You Are Here: Home » ఇతర » వివాదంలో ‘సేవ’

వివాదంలో ‘సేవ’

మానవ సేవయే మాధవ సేవ అంటూ ప్రవచించారు పెద్దలు. అలాంటి సేవా తత్పరతపై ఇప్పుడు నీలినీడలు కమ్ముకుంటున్నారుు. కొన్ని ప్రభుత్వేతర సంస్థలు (ఎన్జీఓ) తమ సేవా కార్యకలా పాలతో మంచి పేరు తెచ్చుకుంటే, మరికొన్ని సంస్థలు అవినీతి, అక్రమాల్లో చిక్కుకుంటు న్నారుు. ేకరళలో అణువిద్యుత్‌ ేకంద్రానికి వ్యతిరేకంగా ఎన్జీఓల ఆధ్వర్యంలో జరిగిన పోరాటానికి విదేశీ నిధులు అందాయని ప్రధానమంత్రి ఇటీవల అభిప్రాయం వ్యక్తం చేశారు.

బీటీ వంకాయను వాణిజ్యపరంగా ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన పోరాటంలో విదేశీ హస్తం ఉందని తాను భావించడం లేదని ఓ ేకంద్ర మంత్రి స్పష్టం చేశారు. వీరి మాటలు ఎలా ఉన్నా రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఫోన్‌ కాల్‌ లిస్ట్‌ ఉదంతంతో ఎన్జీఓలపై అందరి దృష్టి పడింది. ఈ నేపథ్యంలో ఎన్జీఓల సేవా కార్యకలాపాల నిర్వహణ, అవి చేపట్టే ఉద్యమాలు తదితరాలపై కలర్స్‌ ప్రత్యేక

కథనం…
Ngoసామాజిక సేవా సంస్థ, స్వచ్ఛంద సంస్థ, ప్రభుత్వేతర సంస్థ…ఇలా పేరేదైనా ఈ తరహా సంస్థలను స్థూలంగా ప్రభుత్వేతర సంస్థలు (ఎన్జీఓ)గా వ్యవహరిస్తుంటారు. ఈ విధమైన ఎన్జీఓల్లో వివిధ రకాల సేవలు అందించే సంస్థలు, ఉద్యమాలు చేపట్టే సంస్థలు ఉన్నాయి. చిన్నారులకు, పేదలకు, ఆపన్నులకు వివిధ రకాల సేవలు అందించే సంస్థలు ఒక రకం కాగా, సామాజిక రుగ్మతలపై పోరాటం చేసే రకానికి చెందినవి మరికొన్ని. తుపానులు, సునామీ లాంటి సందర్భాల్లో కొన్ని సేవా సంస్థలు ప్రశంసలు పొందినప్పటికీ, మరి కొన్ని సందర్భాల్లో మరెన్నో సంస్థలు వివాదాల పాలయ్యాయి.

మన రాష్ట్రం విషయానికి వస్తే, దశాబ్ది క్రితం శిశువిక్రయాల ఉదంతం ఎంతో సంచలనం సృష్టించింది. అప్పట్లో ఓ పోలీసు ఉన్నతాధికారి భార్య సారథ్యంలోని ఎన్జీఒపై ఆరోపణలు వచ్చాయి. ఇటీవలి కాలానికి వస్తే కేరళలోని అణువిద్యుత్‌ కేంద్రానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం, బీటీ వంకాయ వాణిజ్యీకరణకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం, అవినీతికి వ్యతిరేకంగా జరిగిన అన్నాహజరే ఆందోళన లాంటివాటిల్లో సైతం ఆయా ఎన్జీఒలపై పలు ఆరోపణలొచ్చాయి. వాటిల్లో నిజం లేదని ఆయా సంస్థల ప్రతినిధులు స్పష్టం చేశారు.

బీటీ వంకాయపై….
బీటీ వంకాయను వాణిజ్యపరంగా విడుదల చేయడంపై మారటోరియం విధించడాన్ని మంత్రి జైరామ్‌ రమేశ్‌ సమర్థించుకున్నారు. విదేశీ ఎన్జీఒలు తన నిర్ణయాన్ని ప్రభావితం చేయలేదని ఆయన స్పష్టం చేశారు. అమెరికా, స్కాండినేవియా దేశాలకు చెందిన ఎన్జీఓల ఆందోళనలు, ఒత్తిళ్ళ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారన్న ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. గ్రీన్‌పీస్‌ అనే ఎన్జీఒ బీటీ వంకాయను తీవ్రంగా వ్యతిరేకించింది. అప్పట్లో దీనికి విదేశీ నిధులు అందేవి. ఇప్పుడు దేశీయంగా కూడా దీనికి మంచి మద్దతు లభిస్తోంది. భారతదేశం తీసుకోవాల్సిన విధాన నిర్ణయాలను విదేశీ ఎన్జీఓలు, వాటి అండ ఉన్న దేశీ ఎన్జీఓలు ప్రభావితం చేస్తున్నాయన్న వాదన ఈ సందర్భంగా బలంగా వినవచ్చింది. 99.99 శాతం ఎన్జీఓలు అప్పట్లో బీటీ వంకాయను వ్యతిరేకించడం విశేషం.

కేరళలో…
కేరళలోని కుదంకుళం అణుకేంద్రంపై అప్పట్లో ఎన్జీఒల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురైంది. దీనికి సంబంధించి ఓ ఎన్జీఓపై కేంద్రప్రభుత్వం విరుచుకుపడింది. ఆ సంస్థకు అందుతున్న నిధుల వివరాలను కూడా పరిశీలించింది. ఆ సంస్థ తరఫున పని చేస్తున్నారన్న అనుమానంతో జర్మనీ దేశీయుడు సోన్‌టాగ్‌ రెనిర్‌ హెర్‌మాన్‌ను అక్కడి నుంచి గెంటివేసింది. దీనిపై ఎన్జీఓల నుంచి, సామాజిక ఉద్యమకారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

విదేశీ నిధులు
DSC0aపర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించడం, సామాజిక సేవలను ప్రోత్సహించడంలో భాగంగా బ్రిటన్‌, జర్మనీ, నార్వే తదితర దేశాల ప్రభుత్వాలు, అక్కడి సంస్థలు విదేశాల్లోని ఎన్జీఓలకు నిధులు అందజేయడం ఎప్పటి నుంచో వస్తోంది. భారత్‌కు చెందిన సంస్థలు సైతం ఈ నిధులు స్వీకరిస్తున్నాయి. ఇందుకు లెక్కలు కూడా పక్కాగా ఉంటాయి. కొన్ని మతపరమైన సంస్థల విషయంలో మాత్రం ఇటీవలి కాలంలో కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఆయా నిధులను అవి పరోక్షంగా మత ప్రచారానికి వినియోగించుకున్నాయన్న విమర్శలు వ్యక్తమయ్యాయి.

బీటీ వంకాయను వాణిజ్యపరంగా విడుదల చేయడంపై మారటోరియం విధించడాన్ని మంత్రి జైరామ్‌ రమేశ్‌ సమర్థించుకున్నారు. విదేశీ ఎన్జీఒలు తన నిర్ణయాన్ని ప్రభావితం చేయలేదని ఆయన స్పష్టం చేశారు. అమెరికా, స్కాండినేవియా దేశాలకు చెందిన ఎన్జీఓల ఆందోళనలు, ఒత్తిళ్ళ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారన్న ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. గ్రీన్‌పీస్‌ అనే ఎన్జీఒ బీటీ వంకాయను తీవ్రంగా వ్యతిరేకించింది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top