You Are Here: Home » యాత్ర » దర్శనీయ ప్రదేశాలు » వివేకం నడయాడిన చోటు

వివేకం నడయాడిన చోటు

కలకత్తా మహానగరంలో విశ్వనాథదత్తు సుప్రసిద్ధమైన న్యాయవాది. ఆయన భార్య భువనేశ్వరీదేవి. వారికి సంతానం లేకపోవడంతో భువనేశ్వరీదేవి కాశీకి వెళ్లి అక్కడి వీరేశ్వర శివుడిని ప్రార్థించింది. ఆమె ప్రార్థన ఫలించింది. క్రీ.శ. 1863, జనవరి 12వ తేదీ. ఆనాడు సంక్రాంతి. ఆ రోజు ఆ ఇంట పండంటి మగబిడ్డ పుట్టాడు. విశాలమైన కళ్లు, ముఖంలో వింత అందాలొలికిస్తున్న చిరునవ్వు. ఆయనే వివేకానందుడు.పెరిగి పెద్దరుున నరేద్రుడే వివేకానందుడు. తరువాత సన్యసించి స్వామీజీగా పిలువబడ్డారు వివేకానందులవారు. స్వామీ వివేకానంద భారతదేశం లోని పుణ్యక్షేత్రాలన్నీ దర్శించాలనీ, ఆయా ప్రాంతాల ప్రజల జీవన విధానం తెలుసుకోవాలని దేశ యాత్రను కాలినడన సాగించారు. అలా ఆయన కాశీనుండి బొంబారుు, పూనా, బెంగళూరు, మైసూరు, కొచ్చిన్‌ తిరువనంతపురం మీదుగా కన్యాకుమారి చేరుకున్నారు. తరువాత ఆయన విదేశీ పర్యటనకూడా చేశారు.

అక్కడి నుండి వచ్చిన స్వామిజీ క్రీ.శ. 1897 జనవరి 15వతేదీన కొలంబో రేవుకు చేరుకున్నారు. కొలంబో నుంచి యాళ్‌పాణం , అక్కడి నుండి చిన్న ఒడలో పంబన్‌కు వచ్చి అక్కడ రామనాథపురం పాలకుడైన భాస్కర సేతుపతిని కలిశారు స్వామీజీ. అక్కడి నుంచి రామేశ్వరం వెళ్లి శివుని దర్శనం చేసుకున్నారు. అక్కడినుండి రామనాథపురం, మానామధురై, మధురై, కుంభకోణం మీదుగా స్వామీజీ మద్రాసు చేరుకన్నారు. కలకత్తాలోని బేలూరుమఠంకు క్రీ.శ. 1901వ సంవత్సరంలో వెళ్లిపోయారు. ఆయన పుట్టి 150 సంవత్సరాలరుు్యంది. ఆ సందర్భంగా ఆ మహామనిషి దర్శించిన కొన్ని పుణ్యక్షేత్రాలను ఈనాటి ‘విహా రి’లో ఇస్తున్నాం.
బేలూరు మఠం
Bww1991లో హిమాలయాలు, అస్సాం, తూర్పు బెంగాలులో స్వామీ వివేకానంద పర్యటించారు. 1992లో బుద్ధగయ, వారణాసిలో గడిపి వచ్చిన స్వామీజీ కలకత్తాలోని బేలూరు మఠంకు చేరుకున్నారు. ఈ మఠం హుగ్లీ నదికి పశ్చిమాన హేరా జిల్లాలో ఉంది. 1898, డిసెంబరు 9న తన గురుదేవులు శ్రీరామకృష్ణ పరమ హంసకు ప్రేమపూర్వకంగా స్వామీ వివేకానందుడు స్థాపించాడు. అన్ని మతాలకు వేదికగా ఉండాలని ఆయన విశ్వసించి దీన్ని నిర్మింపజేశాడు. కలకత్తాకు చేరువలో గంగానదికి పడమటి తీరాన ఉన్న చిన్నగ్రామమే బేలూరు. ఈ మఠం శాఖలు తరువాత దేశ వ్యాపితంగా ఉన్నాయి. ఈ బేలూరుమఠనిర్మాణం చాల అద్భుతంగా ఉంటుంది. ఏకోషం నుండి చూసినా ఈ మఠం నిర్మాణం హిందూ, ముస్లిం, క్రిష్టియన్‌ మతాల దేవాలయాలుగా కలిసి మనకు గోచరిస్తాయి.

