You Are Here: Home » చిన్నారి » వెంట్రుకలు ఏ పదార్ధంతో తయారవుతాయి?

వెంట్రుకలు ఏ పదార్ధంతో తయారవుతాయి?

మన శరీరంలో వెంట్రుకల ప్రాధాన్యత గురించి అందరికీ తెలుసు. వెంట్రుకల్లో పైకి కన్పించే భాగంలో నిర్జీవ కణజాలం ఉంటుంది. కెరాటీన్ అనే గట్టి ప్రోటీన్‌తో అవి నిర్మితమవుతాయి. కెరాటినైజేషన్ అనే ప్రక్రియలో వెంట్రుకలలో ఉండే కణాలు కేంద్రకాన్ని కోల్పోతాయి.

అందుకే వెంట్రుకల్లో జీవం ఉండదు. చర్మం నుంచి బయటకు వచ్చే వెంట్రుకలన్నీ నిర్జీవమైన ప్రోటిన్ పోగులే. వెంట్రుకల్లో నరాలు గాని నరాలకు సంబంధించిన కణాలు గాని ఉండవు. అందుకే వెంట్రుకలు కత్తిరించినా గానీ నొప్పి ఉండదు. అయితే చర్మం లోపల ఉండే వెంట్రుక మొదల్లు నరాలకు అంటుకొని ఉంటాయి. అందుకే అక్కడ జీవం ఉంటుంది. ఎవైరెెనా వెంట్రుకను గట్టిగా లాగితే నొప్పి పుట్టటానికి అదే కారణం.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top