You Are Here: Home » ఇతర » ‘వెడ్డింగ్‌’సోయగాలు

‘వెడ్డింగ్‌’సోయగాలు

DSC_3966ఫ్యాషన్‌ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. కొత్తగా ఏ డిజైన్‌ మార్కెట్లోకి అడుగుపెట్టినా భాగ్యనగరంలో ప్రత్య క్షమవుతోంది. అంతర్జాతీయంగా ఫ్యాషన్‌ రంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న కొత్త డిజైన్లను డిజైనర్లు ఇక్కడ పరిచయం చేస్తున్నారు. ఇక పెళ్లి సమయంలో ధరించే వస్త్రాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. వధూవరులు మెచ్చే వివిధ డిజైన్లలో డిజైనర్లు వీటిని తీర్చిదిద్దితున్నారు. సెల బ్రిటీలు, ఫ్యాషన్‌ప్రియులు కోరుకునే సరికొత్త వెరైటీలు అందుబాటులోకి వస్తున్నాయి. మన ఈ తరుణంలో దేశంలోని పలు ప్రాంతా నుంచి దాదాపు 90 మంది డిజైన ర్లు తయారు చేసిన ఉత్పత్తుల ప్రదర్శన పరిణయ వెడ్డింగ్‌ఫెయిర్‌ జనవరి 25 నుంచి 28వరకు హైదరాబాద్‌ శ్రీనగర్‌కాలనీలో ఉన్న శ్రీ వెంకటేశ్వర కళ్యాణమం డపంలో ఏర్పాటు కానుంది.

బెంగుళూరు, విజయ వాడ, విశాఖపట్నం, వరంగల్‌, కరీంనగర్‌, నెల్లూరు, తదితర ప్రాంతాల్లో ఎగ్జిబిషన్లను నిర్వహిస్తున్న పరిణ య సంస్థ ఈ ప్రదర్శన ఏర్పాటు చేస్తోంది. డిజైనర్‌ చీరలు, డైమండ్‌ జ్యుయలరీ, ఇమిటేషన్‌ జ్యుయలరీ గాగ్రాస్‌, లెహంగాస్‌, ఇమిటేషన్‌ జ్యుయలరీ, గోల్డ్‌ జ్యుయలరీ, ప్రీషియస్‌, సెమీ ప్రీషియస్‌ స్టోన్స్‌ జ్యుయలరీ, డిజైనర్‌ ఫుట్‌వేర్‌ సహా అన్ని రకాల యాక్ససరీస్‌ను ఇందులో ఏర్పాటు చేసినట్లు పరిణయ ఈవెంట్స్‌ అధినేత రావు తెలిపారు. వధూవరులకు అవసరమైన అన్ని రకాల ఉత్పత్తులు ఒక్కచోటే లభించేలా ఈ ఫెయిర్‌ ఏర్పాటు చేశామన్నారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top