You Are Here: Home » చిన్నారి » వెన్నెముక లేని జీవుల్లో తెలివైన జీవి?

వెన్నెముక లేని జీవుల్లో తెలివైన జీవి?

ఆక్టోపస్ అంటే ఎనిమిది కాళ్ల జీవి. ఆక్టోపస్ శరీరం లోపల గాని బయటగాని అస్తిపంజరం లేకపోవడంతో చిన్నచిన్న ఇరుకు ప్రదేశాల్లో కూడా చాలా సులువుగా దూరిపోగలదు. వెన్నెముక లేని జీవులలోకెల్లా ఆక్టోపస్ తెలివైనది. ఆక్టోపస్‌ల జీవిత కాలం చాలా తక్కువనే చెప్పాలి. కొన్ని రకాల ఆక్టోపస్‌లు కేవలం ఆరు నెలలు మాత్రమే బతుకుతాయి. అయితే ఆక్టోపస్‌ల మరణానికి వాటి పునరుత్పత్తే కారణం అవుతుంది.

మగ ఆక్టోపస్‌లు మేటింగ్ తర్వాత కొద్ది నెలలకే చనిపోతాయి. వాటి శరీరంలో ఉండే రెండు ఆప్టిక్ గ్రంథుల నుంచి వెలువడే ఎండోక్రైన్ స్రావాల వల్ల జన్యుపరంగా ముందుగానే నిర్ణయించబడిన మరణం సంభవిస్తుంది. అయితే శాస్త్రజ్ఞుల అభిప్రాయం ప్రకారం ఒక వేళ ఈ గ్రంథుల్ని ఆపరేషన్ ద్వారా తొలగించ గలిగితే ఆక్టోపస్‌లు ఎక్కువకాలం బతికే అవకాశం ఉంటుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top