You Are Here: Home » సఖి » విశ్వ వొకివిఖ్యాత మహిళలు

విశ్వ వొకివిఖ్యాత మహిళలు

మనిషిగా పుట్టాక నాలుగు మంచి పనులు చేయాలంటారు. నాలుగంటే నాలుగు కాదు…నాలుగు కన్నా ఎక్కువ చేసినా ఎలాంటి సమస్య లేదు. కానీ ఎవరి మంచి కోసం ? ఈ ప్రశ్నకు సమాధానం చాలా ఈజీ. మనకోసం మనం కష్టపడటం స్వార్థం. నలుగురి మంచి కోసం కృషిచేయడం త్యాగం. ఇలాంటి త్యాగాలు చేసిన మంచి మనుషూలకు ప్రపంచం మెుత్తం హ్యాట్సాఫ్‌ అంటుంది. అలాంటి హ్యాట్సాఫ్‌కు అర్హత సాధించిన వారికి నోబెల్‌ ప్రైజ్‌ కూడా సలాం కొడుతుంది. రేడియంను కనుగొన్న మేరి క్యూరీ, లైబీరియా భవితను మార్చిన లైమా, ఆర్థిక సిద్ధాంతాల్ని ప్రతిపాదించే ఎలినార్‌లు నోబెల్‌ బహుమతి విజేతలు కావడంతో పాటు కోట్లాది మందికి ప్రేరణా శక్తిగా ఎదిగారు.

ప్రొఫైల్

పూర్తిపేరు		: లెమా బోవీ
జన్మస్థలం : లైబీరియా
జాతియత : లైబీరియా
వృత్తి : శాంతికోసం పాటుపడే
ఉద్యమకారిణి
ఉద్యమాలు : లైబీరియాలో శాంతిని స్థాపనకు
చేపట్టిన ఉద్యమం,
ప్రే ది డెవిల్‌ బ్యాక్‌ టు హెల్‌..

కీర్తి కిరీటం : నోబెల్‌ శాంతి బహుమతి-2011
శాంతి పురస్కారం : లెమా బోవీ
Unaప్రపంచం మొత్తం అభివృద్ధి మార్గంలో దూసుకువెళ్తుంటే.. ఆఫ్రికా దేశం ‘లైబీరియా’ 2005 వరకు కూడా చీకటిలో వెంపర్లాడుతూనే ఉంది. ఎటుచూసినా అంధకారం. రోజు ఉదయించే సౌర్యుడికి సైతం లైబీరియాకు వెలుగునివ్వడం కష్టంగా అనిపించింది. మధ్యాహ్నం ఎండలు ఎంతగా మంటలను సృష్టిస్తాయో అంతకంటే భారీ జ్వాలలతో లైబీరియా ప్రజలు మండుతున్నారు. అది 1999. దేశాధ్యక్షడు శామ్యుల్‌ చీకటి రాజ్యాన్ని స్థాపించి అందులో తాను సృష్టించిన నల్లమందనే పదార్థంతో ప్రజల జీవితాలని కాల్చివేయాలని ప్రయత్నిస్తున్నాడు. స్వేచ్ఛలేక ప్రజలు అల్లాడుతున్నారు. పురుషులు అత్యాచారాలతో మహిళలు బిక్కుబిక్కు మంటున్నారు.

దేశ యువత పెడధారిన సాగుతోంది.అలాంటి పరిస్థితుల్లో చార్లెస్‌ టేలర్‌ తిరుగుబాటు ప్రారంభించి 1997లో అధ్యక్షుడయ్యాడు. దేశంలో పండగ వాతావరణం నెలకొంది. కానీ చార్లెస్‌ వచ్చినా మారణ హోమం ఆగలేదు. ఇదంతా గమనిస్తోన్న లెమా బోవీ మార్పురావాలంటే మహిళలు ముందుకు కదలాల్సిందే అని నిర్ణయించుకున్నారు.మహిళలలో చైతన్యం కలిగించి వారిని ఉద్యమబాటలో పయనించేలా దిశానిర్దేశం చేసి సమస్యను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారు.. 2005లో ఎన్నికలు జరిగాయి. అందులో పోటీలో గెలిచిన సర్‌లీఫ్‌ తొలి మహిళా అధ్యక్షులయ్యారు.

