You Are Here: Home » ఇతర » వెచ్చని వింటర్‌ ‘పార్టీ’

వెచ్చని వింటర్‌ ‘పార్టీ’

DS65చలి పెరగడంతో భాగ్యనగరంలో పార్టీల సందడి పెరిగింది. చలిగాలులతో సాయంత్రం సమయాల్లో యూత్‌ పబ్‌బాట పడుతున్నారు. ఈ పార్టీలకు ప్రముఖ సెలబ్రిటీలు హాజరవుతుండడంతో వెరెైటీగా కార్యక్రమాలు సాగుతున్నాయి. ఈ తరుణంలో నగరంలోని పబ్‌లలో పబ్‌లో నిర్వహిస్తున్న వింటర్‌ పార్టీలు యూత్‌లో కొత్త జోష్‌ తీసుకువస్తున్నాయి. దీంతో భాగ్యనగర పబ్‌లలో యువతరం సందడి పెరుగుతోంది. పార్టీలు, ఫంక్షన్లకు ఇవి వేదికగా మారుతున్నాయి. తమ ఆనందానికి అవధులుగా యువత వీటిని ఎంచుకుంటున్నాయి. వీకెండ్స్‌లో జంటనగరాల్లోని పబ్‌లు యూత్‌ జోష్‌తో సందడిగా మారుతున్నాయి. యువతీ, యువకులు తమ స్నేహితులు, సన్నిహితులతో సరదాగా గడుపుతూ డిజె సంగీతానికి లయబద్ధంగా చిందులు వేస్తూ ఆనందంగా గడుపుతున్నారు. నగరంలోని జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, బేగంపేట తదితర ప్రాంతాల్లోని క్లబ్‌లు యూత్‌జోష్‌తో సందడిగా మారాయి.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top