You Are Here: Home » ఇతర » వెండితెర సామ్రాజ్ఞి… మహానటి సావిత్రి

వెండితెర సామ్రాజ్ఞి… మహానటి సావిత్రి

సావిత్రిని, ఆమె పోషించిన పాత్రలను మరిచిపోవడం ఆయా సినిమాలను చూసిన ప్రేక్షకుల తరంకాదు. జగతి మరువలేని నటిసావిత్రి. అమె నటనాకౌశలం ఒక అపూర్వ గ్రంథాలయం. ఎన్ని తరాలు మారినా ఆమె జీవించిన చిత్ర రాజాలు ఆంధ్రుల మదిలో ఎన్నటికీ నిలిచే ఉంటాయి. ఆమెని తెలుగు చిత్ర రంగంలో తిరుగులేని నటీమణిగా నిలబెట్టాయి. పాత్రలో ఆమె ఒదిగిపోయినట్లు మరెవ్వరూ ఒదిగిపోలేరు. అందుకే నటీ శిరోమణి అయింది.

Savitriరంగస్థల నటిగా పేరు తెచ్చుకున్న సావిత్రి సినీనటిగా సక్సెస్‌ క్రమక్రమంగా వరించింది. ‘మిస్సమ్మ’ చిత్రంలో మొదట ఫిక్సయిన భానుమతి ఆ పాత్రను మిస్‌ చేసుకుంటే అది సావిత్రికి లభించడం, ఆ సినిమా చూసాక నేను మిస్‌ చేసుకున్నా, ఒక మంచి నటికి చక్కని అవకాశం లభించిందని భానుమతి అన్నారంటే అది ఆమె గొప్పదనమే కాదు…సావిత్రి నటనకు ఆమె ఇచ్చిన గౌరవం. తెలుగు,తమిళ భాషల్లో సమా నంగా పేరు తెచ్చుకున్న సావిత్రికి ఇతర భాషా చిత్రాల్లోనూ మంచిపేరు లభించింది. నిర్మాతగా, దర్శకురాలు గానూ రాణించింది. ఒళ్లు పెరిగినా, పెరిగిన ఆ ఒళ్ళుని కాకుండా ఆమె హావభావాలను చూడటానికే అభిమానులు మొగ్గు చూపేవారు. ‘‘మనంపోల మాంగల్యమ్‌’’ తమిళ సినిమాలో నటిస్తుండగా హీరో జెమినీ గణేష్‌తో ప్రేమ మత్తులో పడి వివాహం చేసుకుంది. కూతురు విజయ చాముండేశ్వరి, కొడుకు సతీష్‌లను చాలా క్రమశిక్షణతో పెంచారు. తెరపెైన, తెర వెనుక కూడా అనేక పాత్రలతో అశేష ప్రజానీకాన్ని అలరించిన సావిత్రి తెలుగు సినీ సామ్రాజ్ఞి. అందుకే సావిత్రి ఎప్పటికీ గొప్ప నటీమణి. మరుపురాని నటి సావిత్రి జయంతి నేడు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top