ఈ మఠం ప్రధాన ద్వారంలోకి అడుగు పెట్టగానే స్వామి రామకృష్ణ పరమహంస, శారదామాత మందిరం దర్శనమిస్తుంది. ఇక్కడ శ్రీరామకృష్ణ మ్యూజియం కూడా ఉంది. తన చివరి కాలమంతా స్వామీ వివేకా నంద ఈ మఠంలోనే గడిపారు. చిరిగిపోయిన బట్టలా తన దేహాన్ని విడిచి భగవత్సన్నిధానాన్ని చేరుకో వాలని స్వామీజీ సంకల్పించారు. క్రీ.శ. 1902లో దేవాలయంలో హారతి ముగిసిన వేళ స్వామీజీ తన గదిలో ధ్యాన నిమగ్నులై ఉన్నారు. స్వామి తనకున్న యోగబలంతో, ఇచ్ఛా మరణ వరంతో శరీరమంతా నిండి ఉన్న ప్రాణాన్ని వదిలి దేహాన్ని విడిచారు.

బేలూరు మఠంలో ఆ గది నేటికీ ఆయన స్మృతి చిహ్నంగా ఉంచబడింది. గంగ ఒడ్డున వారి భౌతికకాయా నికి దహన సంస్కారాలు జరిపిన పిమ్మట ఆ చోటనే వివేకానంద స్వామీజీకి ఒక చక్కని దేవాలయంను నిర్మించారు. స్వామివంటి మహా యోగిని, ధర్మోద్ధారకుడిని, కారణజన్ముడిని కన్న భరతమాత ధన్యురాలు. యోగ వేదాంత విజ్ఞానాన్ని తాను ఆచరించి, సాధించి, ఇతరులకు ప్రబోధించి పవిత్రమైన ధన్యమైన జీవితాన్ని గడిపి మన మతం నిజమైన త్వత్వాన్ని మన కళ్లెదుటే నిలిపిన దివ్యమూర్తి స్వామీ వివేకానంద.

కాశీ
K888వారణాశి నగరం పేరు మన పురాణ ఇతిహాసాల్లో వస్తుంది. ఈ నగరాన్ని అవిముక్తక, ఆనందకానన, మహాశ్మశాన, సురదాన, బ్రహ్మవర్థ, సుదర్శన, కాశీ అని వివిధ నామాలతో పిలిచేవారు. కాశీ పావనగంగా తీరంలోని గంగకు ఉప నదులైన ‘వరుణ-అసి’ నదుల మధ్య వొద్దికగా అమరి ఉన్న అమరథామమే వారణాశి లేక కాశీ. మన హైందవ సంస్కృతిలో ఈ నగర ప్రస్తావన ఉంది. సుమారు నాలుగువేల సంవత్సరాల క్రితమే ఈ కాశీనగరం ఉందని తెలుస్తోంది. అందుకే కాశీ నగరం అతి ప్రాచీన నగరం.‘కాశ్యాస్తు మరణాస్‌ ముక్తిః’ అంటారు. అంటే ‘కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంద’ని హిందువులు విశ్వసిస్తారు. ఇక్కడ విశ్వేశ్వర లింగం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి.

