You Are Here: Home » ఇతర » వీణ పలికిన ‘భూ’పాల రాగం

వీణ పలికిన ‘భూ’పాల రాగం

వీణ అంటే…
01Col-Fవీణ.. తీగలు మీటుతూ సప్తస్వరాలు అందించే సంగీత వాయిద్యం. వీణ సరస్వతి హస్త భూషణం కాబట్టి సరస్వతీ వీణ అని కూడా అంటారు. వీణ ప్రముఖంగా కర్ణాటక సంగీత కచేరీలలో వినియోగిస్తారు. వీణలో ఏడు తంత్రులు ఉంటాయి. అనుమందరం, మందరం, మందర పంచకం, షడ్జమం అనే నాలుగు తంత్రులను వీణకు బిగిస్తారు. ప్రక్కన శృతితాళాలకు ఉపయుక్తంగా షడ్జమం, పంచమం, తారం అనే మూడు తంత్రులను బిగిస్తారు. వీణ వాయించేటప్పుడు కుడిచేత్తో మీటుతూ, దానికి అమర్చి ఉన్న 24 మెట్లు (రెండు స్థాయిలు) దానిలోని స్వరాలకు అనుగుణంగా ఎడమ చేతి వేళ్లతో మెట్టుమీద అదిమిపట్టి ఆయా స్వరాల్ని పలికించాల్సి ఉంటుంది.

తయారీ…
దీనిలో ముఖ్యంగా కుండ, దండి, యాళి (పౌరాణిక జంతువు మెడ ఆకారం), సొరకాయ బుర్ర అనే భాగాలుం టాయి. పనస చెట్టు నుంచి సంగ్రహిం చిన వీణ సారె వీణ తయారీలో ప్రధానమైన భాగం. ఇది తేలికగా ఉండటమే కాకుండా మంచి ప్రతిధ్వనిని కూడా పలికిస్తుంది. మంచి దృఎడత్వం, మన్నిక, తేమని తట్టుకోగలగడం మొదలైన లక్షణాలు కలిగి ఉండటం వల్ల దీన్ని విరివిగా వాడతారు. వీణను సాధారణంగా ఒకే కొయ్యతో తయారు చేస్తారు.
తంజావూరు వీణను నాలుగు అడుగుల పొడవుతో తయారుచేస్తారు. తేలికైన చెక్కతో వీణను చెక్కుతారు. దీనిపై పెయింట్‌ వేసి రంగులద్దుతారు. రకారకాల పువ్వులు, జంతువుల నమూనాతోనూ వీణలను తయారుచేస్తారు.

తంజావూరు వీణ
V-(15)ఒకప్పుడు తంజావూరులో సభలు జరగాలంటే వీణ సంగీతం తప్పనిసరి.నాడు అంతగా ప్రాచు ర్యంలో ఉండేది. అయితే రాను రాను నయం కాని అంటు రోగా లు ప్రబలడం, భూస్వామ్య విధానాల కారణంగా చాలామంది తయారీ దారులు, వాద్య కళాకారులు పొట్ట చేతపట్టుకుని నగర ప్రాంతాలకు వలస వచ్చారు. ప్రస్తుతం అతి కొద్ది మంది కళాకారులు మాత్రమే తంజావూరులో ఉన్నారు. పండుగ దినాల్లో నగరాలకు వెళ్లినవా రంతా వస్తే వారి ప్రధాన చర్చలో వీణల గురించి కూడా ఉండటం గమనార్హం. అప్పట్లో విశ్వకర్మలు ఒక తరం నుంచి మరో తరానికి వీణ తయారీ నేర్పించేవారు. వీణ కళాత్మకంగా చెక్కడంలో వీరిది అందెవేసిన చేయి. వీటిపైనే ఆధారపడి ఆ కుటుంబాలు ఆర్థికంగా బాగానే సాగేవి. అయితే ప్రస్తుత తరం ఉద్యోగాల బాట పట్టడంతో తయారు చేసేవారు తగ్గిపోయారు. ఇప్పుడక్కడ ేవలం పదుల సంఖ్యలో మాత్రమే తయారీదారులు ఉన్నారు.

తంజావూరు ఎక్కడ వుంది…
తంజావూరు దక్షిణ భారత దేశంలో తమిళనాడు రాష్ట్రంలోని ఒక పట్టణం. ఇది కావేరి నది దక్షిణ ఒడ్డున ఉన్నది. చెన్నై నుంచి 218 మైళ్ల దూరం ఉంటుంది. తంజావూరు జిల్లాకు ఈ పట్టణం రాజధాని. తంజావూరునకు ఈ పేరు తంజన్‌-అన్‌ అను రాక్షసుని నుండి వచ్చినది. ఈ రాక్షసుడిని శ్రీ ఆనందవల్లి అమ్మ, శ్రీ నీలమేగప్పెరుమాల్‌లు చంపారు. అనంతరం ఆ రాక్షసుని చివరి కోరికపై ఈ పట్టాణానికి తంజావూరు అని పేరు పెట్టినారు.

