You Are Here: Home » ఇతర » విలక్షణ ప్రధాని

విలక్షణ ప్రధాని

అతిపెద్ద ప్రజాసామ్య దేశమైన మన దేశంలో హోదాపరంగా రాష్ర్టపతి పదవే నంబర్‌ వన్‌. అరుునా క్రియాశీలకంగా అగ్రతాంబూలం ప్రధాని పదవిేక దక్కుతుంది. కనీసం ఆరుమాసాలైనా…. ఆపద్ధర్మ ప్రధానిగా అరుునా అందలమెక్కితేచాలు…. జన్మధన్యమైనట్లు ఎందరో మహానేతలు భావిస్తుంటారు. సంకీర్ణ ప్రభుత్వాల హవా మెుదలైనప్పటి నుంచి అభ్యర్థి శక్తి సామర్థ్యాలకన్నా అదృష్టానిదే పైచేరుుగా మారిందనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇటువంటి పరిస్థితుల్లోనే దేవెగౌడ, ఐెక గుజ్రాల్‌ వంటి నేతలను ఆ మహా సింహాసనం అక్కున చేర్చుకొంది. భారత 12వ ప్రధానిగా 1997 ఏప్రిల్‌ నుంచి 1998 మార్చి వరకూ 13నెలలు ప్రధానిగా పనిచేసిన ఇందర్‌కుమార్‌ గుజ్రాల్‌ మనమధ్య లేకపోరుునా, ఆయన విదేశాంగ మంత్రిగా పనిచేసిన సమయంలో విదేశాంగ విధానంలో అనుసరించిన పద్ధతి ‘గుజ్రాల్‌ సిద్ధాంతం’గా పేరుగాంచింది. సోషలిస్టు నేతగా, సామాజిక ఫలాలు అందరికీ అందించడం కోసం ఆయన చేసిన ప్రతిపాదనలు ప్రసిద్ధి పొందారుు. గుజ్రాల్‌ అవినీతి ఆరోపణలు లేని రాజకీయ నేతగా మంచి పేరుంది.
manభారత రాజకీయాలలో సంచలనాత్మక సమయమైన జూన్‌ 1975లో గుజ్రాల్‌ ఇందిరాగాంధీ మంత్రివర్గం లో సమాచార శాఖ మంత్రిగా పనిచేశారు. మొరార్జీదేశాయ్‌ కాలంలో మంత్రిగా కొనసాగారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రధాని ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్‌గాంధీ ఆజ్ఞలను ధిక్కరించినందుకు పదవీచ్యుతడయ్యాడు. ఆ తరువాత గుజ్రాల్‌ రష్యాలో భారతీయ రాయబారిగా నియమితుడ య్యాడు. 1979లో సోవియట్‌ సమాఖ్యలోని ఆఫ్ఘానిస్తాన్‌ దురాక్రమణను ఖండించేందుకు ఇందిరాగాంధీని ఒప్పిం చాడు. తరువాత ఆయన 1980లో కాంగ్రెస్‌ను వీడి జనతా దళ్‌లో చేరారు.

ప్రధానిగా… ఎన్నో నాటకీయ పరిణామాలు
1989లో రాజీవ్‌గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ బోఫోర్స్‌ కుంభకోణం ఆరోపణల వలన ఎన్నికలలో అధికారాన్ని కోల్పోయిన తరువాత, జనతాదళ్‌ కూటమి మొదటిసారి అధికారంలోకి వచ్చింది. విపిసింగ్‌ ప్రధానమంత్రిగా ఉన్నారు. నవంబర్‌ 1990లో ఈ సంకీర్ణం కుప్పకూలింది. చంద్రశేఖర్‌ నాయకత్వంలో, జనతాదళ్‌లోని ఒక వర్గం, కాంగ్రసె్‌ మద్దతుతో మరొక కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ సంకీర్ణం జూన్‌ 1991లో కూలిపోయి మళ్ళీ ఎన్నికలు రావడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణమయ్యింది. 1996లో కాంగ్రెస్‌ (ఐ) బయటి నుంచి మద్దతు ఇవ్వగా హెచ్‌డి దేవెగౌడ ప్రధాన మంత్రిగా జనతాదళ్‌ నాయకత్వంలోని యునెైటెడ్గ ఫ్రంట్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ జనతాదళ్‌కు రెండవ విడత అధికారం మొదలయింది. యునెైటెడ్గ ఫ్రంట్‌లోని భాగస్వామ్య పక్షాల మద్దతుతో అధికారాన్ని కైవసం చేసుకోవచ్చనే ఆశతో ఒక సంవత్సరం లోపే కాంగ్రెస్‌(ఐ) తన మద్దతును ఉపసంహరించుకోగా ఇందర్‌కుమార్‌ గుజ్రాల్‌ జనతాదళ్‌ నుంచి తరువాతి ప్రధాని అయ్యారు.