ఈ కాశీనగరం హిందువులకే కాదు జైనులకు, బౌద్ధులకు కూడా పుణ్యక్షేత్రమే. అందుకే ప్రపంచంలోనే అవిచ్ఛన్నంగా జనావాసం ఉన్న అతి పురాతన నగరం కాశీ అంటారు. వారణాశి అనగానే మనకు గంగా నది, పరిఢవిల్లిన హిందూమతం, హిందూస్థానీ సంగీతం, పట్టువస్త్రాల నేత, హిందీ, సంస్కృత పండితుల పీఠం మనకు గుర్తుకు వస్తాయి. ఇవన్నీ ఈ నగర సంస్కృతీ చిహ్నాలు. ఎందరో పౌరాణిక, చారిత్రిక, సాంస్కృతిక ప్రముఖులకు ఈ నగరం, పరిసర ప్రాంతాలతో అనుబంధం ఉంది. వారిలో హరిశ్ఛంద్రుడు, గౌతమ బుద్ధుడు, వేదవ్యాసుడు , తులసీదాస్‌, శంకరాచార్యుడు, కబీర్‌దాస్‌, ప్రేమ్‌చంద్‌, పండిట్‌ రవిశంకర్‌, బిస్మిల్లాఖాన్‌ తదితరులు ఇక్కడివారే.

ఇక్కడ అన్నపూర్ణాదేవి, విశాలాక్షి, విశ్వేర మందిరాలున్నాయి. అవేకాక వారాహీ మాత, సంకటమోచన, తులసీమానస మందిరం, కాలభైరవ, దుర్గామాత, భరతమాత మందిరాలున్నాయి. అందుకే కాశీనగరాన్ని మందిరాల నగరిగా పేరు.అయితే హిందూ మతంలోఉన్న ప్రాధాన్యత వలన ఇక్కడ గంగానది, స్నాఘట్టాలు , దేవాలయాలు, హిందూమత సంస్థలు, సంస్కృతీ చిహ్నాలుగా వెలిశాయి. కాశీవచ్చిన యాత్రికులు గంగా నదిలో స్నానం చేసి కాశీ విశ్వేశ్వరుని, అన్నపూర్ణ ను, ఇతర దేవుళ్లను దర్శించుకుంటారు. అందుకు ఇక్కడ గంగమ్మ ఒడ్డున దాదాపు 100 స్నాన ఘట్టాలున్నాయి. ఈ స్నాన ఘట్టాలను ఆనాడు పరిపాలకులైన మరాఠారాజుల పరిపాలనలో ఎక్కువగా అభివృద్ధి చేశారు. ఇంకా 1916లో మదన్‌మోహన్‌ మాలవ్య స్థాపించిన ప్రముఖ ప్రాచీన విశ్వవిద్యాలయం ‘కాశీ హిందూ విశ్వవిద్యాలయం’కూడా ఇక్కడే ఉంది.

కన్యాకుమారి
K77భారత ద్వీపకల్పానికి దక్షిణదిక్కున ఉన్న చిట్టచివరి ప్రదేశం కన్యాకుమారి. ఇది తమిళనాడు రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశమేకాదు, పడమటి కనుమలలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ప్రదేశం. ఈ ప్రదేశంలో తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియా సముద్రం, దక్షిణాన హిందూమహా సముద్రం ఉన్నాయి. ఈ మూడు సముద్రాలు కలిసిన ప్రాంతంగా ఈ నగరం ప్రసిద్ధి. ఇక్కడ దేవత ‘పార్వతి’. హిదువులకు పరమ పవిత్ర స్థలం. ఇక్కడ ప్రతి సంవత్సరం వచ్చే ‘చైత్రపౌర్ణమి’ రోజున అనగా తమిళ క్యాలండర్‌ ప్రకారం వచ్చే ఏప్రిల్‌ మాసంలో యాత్రికులు ఇక్కడికి వచ్చి సముద్ర స్నానాలు చేసి ఇక్కడి అమ్మవారు పార్వతా దేవిని అనగా కన్యాకుమారిని దర్శించుకుంటారు.

