You Are Here: Home » ఇతర » వృద్ధుల సరదా ‘పాటాభివందనం’

వృద్ధుల సరదా ‘పాటాభివందనం’

అంత్యాక్షరి పోటీలు సర్వసాధారణం. వృద్ధుల అంత్యాక్షరి పోటీ అసాధారణం. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని లాడ్జి కీస్‌ నంబర్‌ 297, ఫ్రీమేసన్స్‌ స్థానిక శాఖ, మోక్ష్‌ బాంక్వెట్స్‌ సంయుక్తంగా వృద్ధుల కోసం అరుదైన సరదా పోటీలను ‘పాటాభివందనం’ పేరుతో హైదరాబాద్‌లోని మోక్ష్‌హోటల్‌లో నిర్వహించారు. హైడోరైట్‌, ఆష్‌ మ్యూజిక్‌ ఫ్యాక్టరీ, జేసీఐ హైదరాబాద్‌, ఈ మర్చంట్స్‌, హైబిజ్‌ టీవీ, ఫిల్మ్‌ ఫ్లవర్‌ మీడియా, స్టార్స్‌ సంస్థల సహకారంతో ఈ వినూత్న కార్యక్రమానికి లాడ్జికీస్‌ శ్రీకారం చుట్టింది. ఈ సరదా కార్యక్రమంలో వృద్ధులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఈ అంత్యాక్షరిని అశ్విన్‌ పాలపర్ధి, ఆష్‌ మ్యూజిక్‌ ఫ్యాక్టరీకి చెందిన సంగీత దర్శకుడు, ప్రముఖ నగర ఘజల్‌ గాయకుడు ఖాన్‌ ఆలీఖాన్‌ జట్టుగా ఏర్పడి తెలుగు, ఇంగ్లీష్‌, హిందీ భాషల్లో నిర్వహించారు.
Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top