భౌగోళిక గురింపు….
V-(2)తమిళనాడు రాష్ట్రం తంజావూరు వీణ భౌగోళిక గుర్తింపు (జి.ఐ) కోసం దరఖాస్తు చేసుకుంది. ఓ సంగీత వాద్యానికి భౌగోళిక గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోవడం దేశంలో ఇదే మొదటిసారి. దీనిపై తంజావూరు వీణ తయారుచేసే కళాకారులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. గుర్తింపు వస్తే వీరికి సంతోషానికి అవధులే ఉండవు. ఉత్పత్తి, ఆ ప్రాంతానికి గల సంబంధం, ప్రత్యేక లక్షణాలు, కీర్తి, మూలం వీటన్నింటిని పరిశీలించి జిఐ రిజిస్ట్రేషన్‌ ఇస్తుంది. తంజావూరు మ్యూజికల్‌ ఇన్ట్రూమెంట్స్‌ వర్కర్స్‌ కో-ఆపరేటీవ్‌ కాటేజీ ఇండస్ట్రీయల్‌ సొసైటీ లిమిటెడ్‌ పేరు మీదు జి.ఐ. రిజిస్ట్రేషన్‌ ఇస్తారు. భౌగోళిక గుర్తింపు ద్వారా తంజావూరు వీణలు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్దికెక్కుతాయి. అదేవిధంగా తంజావూరు వీణ పేరును, ఖ్యాతి వేరే వారు వాడుకుంటే నేరం అవుతుంది.

పురాణాల్లో…
దేవుళ్లు కూడా వీణాగానామృతానికి మైమరచిపోతారు. అందుకే వీణ పురాణాల్లోనూ కీలక వాద్యంగా ఉంది. మహాభారత, రామాయణాల్లో చాలాచోట్ల ఈ వీణ ప్రస్తావన వస్తుంది. పురాతన కాలం నుంచి వీణల ప్రస్తావన ఉంది. సృష్టికర్త బ్రహ్మ భార్య, విజ్ఞానాన్ని ప్రసాదించే తల్లి సరస్వతి చేతిలో అలంకరణగా వీణ హిందువులకు సుపరిచితం. నారద మహాముని గానామృతానికి తోడ్పడే సంగీత పరికరం కూడా ఇదే.

మనరాష్ట్రంలో…
veenaఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా బొబ్బిలి వీణలను తయారు చేయడంలో ప్రసిద్ధి చెందింది. బొబ్బిలి సంస్థానాన్ని పెదరాయుడు 17వ శతాబ్దంలో స్థాపించాడు. అందరి ప్రభువుల్లాగే ఆయనకీ కళలంటే ఆసక్తి. మొదట్లో ఖాళీ సమయాల్లో వీణ వాయించేవారు. కానీ అతని కాలంలో రాచకార్యాల్లో వీణ వాయించడం విడదీయరాని భాగమైపోయింది. వీణను గొల్లపల్లికి చెందిన సర్వసిద్ధి వర్గానికి చెందిన కళాకారులు తయారు చేస్తే సంస్థానంలోని మహిళలు వీటిని వాయించేవారు. రాజులు వీటిని ఆంగ్లేయ సందర్శకులకు బహుమానంగా ఇచ్చేవాళ్ళు. కళాకారులను ఘనంగా సత్కరించేవాళ్లు. ఇక్కడ వీణలు తయారు చేస్తున్న వారు తరతరాలుగా వీరు వృత్తిగా కొనసాగిస్తున్నారు. అయితే ప్రస్తుతం వారి సంఖ్య నలబై మాత్రమే. అదేవిధంగా కృష్ణా జిల్లా నూజివీడు కూడా వీణలకు ప్రసిద్ధి. నేడు వీణ తయారీ అరకొరగానే సాగుతోంది.

వీణల్లో రకాలు…
V-(1)వీణలలో చాలా రకాలు ఉన్నాయి. తంజావూరు వీణలను పనస కర్రతో తయారుచేస్తారు. మైసూరులో నల్లకర్రతో తయారుచేస్తారు. కేరళలోని త్రివేండ్రంలో కూడా వీణలు తయారు చేస్తారు. వీటిలో ప్రధానంగా…

చిత్ర వీణ
హిందుస్తానీ సంగీతంలో ఈ వీణను ఉపయోగిస్తారు.

రుద్ర వీణ
విచిత్ర వీణ…ఈ వీణ పురాతన ఏక తంత్ర వీణకు ఆధునిక రూపం. సాధారణ సరస్వతీ వీణలో రెండు అసమానమైన తంబురలు ఉంటాయి, వాయించేటప్పుడు కుడి చెయ్యికి ఉండే తంబుర పెద్దదిగా, పైవైపుకి ఉండే తంబుర చిన్నదిగా ఉంటాయి. కానీ విచిత్ర వీణలో ఇందుకు భిన్నంగా రెండు తంబురలు సరిసమానంగా ఉంటాయి. వీణ రెండు కొనలు నెమలి ఆకృతిలో ఉంటాయి. పటారి మూడడుగుల పొడవు ఆరు అంగుళాల వెడల్పుగా ఉంటుంది.
సరస్వతీ వీణ..ఈ వీణను కర్ణాటక సంగీతంలో వినియోగిస్తారు.

Other News From

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top