ఈపౌర్ణమి రోజున కన్యాకుమారి సముద్రపు ఒడ్డున జరిగే అద్భుతం తప్పకుండా చూడాల్సిందే. చూసి తరించాల్సిందే. అంత అద్భుతం జరుగుతుంది. ఆ రోజు సూర్యుడు పశ్చిమాన అస్తమిస్తూ సముద్ర గర్భంలోకి వెళ్లడం, అలాగే తూర్పున చంద్రుడు ఉదయించడంగానీ గమనిస్తే అద్భుతమనిపిస్తుంది. ఈ రెండు సూర్య, చంద్ర బింబాలను చూస్తూ ఏ బింబం ఎవరిదో తెలుసుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తాయి. పక్కపక్కనే ఎర్రటి బింబాలను కొద్దిగా కళ్లు మాత్రం తిప్పుతూ ఒకేసారి రెండు బింబాలను చూడడం అద్భుతమనిపిస్తుంది. ఈ దృశ్యాన్ని కన్యాకుమారికి వచ్చిన యాత్రికులంతా చూసి తరిస్తారు. ఈ అందం, ఈ అద్భుతం ప్రకృతి మనకు ఇచ్చిన వరంమనే చెప్పాలి. ఈ దృశ్యాన్ని చూసిన అనంతరం ఆ ప్రకృతి మాతకు శిరసు వంచి తప్పక నమస్కరిస్తాం.

ఈ దృశాన్ని చూసేలా ఇక్కడ వివిధ లాడ్జీలు తమ భవనాలను కడతారు. అలాగే సూర్యోదయ, సూర్యాస్త మయాలను కూడా మా హోటలు గది నుండే దర్శించుకోవచ్చని యాత్రికులకు చెప్తారు. సముద్రపు ఒడ్డు నుండి సముద్రంలోకి 400 మీటర్ల దూరంలో రెండు పెద్ద రాతి బండలు కన్పిస్తాయి. స్వామీ వివేకానంద ఫిబ్రవరి 24, 1892న మూడు సముద్రాలను ఈదుకుంటూ వెళ్లి ఈ బండలలో ఒక దానిపై ధ్యానం చేశారట. 1893న చికాగో నగరంలో జరిగిన సర్వ మత సమావేశానికి వెళ్లేముందు స్వామీ వివేకానంద ఇక్కడ ఉన్నంత కాలం ఈ బండమీదే ధ్యానం చేసేవారుట. ఆయన పేరు మీద ఇక్కడే 1970 ప్రాంతంలో ‘వివేకానంద రాక్‌ మెమోరియల్‌’ అనే స్మారక భవనం ఆ బండమీద కట్టారు.

ఈ కొండమీదకు చేరాలంటే త్రివేణీ సంగమమైన మూడు సముద్రాల అలలమీగా ఈదుకుంటూ వెళ్లాలి. అలా స్వామీ వివేకానంద ఈదుకుంటూ వెళ్లి అక్కడే ధ్యానం చేసేవారు. ఆయనకు గుర్తుగా ఇక్కడ ఓ ధ్యాన కేంద్రాన్ని తరువాత నెలకొల్పారు. ప్రస్తుతం అక్కడ మనం చూడాలంటే చిన్న పడవ మీద పూర్తిగా భారత రక్షణదళ సభ్యులు మనల్ని జాగ్రత్తగా రాక్‌ ఒడ్డుకు తీసుకెళ్తారు. మళ్లీ మనం వచ్చేటపుడు ఆ కొండ కిందికి వస్తే అంతే జాగ్రత్తగా భూభాగానికి తెస్తారు. ఆ కొండ పక్కనే రెండవ కొండమీద 2000 వ సంవత్సరంలో ప్రఖ్యాత తమిళ కవి ‘తిరువళ్లువార్‌ విగ్రహాన్ని తమిళనాడు ప్రభుత్వం నిర్మించింది. ఈ విగ్రహం ఎత్తు 133 అడుగులు. ఈ విగ్రహం ఆశియాలోనే అత్యంత ఎతె్తైన విగ్రహంగా పేరు పొందింది. అలాగే స్వాతంత్య్ర ఉద్యమ సందర్భంగా గాంధీజీ ఈ కన్యాకుమారికి వచ్చి ఉపన్యసించారని దానికి గుర్తుగా ఇక్కడ ‘గాంధీ భవనం’ కూడా కట్టారు.
ఇలా వెళ్లాలి : కన్యాకుమారికి దేశం నలుమూలల నుండి రైళ్లు అందుబాటులో ఉన్నాయి..

