You Are Here: Home » ఇతర » వివాద బంధం

వివాద బంధం

వచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ ముందుకు దూసుకుపోతున్న కొందరు మహిళలు వివాదాల్లో కూడా తమ ప్రత్యేకతని నిరూపించుకుంటున్నారు. సాధరణంగా ఒక స్థారుుకి చేరిన వ్యక్తులు అన్ని రంగాల్లోను ఏదో ఒక వివాదానికి కారణం అవుతూనే ఉంటారు. ఈ నేపథ్యంలో వ్యక్తిగత విషయాల తెరమీదకి వచ్చి, అసలు విషయం కన్నా వ్యక్తిగత విషయాలు, వ్యక్తిగత దూషణలు ఎక్కువ చోటు చేసుకుంటారుు. అవే ప్రజల దృష్టిని మరింతగా ఆకర్షిస్తారుు. ఇందులో మహిళా ప్రముఖులకు కూడా మినహారుుంపు ఉండదు. నిన్నా మెున్న తాజాగా వివాదాల్లో చిక్కుకుని మాటల తూటాలతో ఇప్పుదు అందరి దృష్టినీ తనవైపునకు తిప్పుకున్న ప్రముఖ మహిళ సునందా పుష్కర్‌. అందానికి అందం, డబ్బుకి డబ్బు, హోదాకి హోదా అన్నీ కలబోసిన రూపం సునందా పుష్కర్‌ది.

Unt6ఈమె ఒక మెడల్‌గా, వ్యాపార మహిళగా ఎంతో ఖ్యాతి గడించింది. సునంద కాశ్మీర్‌ లోయల్లో బొమ్మాక్‌కి 8కి.మీలలో ఉన్న సోపోరి అనే ప్రాంతానికి చెందిన మహిళ. ఈమె తండ్రి సైనిక దళంలో లెఫ్టినెంట్‌ కల్నల్‌. దుబాయ్‌కి చెందిన టెమ్‌కో అనే రియల్‌ ఎస్టేట్‌ కంపెనీకి సేల్స్‌ విభాగానికి కార్యదర్శిగా పని చేసింది. తన 40వ ఏట దుబాయ్‌లో ‘స్మా’ కేంద్రాన్ని నడిపిం ది. అలాగే ఎమిరేట్స్‌ ప్రభుత్వం నిర్వ హించే మౌలిక సదుపాయాల నిర్మాణ సం స్థ (ఇన్‌ఫ్రాస్టక్చర్‌ కంపెనీ)కు కార్యనిర్వాహకురాలిగా కూడా నియమితురాల య్యింది. అదే విధంగా వ్యాపార ప్రకటన సంస్థల్లో, ట్రావెల్‌ ఏజన్నీలోనే కాకుం డా టొరంటోలోని ఐటీ కంపెనీల్లో కూడా కార్యనిర్వాహకురాలిగా పనిచేసింది. కొచ్చీ ఐపీఎల్‌ వివాదానికి ఈమెనే ముఖ్య బిందువు. ఈ వ్యవహారంలో 70 కోట్ల రూపాయల స్కాం జరిగినట్టు ఆరోపణలు ఎదుర్కొంది.

2010లో ఈమె 70 కోట్ల అంచనాకి స్వచ్చందంగా ఐపిఎల్‌ టీం వాటాను అమేసిందనే వివాదంలో చిక్కు కుంది. ఆతరువాత ఈమె ప్రస్తుత కాంగ్రెస్‌ కేంద్ర మంత్రి శశిథరూర్‌ని మూడవ వివాహం చేసుకున్న ఇల్లాలు. ఈమె మొదట కాశ్మీర్‌కి చెందిన సంజయ్‌ రైనా అనే లతనిని వివాహమాడింది. కారణాంతరాల వల్ల అతనికి విడాకులిచ్చి, కేరళాకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సుజిత్‌ మీనన్‌ని వివాహమాడింది. మీనన్‌ 1997లో రోడ్డు ప్రమాదంలో మరణించాడు. సునందకి శివ మీనన్‌ అనే 20 ఏళ్ళ కుమారుడు కూడా ఉన్నాడు. ఇప్పుడు 54 ఏళ్ళ శశిథరూర్‌ని ఎంతో వైభవంగా వివాహం చేసుకుంది. ఈ వివాహానికి ఎల్‌.కె అధ్వానీ, అరున్‌ జైట్లీ, వంటి ప్రముఖ బీజేపీ నేతలతో పాటు చెనా, పాకిస్తాన్‌ నుండి కూడా ప్రముఖులు హాజరయ్యారు. ఆగస్ట్‌ 22న వీరి వివాహం కేరళలో పాలక్కడ్‌లో అత్యంత వైభవంగా జరిగింది.