ప్రొఫైల్

పూర్తి పేరు 	: మేరీ క్యూరీ
పుట్టిన తేది : 7 నవంబర్‌,1867
జన్మస్థలం : వార్సా, పోలాండ్‌ రాజ్యంలో
విద్యాభ్యాసం : ప్యారిస్‌ విశ్వవిద్యాలయంలో
భర్త : పియెరీ క్యూరీ
వృత్తి : భౌతిక, రసాయనిక శాస్తవ్రేత్త
కీర్తి : రేడియో యాక్టివిటీ,
ఎక్స్‌రేను కనుక్కోవడం
అవార్డులు : నోబెల్‌ బహుమతి (2 సార్లు)

ఫిజిక్స్‌ : మేరి క్యూరి
Marieరేడియోయాక్టివిటి (రేడియోధార్మికత) అనే పదాన్ని సృష్టించిన మేరి రేడియోయాక్టివిటి వల్ల మానవ శరిరంలోని కణాలకు కలిగే ప్రమాదరం తీవ్రమై నదని.. కణాలను హతమార్చే శక్తి వాటికి ఉందని నిరూపించింది. ఆమె ప్రయోగాల ఫలితంగా భౌతిక శాస్తవ్రేత్తలు ట్యూమర్‌ సెల్స్‌ను నాశనం చేయడానికి రేడియేషన్‌ను ఉపయోగించవచ్చని నిరూపించింది. అంతే కాకుండా ఎక్స్‌రే యంత్రం కూడా మెరీ క్యూరీ ఆలోచనల నుంచే పుట్టింది. ఆమె ఆవిష్కరణలు ఆమెను అనంతమైన సంపదను తెస్తాయని తెలిసినా వాటిని పెటెంట్‌ హక్కులను సొంతం చేసుకోవడానికి ప్రయత్నిం చలేదు.

దురాశ, అవినీతికి లొంగని వ్యక్తులలో మేరీ క్యూరీ ఒకరు అని సాపేక్ష సిద్ధాంత కర్త ఐన్‌స్టీన్‌ అభివర్ణించారు. శాస్తవ్రైజ్ఞానిక పరిశోధనలోనే ఒక కీలకమైన మలుపుగా చెప్పుకోవచ్చు. రేడియంను కనుగొన్న మేరీ క్యూరీ కృషికి ఫలితంగా ఆమెకు రెండు నోబెల్‌ అవార్డులు వరించాయి. రెండుసార్లు నోబెల్‌ తీసుకున్న తొలి వ్యక్తి మేరీ కావడం విశేషం

ప్రొఫైల్

పూర్తి పేరు 	: ఎలినార్‌ ఆస్ట్రామ్‌
పుట్టిన తేది : 1933 ఆగస్టు 7
జన్మస్థలం : లాస్‌ యాంజిలస్‌, కాలిఫోర్నియా
విద్యాభ్యాసం : కాలిఫోర్నియా
విశ్వవిద్యాయం నుంచి
వృతి : ఆర్థిక వేత్త
రంగం : పబ్లిక్‌ ఎకనామిక్స్‌, పబ్లిక్‌ చాయిస్‌
కీర్తి : ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌
అందుకున్న తొలి వనిత
అర్థశాస్త్రం : ఎలినార్‌ ఆస్ట్రామ్‌

Elinorకాలిఫోర్నియాలో 1977 ఆగస్టు 7న ఎలినార్‌ క్లెయిర్‌ ఆస్ట్రామ్‌గా జన్మించిన ఎలినార్‌ అమెరికాలో రాజకీయ అర్థిక వేత్తగా ప్రసిద్ధి గాంచారు. ప్రజా జీవితంలో, ప్రభుత్వ విధానాలలో అర్థశాస్త్రం ప్రాధాన్యతను తెలియజేసినందుకు ఆమెకు 2009లో నోబెల్‌ ప్రైజ్‌ వరించింది. ఈ ఘనతను సాధించిన తొలి వనిత ఎలినార్‌ ఆస్ట్రామ్‌.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top