You Are Here: Home » చిన్నారి » ‘విశ్వ’ సిద్ధాంతాలు

‘విశ్వ’ సిద్ధాంతాలు

భూమి మీద మానవుడు పుట్టిన నాటి నుంచి తన చుట్టూ ఉన్న వాటి గురించి, ప్రకృతికి సంబంధించిన విషయాల గురించి ఛేదించే ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నాడు. ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. శాస్తవ్రిజ్ఞానాన్ని పెంపొందించుకున్నాడు. ఇన్ని సాధించినప్పటికీ విశ్వం ఎంతవరకు వ్యాపించిందో ఇప్పటికీ తెలుసుకోలేక పోయాడు. అయినప్పటికీ నిరాశ చెందకుండా విశ్వరహస్యాలు ఛేదించటానికి ప్రయత్నాలు కొనసాగిస్త్తూనే ఉన్నాడు.

విశ్వ ఆవిర్భావం గురించి మొట్టమొదటగా క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దంలో తెలియచేసినవాడు టాలమీ. ఈజిప్టు భూగోళ శాస్తవ్రేత్త అయిన టాలమీ విశ్వానికి భూమి కేంద్రమని చెప్పాడు. భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఆ తర్వాత క్రీస్తు పూర్వం 1453లో పోలాండ్‌కు చెందిన కోపర్నికస్ ‘సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ విశ్వానికంతటికీ సూర్యుడు కేంద్రమని చెప్పాడు. ఆ తరవాత క్రీ.శ 17వ శతాబ్దంలో గెలీలియో టెలిస్కోప్ కనుగొనటంతో విశ్వ రహస్యాలు ఒక్కొక్కటి తెలిశాయి. దీనితో సౌరవ్యవస్థ విశ్వంలో ఒక భాగం అని తేలింది.

విశ్వ ఆవిర్భావం గురించి వచ్చిన సిద్ధాంతాల్లో జార్జ్ లెమాయిటర్ ప్రతిపాదించిన ‘బిగ్ బ్యాంగ్’ సిద్ధాంతం ప్రాచుర్యం పొందింది. తరవాత ఈ సిద్ధాంతంతో పాటు మరో రెండు సిద్ధాంతాలు అందుబాటులోకి వచ్చాయి. రెండో సిద్ధాంతం ప్రకారం 12బిలియన్ల సంవత్సరాల క్రితం విశ్వంలో సంభవించిన విస్ఫోటనం ఫలితంగా పదార్థం విశ్వమంతా వ్యాపించి ఇప్పటికీ కొనసాగుతోందని.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top