సంసారంలో సరిగమలు..
Untitl5శశిథరూర్‌కి సునందా పుష్కర్‌ ఒకప్పుడు ప్రియురాలిగా ఉండి, అర్ధాంగి అయినంత వరకూ ఈమె వల్ల థరూర్‌ అనేక వివాదాల్లో చిక్కుకుని సతమతం అవుతూనే ఉన్నాడు. ముఖ్యంగా కాసుల వర్షం కురిపించే ఇందియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ కొచ్చీ టీమ్‌ క్రికెట్‌ మ్యాచ్‌ జరుగుతున్న సందర్భంలో జరిగిన లావాదేవీల్లో సునంద 50 కోట్లు డిమాండ్‌ చేసిందని ఒక వివాదం గాలిదు మారంలా లేచింది. అది ఎంతవరకూ పోయిందంటే, ఆ వివాదం కారణంగా శశిథరూర్‌ పదవి పోయింది. అయితే ఇప్పటికీ సునంద ఆ వివాదానికి కారణం తను కాదనీ, కొచ్చీ టీమ్‌ అబాసుపాలు కావడానికి అధికార యంత్రాంగం అవగాహనా రాహిత్యమే కారణం అని అంటోంది. ఐపీఎల్‌ క్రికెట్‌ను కేరళాకు తీసుకు వెళ్ళాలనుకున్న ఈమె ప్రయత్నం మీద కొందరు బురద జల్లారని అందువల్ల తానే ఎక్కువగా నష్టపోయానని అంటోంది.

గత రెండు సంవత్సరాలుగా వివాదాల్లోకి, వార్తల్లోకి రాని శశి థరూర్‌ మళ్ళీ సోనియా గాంధీ అభయ హస్తంతో మంత్రి పదవి చేపట్టడంతో వివాదాలు మొదలయ్యాయి. మానవ వనరుల సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన థరూర్‌ మీద నరేంద్ర మోడీ వ్యంగ్యాస్త్రాలు ప్రయోగించిన విషయం దేశవ్యాప్తంగా సంచలనం పుట్టించాయన్న విషయం అందరికీ విదితమే. హిమాచల్‌ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న మోడీ 50 కోట్ల గర్ల్‌ ఫ్రండ్‌ని చూసారా అంటూ సునందా పుష్కర్‌ని ఉద్దేసించి చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. అంతటితో థరూర్‌ ఊరుకుంటాడా, ఎవరె్నైనా ప్రేమిస్తేనే కదా ఆ విలువ తెలిసేది. ఈ బ్రహ్మచారికేం తెలుసు అంటూ రిటార్ట్‌ ఇచ్చాడు. సరే వీరి వివాదాలు ఎలావున్నా ఈ మాటల వెనుక ఒక ఆడది ఉన్నదన్న మాట వాస్తవం.

ఇక మొన్న సోమవారం నాడు కొత్త భర్త థరూర్‌తో కలిసి పుష్కర్‌ తిరువానంతపూర్‌కు చేరుకుంది. వీరికి స్వాగతం పలకడానికి వందల సంఖ్యంలో అభిమానులు చేరుకున్నారు. అక్కడ విమాశ్రయం బయట ఒక 19 సంవత్సరాల యువకుడు సునందతో అనుచితంగా ప్రవర్తించాడు. అంతే సునంద కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తరువాత ఆ యువకుడు క్షమాపణ చెప్పడంతో ఆమె శాంతించి ఈ వివాదం సద్దు మణిగింది. అసలే మోడీ వ్యాఖ్యలకి మహిళా సంఘాలన్నీ ఉద్యమిస్తున్న తరుణంలో కేరళలో కూడా అదే వాతావరణం నెలకొంది.

725దానికి తోడు ఈ కుర్రాడు చేసిన చిలిపి పనికి అగ్నిలో ఆజ్యం పోసినట్టు అయ్యింది. శశిధరూర్‌ సొంతనియోజక వర్గానికి వచ్చిన సందర్భంలో కాంగ్రెస్‌ కార్యకర్త చెంప చెళ్ళుమనిపించినందుకు మరో వివాదం తలెత్తింది. ఇలా ఒకదాని వెనుక మరో వివాదం తలెత్తడంతో సునంద, అందరూ కలిసి తమనే ఎంరుకు టార్గెట్‌ చేస్తున్నారో అర్ధంకాక తలపట్టుకుంటోంది. ఒక ప్రముఖ మోడల్‌గా, రచయిత్రిగా, వ్యాపార దక్షత కలిగిన వ్యక్తిగా ఎంతో ఎత్తుకు ఎదిగిన సునందా పుష్కర్‌ అనేక వివాదాలకి నిలయంగా నిలిచింది. అయినప్పటికీ వ్యక్తిత్వంలో ఏమాత్రం స్థాయి తగ్గకుండా తన ఆశయాలకి ధైర్యంగా ముందడుగు వేయడంలో ఈమెకి ఈమే సాటి.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top