ఒకొక్క మెట్టూ…

వీపీసింగ్‌, దేవెగౌడ ప్రభుత్వాల్లో భారత విదేశాంగ మంత్రిగా విధులను సమర్థవంతంగా నిర్వహించారు. కాంగ్రెస్‌ సహకారంతో యునెైటెడ్గ ఫ్రంట్‌ ప్రభుత్వం దేవెగౌడ ఆధ్వర్యంలో నడుస్తున్నపుడు కాంగ్రెస్‌ పార్టీ ఆయననను మార్చాలని డిమాండ్గ చేసింది. అప్పుడు ఎవరిని ప్రధాని చేయాలన్న దానిపెై అన్వేషణ చేసి సౌమ్యుడుగా పేరొందిన గుజ్రాల్‌ను ప్రధానమంత్రిగా ఎంపిక చేశారు. 199798 మధ్య 12వ ప్రధానిగా ఏడాది పాటు బాధ్యతలు నిర్వహించారు. 1997 ఏప్రిల్‌ నుంచి 1998 మార్చి వరకూ దేశ ప్రధానమంత్రిగా పనిచేసిన ఆయన 1989లో తొలిసారిగా జలంధర్‌ నుంచి లోక్‌సభకు పోటీచేసి విజయం సాధించారు. స్వాతం్త్ర్య సమరంలో కూడా పాల్గొన్న గుజ్రాల్‌కు దౌత్యవేత్తగా మంచి పేరు ఉంది. విదేశాంగ విధానంలో ఆయన అనుసరించిన పద్ధతి గుజ్రాల్‌ డాక్‌ట్రిన్గ్‌గా పేరుగాంచింది. సోషలిస్టు నేతగా, సామాజిక ఫలాలు అందరికీ అందిచడం కోసం ఆయన చేసిన ప్రతిపాదనలు ప్రసిద్ధి పొందాయి.

వివాదాస్పద అంశాలు
గుజ్రాల్‌ ప్రధానిగా ఉన్న సమయంలో 1997 అక్టోబర్‌ 21న ఉత్తరప్రదేశ్‌ రాష్ర్టంలో రాష్ర్టపతి పాలనకు సిఫార్సు చేశారు. అప్పటి బిజెపి కళ్ళాణ్‌సింగ్‌ ప్రభుత్వం విశ్వాస ఓటు కోరింది. అయితే దీనిపెై రాష్ర్టపతి కె.ఆర్‌.నాయణన్‌ సంతకం చేసేందుకు నిరాకరించారు. నవంబర్‌ 1997లో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో క్ట్రు అంశాలు దర్యాప్తు చేసిన జెైన్‌ కమిషన్‌ మధ్యంతర నివేదిక బహిర్గతం అయ్యాయి. అప్పట్లో ఈ విషయమై గుజ్రాల్‌ ప్రభుత్వంపెై నిరసనలు వెల్లువెత్తాయి.

వ్యక్తిగతంగా…
గుజ్రాల్‌ 1919 డిసెంబర్‌ 4న అవిభాజ్య భారత్‌లోని పంజాబ్‌ రాష్ర్టం జీలంలో జన్మించారు. చిన్న వయస్సులోనే 1942లో జరిగిన క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని గుర్గావ్‌ జెైల్లో శిక్ష అనుభవించారు. ఈయన భార్య షీలా గుజ్రాల్‌ కిందటి సంవ త్సరం జులెై 11న మరణించారు. షీలా గుజ్రాల్‌ మంచి కవయిత్రి. పంజాబీ, హిందీ, ఇంగ్లీషూ భాషల్లో అనేక రచనలు చేశారు. గుజ్రాల్‌ సోదరుడు సతీష్‌ గుజ్రాల్‌ ప్రముఖ చ్త్రికారుడు. గుజ్రాల్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. నరేష్‌, విశాల్‌ గుజ్రాల్‌ కుమారులు. నరేష్‌గుజ్రాల్‌ ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు.

ప్రోఫెైల్‌

పూర్తిపేరు		: ఇందర్‌కుమార్‌ గుజ్రాల్‌
పుట్టిన తేదీ : 04.12.1919
మరణం : 30.11.2012
వయస్సు : 93 సంవత్సరాలు
పుట్టిన ప్రదేశం : జీలం, పంజాబ్‌ (పాకిస్తాన్‌)
మరణ ప్రాంతం : గుర్గావ్‌, హర్యానా
రాజకీయపార్టీ(లు) : జనతాదళ్‌ (1988 నుండి 2012 వరకూ)
ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ (1988 ముందు)
భార్య పేరు : షీలా గుజ్రాల్‌
సంతానం : ఇద్దరు కుమారులు
మతం : హిందూ
పదవులు : 12వ భారత ప్రధానిగా
(21.04.1997 టు 19.03.1998)
దేశ ఆర్థికశాఖ మంత్రిగా
(21.04.1997 టు 19.03.1998)
భారత విదేశాంగ శాఖ మంత్రిగా
(01.06.1996 టు 19.03.1998)
విదేశాంగశాఖ మంత్రిగానే
(05.12.1989 టు 10.11.1990)
Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top