You Are Here: Home » చిన్నారి » వృక్షశాస్త్రాన్ని మొదట అధ్యయనం చేసింది ఎవరు?

వృక్షశాస్త్రాన్ని మొదట అధ్యయనం చేసింది ఎవరు?

శిలాజ వృక్షశాస్త్రాన్ని మన దేశంలో మొదట అధ్యయనం చేసింది బీర్బల్ సాహ్ని అనే శాస్త్రవేత్త . ఆయన 1891 నవంబర్ 14న పశ్చిమ పంజాబ్‌లోని భేరా అనే పట్టణంలో జన్మించారు.

అది ఇప్పుడు పాకిస్తాన్‌లో ఉంది. మొక్కల మీద ఆయనకు చెప్పలేనంత ప్రేమ. ఆ ఒక్క కారణమే ఆయనను వృక్షశాస్త్రం వైపు నడిపించింది. ఆయన అనేక కొత్త విషయాలు కనుగొన్నారు. బీహార్‌లోని రాజమహల్ కొండల్లో శిలాజ వృక్షసంపద గురించి పరిశోధనలు చేశారు. భారతదేశంలో గోండ్వానాలోని వృక్షజాతులపై అధ్యయనం చేసిన తొలి శాస్త్రవేత్త సాహ్ని. ఆయన పరిశోధన వల్ల కొన్ని వృక్ష వర్గాలను మళ్లీ వర్గీకరించారు. మూడురకాల కొత్త మొక్కలను కూడా బీర్బల్ కనుగొన్నారు. ఆయన పేరు మీద ‘బీర్బల్ సాహ్ని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పేలియో బాటనీ’ అనే పురావృక్ష శాస్త్ర సంస్థను లక్నోలో నెలకొల్పారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top