమోటో ముక్కలను అన్నీ వేసి బాగా కలపాలి. 4. తర్వాత అందులోనే ముందుగా రోస్ట్‌ చేసి పెట్టుకున్న పన్నీర్‌ ముక్కలు కూడా వేసి స్పూన్‌తో బాగా కలపాలి. తరువాత అందులో ఉప్పు, ఆవాల పొడి వేసి మరికొంత సేపు అన్నీ కలిసేదాకా కలపాలి. 5. చివరగా నిమ్మరసం పిండి మరో సారి కలిపి, కొత్తిమీర తరుగుతో గార్నిష్‌ చస్తే, తక్కువ ఫ్యాట్‌ వెజిటబుల్‌ సలాడ్‌ నోరూరిస్తూ మీ ముందు ఉంటుంది. దీనిని బ్రేక్‌ ఫాస్ట్‌గా చేసుకుంటే బాగుంటుంది.

Other News From

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top