రామేశ్వరం
R-(1)రామేశ్వరం సముద్ర మట్టానికి 10 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక ద్వీపము. ఈ ప్రధాన భూభాగం నుండి ‘పంబన్‌ కాలువ’ రామేశ్వరాన్ని వేరు చేస్తుంది. హిందువులకు కాశీ అంటే ఎంత ఇష్టమో అంతే ఇష్టం రామేశ్వరం అంటే కూడా. చాలా మంది హిందువులు కాశీయాత్ర చేశాక రామేశ్వరం చూసాక కానీ తమ యాత్ర సంపూర్ణంకాదని విశ్వసిస్తారు. అంతేకాదు కాశీలోని గంగానది నుండి తీర్థం తెచ్చి ఇక్కడి రామేశ్వ రంలోని సముద్రంలో కలిపితేనే కాశీయాత్ర పూర్తవుతుందని భావిస్తారు. భారతదేశంలోని సకల తీర్థాలను దర్శించిన పుణ్యం ఈ ఒక్క రామేశ్వర యాత్ర చేస్తేనే కలుగుతుందని హిందువుల నమ్మకం. రామేశ్వరం శైవులకు, వైష్ణవులకు పవిత్ర స్థలం. ఇక్కడి దేవడు శ్రీకృతకృత్య రామలింగేశ్వర స్వామి. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి ఈ రామేశ్వరం. ఈ గుడిని 10వ శతాబ్దంలో శ్రీలంక చక్రవర్తి పరాక్రమబాహు కట్టించినట్టు చరిత్రద్వారా తెలుస్తోంది.

ఇక్కడి స్వామి సైకత లింగాన్ని శ్రీరాముడు ప్రతిష్ఠించినట్లు మన రామాయణగాథలో ప్రస్తావన వస్తుంది. రావణుడు సీతను తీసుకెళ్లడం, సీతకోసం రాముడు రావణాసురుడిని చంపిన పిదప సీతను తెచ్చినట్లు మనకు రామాయణ కథ. రావణుడు బ్రహ్మ మనుమడు. అనగా బ్రాహ్మణుడు. ఆయనను చంపినందున బ్రహ్మహత్యా పాతకం వస్తుందని, దానికి పరిహారంగా శివలింగ ప్రతిష్ఠ చేయాలని మునులు సలహా ఇవ్వగా సీత సైకత లింగాన్ని తయారు చేయగా ఆ లింగాన్ని రాముడు ప్రతిష్ఠించినట్లు రామాయణంలో ఉంది. ఆ ప్రదేశమే ఈ రామేశ్వరం. రాముడు ప్రతిష్ఠించిన లింగం కావున ఇక్కడి శివుడిని రామలింగేశ్వర స్వామిగా పిలుస్తారు. ఇక్కడ సముద్రాన్ని అగ్ని తీర్థంగా పిలుస్తారు. ఈ అగ్ని తీర్థంలో స్నానమాడి రామలింగేశ్వర స్వామిని భక్తులు, యాత్రికులు దర్శించు కుంటారు. ఇక్కడే మన మాజీ రాష్టప్రతి అబ్దు కలాం ఇల్లు కూడా ఉంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top